Wednesday, September 22, 2010

అసలు ఆడవాళ్ళు బండి తోలగలరంటారా??-1

చెప్పాను కదా నా బండి బాధలు..నిహారిక,పద్మార్పిత,శివ ఇచ్చిన సలహాలు పాటిస్తూ కొంచం కొంచం నడప సాగాను.కానీ నా బండి మా ఇంట్లో వాళ్ళకు కూడా పనిష్మెంట్ లాగా మారింది.నాతో పాటు మావారు,మా అత్తయ్య కూడా రావాల్సిందే.కింద పడితే నన్ను,బండి ని లేపాలి కదా.సరే ఎలాగల ధైర్యం వచ్చింది కదాని ఒక్కదాన్నే బయలుదేరాను .బాగానే వెళ్ళాను ...వెళ్ళింది చాలు ఇంకా బండి మలుపుదాం అనుకోని ,ప్రయత్నించా...చేసిన తప్పెళ్ళ...రైజ్ లో పెట్టి మలిపాను..అంతే నా చేతిలోంచి బండి అలా ఒక పది అడుగులవరకు వెళ్లి ఒక గుంతలో పడిపోయింది .ఎంత ప్రత్నించిన కొంచం కుడా కదపలేక పోయానే!!!!...అప్పుడు మళ్ళి సెం డయిలాగు "ఇంత బరువుంది ఏందిరో "..ఎం చేస్తా ...దారిన పోయేవాల్లని కొంచం హెల్ప్ అడిగాల్సి వచ్చింది .


మళ్ళి బండి తీయాలి అంటేనే బయం వేస్తుంది...నాకు మొదట వచ్చిన డౌట్ ఈ మళ్ళి మళ్ళి వస్తుంది .."అసలు ఆడవాళ్ళు బండి నడపగలరు అంటారా ??"


నేనేమో ఇలా పిచ్చి అనుమానాలతో కాలం వెళ్లదీస్తున్నా ..మొన్న ఆఫీసు దగ్గర సిగ్నల్ లో ఒక పెద్దావిడ (నలభయి పయిమాటే) టయోట నడుపుతా వెళ్తున్నారు ...


నేనేమో కనీసం స్కూటీ కూడా కడపలేకున్నాను ..

అసలు ఏదయినా సులభ మార్గం ఉంటే చెప్పండి.."ఉంటే బండయిన ఉండాలి,లేకుంటే నేనయిన ఉండాలి "అని శబధం పూనాను.సలహాలు చెప్పిన వారికి బహుమతులు ఇవ్వబడును .....



Saturday, September 18, 2010

అసలు ఆడవాళ్ళు బండి తోలగలరంటారా??

అమ్మో అసలు ఆడవాళ్ళు బండి తోలగలరంటావా??
ఇదేంది మరి ఇంత బరువు ఉంది ?
అసలు నావల్ల అవుద్ది అంటారా???
    నిన్న తోటరాముడు బ్లాగ్ లో ఒక్కరోజులో ఈత ఎలా నేర్చుకోవాలో చెప్పారు కదా!!!నాకు కూడా ఎవరయినా ఒక్క రోజులో బండి నేర్చుకునే ఉపాయం ఉంటె చెప్పరా??మరి ఎందుకంత తొందరా??ఏమిటా కధ అనుకుంటున్నారా??,వస్తున్నా ,వస్తున్నా... అక్కడికే వస్తున్నా.
             సొంత ఇల్లు కదా కొంచం ప్రశాంతమయిన వాతావరణం లో ఉంటె బాగుంటుంది అనే ఉద్దేశ్యం తో రైల్వే స్టేషన్ కి అయిదు కిలోమీటర్ల దూరం లో తీసుకున్నాం.కొనేటప్పుడు తెలియలే ఇలా డైలీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని.ఆఫీసు నుండి బయలుదేరేటప్పుడు మా ఆయనకు ఫోన్ చేస్తే ..ఇప్పుడే రావద్దు ,నా వర్క్ అవలేదు.ఒక గంట ఆగి బయలుదేరు అంటారు.అందరు వెళ్లిపోతుంటే నాకేమో ఏడుపువస్తుండేది . ఎలా ఎన్ని రోజులు ???లాభం లేదు ఏదోకటి చేయాలి అని..నేను ఒక్కదాన్నే వెళ్ళే ప్రయత్నం చేశాను.ఒకరోజు,దారిలో పోకిరి వెధవ ఒకడు టీజ్  చేసాడు .నాకు బయం,మా అయన మీద కోపం.మళ్లీ కధ మొదటికి వచ్చింది.నాకు ఎనిమిదిన్నరకే రావడానికి కుదుర్తది..అప్పటి వరకు నువ్వు ఎలాగోలా ఆఫీసులో టైం పాస్  చేయి అని ఖరాకండి గా చెప్పేశారు మా ఇంటాయన(బంగారు కొండ!!!???). ఆఫీసు లో ఏమో మా  మానేజర్ దొరికిందే అదునుగా ,అయన పని కూడా నాకే ఇచ్చేసి ,తను మాత్రం టింగురంగ అనుకుంట ఆరింటికే ఇంటికి వెళ్తున్నాడు.పాపం అమ్మాయి కష్టపడుతుంది ,ఒక క్యాబు పెట్టిస్త అనవచ్చు కదా !!!అబ్బే ,అంత మంచి మనసా??  ఇలా అయితే నా ఇమేజ్ డామేజీ అవుతది కదా..అని ఒక రోజంతా అలోచించి ...ఒక కత్తిలాంటి ప్లాన్ వేసా.ఎక్కడి స్విచ్ వేస్తే ,ఎక్కడ బుల్బ్ వేలుగుతుందో మనకు బాగా తెలుసు కదా.అదే అండి..మా అత్తగారి దగ్గరి వెళ్లి ,కొంచం ఏడిచినట్లు నటించా.పాపం మా అత్త గారు కరిగిపోయి ..వెంటనే ఆర్డర్ పాస్ చేసారు."వచ్చి అమ్మాయిని ఇంట్లో దింపి ,కావాలంటే మళ్ళి వెళ్లి నీ వర్క్ పూర్తి చేసుకో "..హే..జజ్జి నక ,జజ్జి నక...
  
    అయినా మన పిచ్చి కాని ,మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే..మగ మహానుభావులు వాల్లకేన్ని ఉండాలి చెప్పండి.ఒకానొక మంచి రోజు .."బుజ్జి అందరు చూడు ఎంత బాగా బండి నడుపుతున్నారో ..నాకు కూడా ,నువ్వు అలా,అలా జామ్ అని బండి మీద వెళ్తుంటే చూడాలి అని ఉంది రా " అన్నారు.అసలే మనది వెన్నలాంటి మనసు ...ఇలా స్టవ్ మీద పెట్టి కరగ పెడితే ఏమవును???నేను కూడా వెంటనే ఒక బలూన్లో హెల్మెట్ పెట్టుకొని ,బండి మీద వెళ్తున్న అమ్మాయిని తలుచుకున్న...ఒహ్హ సూపర్ .మరి బండి ఎలా అని అడిగా అమాయకంగా.నువ్వు తోలుతా(నన్ను వదులుతా!!!) అంటే అదెంత పని చిటికలో కొనిపెట్టను..అనేసారు.చెప్పినట్లు గా ఒకరోజు తిరిగే కల్లా బండి నా చేతుల్లో పెట్టారు... అందరు హాప్పీస్..ఆ టైం లో నేనుకూడా అనుకోండి!!!."ఇంఫ్రెంట్ దేర్ ఇస్ క్రోకడయిల్ ఫెస్టివల్ " అని తెలియదు కదా అప్పుడు.
      మరుసటి రోజు పొద్దున్నే సరే రా,నువ్వు ఇవాళ నీ బండి మీద పో..నేను నీ వెనకాల వస్తా ఉంటా అన్నారు..ఒకసారి చెన్నై రోడ్డులు అన్ని నా కల్లా ముందు గురుక్కున తిరిగాయి..అదేంటి?? నాకు బండి నడపటం రాదు కదా అని మెల్లగా చెప్పా.ఒక వారం రోజులు నేర్చుకొని,తరువాత తీసుకెళ్త, అని అమాయకంగా పేస్ పెట్టి అడిగా.ఆ సమయం లో నా పేస్ చూస్తే ఎలాంటి వారయినా జాలి పడాల్సిందే మరి!!!
సరే వారం అంటే వారం రోజుల టైం ఇస్తాను అన్నారు.సరే సరే అని గంగిరెద్దులా తల ఊపాను ..ఇప్పటికి బండి కొని రెండు నెలలు అయింది.ఒక్కటి రెండు సార్లు మాత్రం అసలు నడపగలమా అని బరువు మాత్రం చూసి అక్కడ పెట్టాను.ఇంతకు ముందే నయం,వచ్చి దింపి రావడం ఇబ్బంది అని విసుక్కునే వారు..ఇప్పుడు ఈ బండి పుణ్యమా అని...మూడింతలు తిట్ల లిస్టు పెరిగిపోయింది.ఎం చేస్తాం అంత నా కర్మ.ఇక ఆ తిట్లు పట్టలేక,నిన్న తీసాను బండి..ఎంత నెట్టినా, ఒక్క అడుగు కూడా ముందుకు పోదే??అదేదో క్లచ్చు అంట అది పట్టుకుంటే నే స్టార్ట్ అయితది అని ,స్టార్ట్ చేసి చూపించారు.ఎలాగో అలా మా అయన సహాయం తో స్టార్ట్ చేసాను..
   కుడి చేతిలో ఉన్న హన్డిలు ను రైజ్ చేయి అన్నారు..నేను నా బలమంతా ఉపయోగించి తిప్ప...
  "ధమాల్" -- బండి శబ్దం .
  "ఏమండి" --నేను
  "బుజ్జి" ...మా అయన .
అన్ని రకాల శబ్దాలు ఒకేసారి.
       అంతే మళ్ళి బండి జన్మలో ముట్టుకోకూడదు అనుకున్న.మా వారు ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే అన్ని సద్దుకుంటాయి లే ,"అయినా.. దెబ్బలు తగలకుంట బండి ఎలా వస్తది??ఇదంతా కామన్ "అని తేలిగ్గా చెప్పేశారు.'ఈ బండి నా సావుకొచ్చిందిరో నాయన 'అంటూ..మళ్ళి అరగంట తరువాత మెదలేట్టాం .పక్కనే ఉన్న గ్రౌండ్ స్పాట్ అయింది ఇప్పుడు.అక్కడ కొంత మంది తాతయ్యలు వాకింగ్ చేస్తున్నారు కాబోలు.వద్దండి వాళ్ళకు ఇబ్బంది అని చెప్పి తప్పించుకుందాం అనుకున్న...కాని నా పప్పులేం ఉడకనివ్వలేదు మా అయన... ఇవాళ ఈ స్పాట్ లో ఎవరికో ఒకరికి స్పాట్ ... అనుకోని మళ్ళి బండి పట్టుకున్న.ఒక వంద కేజీ ల బరువుంది అనుకుంట అది.


నడపాలి అంటే బయంవేసి ...ఏమండి కొంచం సేపు తోస్తే బాలేన్సింగ్ వస్తది ఏమో కదా అని అడిగా..(ఎలాగో అలా రాత్రి పది అవాలి కదా ..టైం పాస్ చేయాలి అనే ఉద్దేశ్యం తో)..ఎం కాదులే అలా తోస్తే బరువు మోయలేవు...చేతులు నొప్పి పెడతాయి అన్నారు.పాపం నా మీద ఎంత ప్రేమో మా ఆయనకి..సరే అని మళ్ళి నెమ్మది గా క్లచ్చు కొట్టి,మెల్లెగా రైజ్ చేసి...స్టార్ట్ చేశా.ఇప్పుడ నా టార్గెట్ అంత ఆ తాతయ్యలకి ఇబ్బంది కాకుంట నడపటమే.మెల్లి గా స్టార్ట్ చేసాక మా అయన బండి పట్టుకోకుంట వదిలేసారు..."అదేంటో నా మనసు ,ద్రుష్టి తాతల మీద ఉంది కదా...బండి నేరు గా వాళ్ళ వాయిపే పోయింది.."


"అమ్మో ,నా సత్తిటానే"--తాతయ్య(తమిళ్ తాతయ్య లెండి )..


"నా మీదనుండి బండి తీయండి ప్లీజ్ "--నేను


"నే చెపుతానే ఉన్న,హేండిల్ తిప్పు అని ..వింటావా??" --మా వారు.


ఇంకా నయం ఆ తాతగారు గట్టి వారు కాబట్టి చేతికి మాత్రం చిన్న గాయం .కాని నా పరిస్థితే..దెబ్బలు తగలకుంట బండి రాదేమో కాని...దెబ్బలు తగిలిన్చుకోవడానికే బండి కొనుక్కున్నాను అని చెప్పుకోవాల్సి వస్తుంది.సరే ఇవాలకి ఇది చాలు లే అని మా అయన అంటుంటే...ఇవాళ కి పడ్డది చాలులే!!! అన్నట్లు వినిపించింది నాకు..ఏంటో .
     మళ్ళి ఇవాళ నైట్ ప్రాక్టీసు ఉంది అంట...ఏమో మరి ఇంకా ఎన్ని సార్లు పడాలో,ఎందరికి స్పాట్ పెట్టాలో ..చూడాలి.


ఏమండోయ్ ,నా బండి బాధలు చూసారు కదా..కొంచం సులభ మార్గం లో బండి ఎలా నేర్చుకోవాలో సెలవిద్దురు..వచ్చే జన్మలో మీ బండినయి పుడతాను ..బాబ్బాబు మీకు పుణ్యం ఉంటది .






Tuesday, September 14, 2010

NIIT తో నా అనుబంధం ...2

హ్మ్..నేనేం చేశాను అనేదాని మీద అందరు తమ ,తమ అభిప్రాయాలు చెప్పారు కదా...ఇప్పుడు ఎవరు సరిగ్గా ఉహించారు అనేది చూద్దాం(క్లాసు లో మాస్టారు లెవెల్ లో పోసు కొడుతూ..!!!)...


నేనేం చేసానో చెప్పేముందు ..ఒకసారి ఆ స్టూడెంట్ గురించి ,తను చదివే కోర్సు గురించి చెపుతా(అబ్బే..వేరే ఎం లే ...కొంచం క్లారిటీ కోసం అని).తను ఇంజనీరింగ్ చేసే కాలేజి చాల ఫేమస్ మరియు ఖరిధయినది కూడా..అక్కడ చెప్పేది సాలదన్నట్లు ,అయ్యగారి కి ప్రైవేటు పెట్టించారు .మా NIIT లో తను చేరిన కోర్సు అక్షరాల "లక్షన్నర".అంత ఖర్చు పెట్టి ప్రైవేటుకు పంపుతే ,మన హీరో గారు..క్లాసు లో మేడం ని (అంటే నన్నే,నన్నే) కామెంట్ చేయడం,క్లాసు జరుగుతున్న సమయం లో కుక్క,బర్రె సౌండ్స్ వచ్చే రింగ్తోన్స్ మోగించడం,ఇష్టం వచ్చినట్లు ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం ,కబుర్లు -కాకర కాయలు చెప్పడం ..ఇలా ఒకటేమిటి అయ్యగారి పనులు కోకొల్లలు .ఒక సారి తన వెధవ పని వల్ల నేను క్లాసు నుండి బయో-కట్ కూడా చేయాల్సి వచ్చింది .వాడు ఒక రకమయిన సాడిస్ట్ అనుకుంట,ఎప్పుడు ఏదో ఒకటి అని..అమ్మాయిలని కూడా ఏడిపించే వాడు..వెధవ.అలాంటి వాడు నాకు "ఎం కావలి అంటే అది ఇప్పిస్తాను" అంటే ఎలా వదులుతా చెప్పండి??
రమ్మని చెప్పినట్లుగా ఆఫీసు కి వచ్చాడు ,ఒక్కడే కాదు ,వల్ల బాత్చు లో ఇంకా కొంత మంది వెధవలని కూడా తీసుకొచ్చాడు.వాళ్ళు కూడా "ఎం కావలి అంటే అది ఇస్తాం" అనడాని కి రెడీ గా ఉన్నారు అనుకుంట...వెళ్ళంగానే "గుడ్ ఈవెనింగ్ " అంట...అబ్బో..ఇదే ఫస్ట్ టైం అనుకుంట అంత వినయం గా చెప్పడం..ఒకడయితే ,వాడు లేచి మరీ కుర్చీ ఇస్తున్నాడు ....సరే అందరూ క్లాసు రూం నెంబర్ :2 లో కూర్చో మని చెప్పి ..నా పని లో నేను పడ్డాను.ఒక గంట ఆగి ఒకడు వచ్చి గుర్తు చేసాడు..మనోళ్ళు నేను వాళ్ళకు ఏదో గొప్ప హెల్ప్ చేయబోతున్నాను అని తెగ ఫీల్ అవుతున్నారు ...వెళ్లి అందరి కి ఒక సిస్టం ఇచ్చి ...ఎక్షమ్ షెడ్యులు చేసి...రాయమని చెప్పాను..అప్పుడు చూడాలి ఒకొక్కరి మొహాలు...ఏడుపొక్కటే తక్కువ..ఎన్ని సార్లు నన్ను ఈ విధం గా ఏడిపించారో వెధవలు...అని మనసులో తిట్టుకొని..."నా షిఫ్ట్ టైం అయిపోయింది ..నేను బయలు దేరుతున్న ...ఎక్షమ్ బాగా రాయండి ...అల్ ది బెస్ట్ " అని కూల్ గా చెప్పి బయటకు వచ్చేసాను .కుడితి లో పడ్డ ఎలుకల్లా ...గిల గిల కొట్టుకొని ..ఎక్షమ్ హాల్ లో నుండి బయటకి వచ్చి...రిజల్ట్స్ పేపర్ మీద సంతకం పెట్టారు అంట.అందరూ ఫెయిల్ అనుకోండి.
మిగతా స్టూడెంట్స్ కి మరుసటి రోజు ఎక్షమ్ జరిగింది..అంత పాస్..చూసారా??ఒక ఫోన్ కాల్ ఎంత పని చేసిందో...
ఆతరువాత మన హీరో తల్లిదండ్రులని ని తీసుకురావడం,బ్రతిమిలాడి సుప్ప్లి పెట్టించుకోవడం,అది కూడా నాతోనే రాపించటం అన్ని చక చక జరిగి పోయాయి అనుకోండి.ముందు తనని కాదు లెండి,వాణ్ని ప్రోత్సహించే తల్లిదండ్రులని అనాలి..ఇన్ని లక్షలు కట్టాం..ఆ మాత్రం హెల్ప్ చేయకుంటే ఎలా అని మాట్లాడారు వాళ్ళ తల్లిదండ్రులు.డైలీ గంటలు,గంటలు క్లాసు చెప్పి ,చివరికి వాళ్ళ పరీక్షలు కూడా మీమే రాయాలి అంట.ఇదెక్కడి న్యాయం చెప్పండి.ఇప్పటి విద్యావ్యవస్థ అలా మారి పోయింది మరి.ఆ మాత్రం దానికి మేము పాఠాలు చెప్పడం దేనికి ,డైరెక్ట్ గా పరిక్షలు రాసేస్తే సరిపోలే??

అదన్నమాట జరిగింది...దీని వల్ల తెలిసిన నీతి ఏంటి??మీకే వదిలేస్తున్న....

Monday, September 6, 2010

NIIT తో నా అనుబంధం ...1

గురు పూజోత్సవ శుభాకాంక్షలతో ...టీచర్స్ డే అనగానే చిన్నప్పుడు బాగా సంతోషం గా ఉండేది...ముందు రోజునుండే పూలు కొని పెట్టడమో,లేక తెలిసిన వాళ్ళ ఇంట్లో కోసుకురావడమో చేసే వాళ్ళం.. ఎక్కువ గా ఎన్ని పులమాలలు వస్తాయో ,ఆ మాస్టారే గొప్ప అని చాలా చాలా గొప్పలు చెప్పేవాళ్ళం.నాకు చాలా ఇష్టమయిన పండగలలో ఇది కూడా ఒకటి,,,ఎందుకంటే ..ఆ రోజు హాఫ్-డే స్కూల్ ఉండదు కాబట్టి.


ఇలా చెప్పుకుంట పోతుంటే, నాకు నేను NIIT లో faculty గా చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి..అందరూ ఇంజనీరింగ్ పిల్లలే వచ్చే వాళ్ళు.నాకు ,వాళ్ళకు పెద్దగా వయస్సులో తేడా లేక పోవడంవళ్ళ ,బాగా చనువు గా ఉండే వాళ్ళు.మాకు క్లాసు నాలుగు గంటలు ఉంటది..కాని పిల్లలు అస్సలు చెప్పనిచ్చే వాళ్ళు కాదు . కాని చెప్పిన కొంచం సేపు అయిన స్ట్రిక్ట్ గా ,అర్థం అయ్యేలా చెప్పేదాన్ని అనుకోండి...అందుకే నేను చాల తరగతులకు ఇష్టమయిన పంతులమ్మని ... తెలుసా ???ఎందుకంటే ..ఎగ్జామ్స్ టైం లో బాగా హెల్ప్ చేసేదాన్ని కూడా!!!నాకు ఇంకా బాగా గుర్తుంది ...ఒకసారి నా పుట్టిన రోజు పండగ ...అన్ని తరగతుల వాళ్ళు కలిసి చాల వయిభవంగా నిర్వహించారు...ఒక చీరని కూడా బహుకరించారు.కానీ నాకు కట్టుకోవడం రాదు అని చెప్పలేక పోయాను ...ఏదో వాళ్ల అభిమానం అనుకున్న..తరువాత తెలిసింది ఆ రోజు జరగవలిసిన అన్ని తరగతులు పోస్ట్పోన్ చేయాలి అని.ఎం చేస్తాం వాళ్ల సంతోషమే నా సంతోషం కదా,పోనిలే అని వదిలేసా.కాని ఆ అభిమానం హద్దులు దాటింది అండి..
ఒక రోజు పొద్దు పొద్దున్నే (8 am )ఒక స్టూడెంట్ కాల్ చేసాడు..నేను నిద్రలో నే ఉండి ఫోన్ లో ....

నేను:"హలో "
స్టూడెంట్: "మేడం ,నేను X (పేరు గుర్తుకు లేదు లెండి) "
సరే నేను ఆఫీసు కి వచ్చి మాట్లాడతా ...అని కట్ చేశాను ..మళ్ళి ఫోన్ రింగ్ అయింది ..
నేను:"హలో "
స్టూడెంట్: "మేడం ,నేను X ని "
నేను:"ఆఫీసు లో మాట్లాడతాను అని చెప్పా కదా !!"
స్టూడెంట్: "మేడం,ఒక్కసారి నేను చెప్పేది వినండి ,ఆఫీసు లో అంటే కష్టం"
నేను:" హ్మ్మం ....చెప్పు బాబు "

స్టూడెంట్:"మాకు రేపు పరీక్షా "

నేను:"అవును "

స్టూడెంట్:"అదే మీకు ఒకసారి గుర్తు చేద్దాం అని"

నేను:"ఏంటి ఎగసెకలా?"(బ్రహ్మానందం డయిలాగు)

స్టూడెంట్:"అల అని కాదు ,నేను ఖచితంగా పాస్ కావాలి మేడం"

నేను:"చదువు మరి,ఏమయినా అర్థం కాకుంటే నేను చేపుతలే ఇవాళ "

స్టూడెంట్:"అదంతా కుదరని పని "

నేను:"అంటే"

స్టూడెంట్:"మీకు ఏం కావలి అంటే ,అది ఇస్తా నాకు పరీక్షలో సహాయం చేయాలి,నేను ఇంత వరకు పుస్తకం కూడా తీయలేదు .ప్లీజ్ మేడం "






నాకు సుక్కలు ,ఆకాశం అన్ని కనపడ్డాయి.


ఏందీ,నాకు ఏం కావలి అంటే అది ఇస్తాడు అంట...నిద్ర మత్తు మొత్తం పోయింది అనుకోండి.


మళ్ళి ఫోన్ లో


నేను:"సరే ఇవాళ నా ఆఫీసు రూం లో కలుద్దాం "

స్టూడెంట్:"థాంక్స్ మేడం ,ఇంకా నిద్ర లేవ లేదు అనుకుంట ..మీరు పడుకోండి "


మా బాబే...ఎంత మంచి మనసో ,పిచ్చిసన్నాసి ....అని అనుకోని ,ఎదావిదిగా మళ్ళి నిద్ర పోయాను లెండి.


ఇంతకు నేను ఏం చేసి ఉంటానో guess చేయండి చూద్దాం!!!....హ్యాపీ డేస్ సినిమా లో శ్రేయ మేడం లా...రూం కి తీసుకెళ్ళి మందలించానో లేక వాళ్ల నాన్న ఆస్తి లో భాగం అడిగానో ???


మీకే వదిలేస్తున్న....నేను ఏం చేశాను అన్నది తరువాతి టపా లో ....

Thursday, July 22, 2010

I miss u my friend...

విను ...ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయి.నిజం ఈ కాప్షన్ తనకు నూటికి నూరు శాతం సూటు అవుతుంది.సున్నిత స్వభావం,మంచి మనసు ఉన్న అబ్బాయి.అటు ఇటు పెళ్లి కావలసిన వయస్సు...కానీ ఇంతవరకు మాట వరసకు కూడా అమ్మాయిల టాపిక్ చెప్పిన సందర్బాలు లేవు.నాకు ఒక మూడు సంవత్స్తరాలు గా మంచి మిత్రుడు.తమిళ్ అబ్బాయి ..పల్లెటూరు వాతావరణం లో పెరిగి వచ్చాడు .అందులోను వాళ్ళ నాన్న గారు రిటైర్ అయిన అర్మి ఉద్యోగి.కొంచం బరువు ,బాధ్యతలు ఎక్కువే అనుకోండి(కొంచం కాదు లెండి ,మోయలేనంత ఎక్కువ )...ఇద్దరు అక్కలకి పెళ్లి చేసాడు,ఒక అక్క కి ఇంకా పెళ్లి చేయాలి....ఏదో మెదడు సంభంద వ్యాదితో బాధపడుతున్న అన్న ఉన్నారు...ఇవన్ని చక్క పెట్టి....తను పెళ్లి చేసుకోవాలి...!!!! బహుశా ఈ భాద్యతలే  తనను తన గురించి ఆలోచించ నివ్వట్లేవు కాబోలు.  
 
ఫ్రెండ్ అని మోసేస్తున్న అనుకోకండి...నిజం గా చెపుతున్న అండి...చాలా చాలా మంచి కుర్రాడు.మీరే చెప్పండి ఈ కాలం లో తన గురించి కాకుంట కుటుంబం గురించి పాకులాడే వాళ్ళు ఎంత మంది ఉంటారు ???నాన్న కు వచ్చే పెన్షన్ ఏమాత్రం సరిపోతుంది చెప్పండి...ఇద్దరు అక్కలకి పెళ్లి చేసిన ..సారెలు,చీరాల పేరుతో వాళ్ళని కూడా చుసోవాల్సిందే.ఇవన్ని తన బాధ్యతగా తనే చక్కగా నెరవేర్చు కొస్తాడు..చాలా ఓపికగా ..ఎన్ని ఇబ్బందులు వచ్చినా...మా ఫ్యామిలీ కోసమే కదా అని భరిస్తాడు ...మాతో పటు ఆఫీసు కొస్తాడు ....సాయంత్రం టైం లో ప్రైవేటు పాఠాలు చెపుతాడు....ఒక సారి ఆన్సయిటు ఛాన్స్ వస్తే వద్దు అంటున్నాడు...తనకు డబ్బు ఎంత అవసరమో నాకు బాగా తెలుసు మరి ఇదేంటి బంగారం లాగా వచ్చిన ఛాన్స్ వద్దంటాడు?ఏంటా అని ఆరా తీస్తే .... అక్క కి బాబు పుట్టి అయిదు నెలలు అయింది ...మేడలో బంగారు గొలుసు వేయకుండా పంపిస్తే వాళ్ళ అయన ఊరుకోరు ...ఇప్పుడు నేను దుబాయ్ వెళ్తే ...ఆ డబ్బు ఎవరు సద్దుతారు అని చెప్పి, వాపోయాడు!!! ...నాకు చాలా బాధేసింది ..సరే అ డబ్బు నేను మీ ఇంట్లో ఇస్తాను, నువ్వు వెళ్ళు దుబాయ్ కి అని చెప్పాక ...ఒప్పుకున్నాడు.... చూసారా అండి!!!...ఎంతగా ఆలోచిస్తున్నాడో ఫ్యామిలీ గురించి.


         ఇప్పుడు ఎందుకు ఇతని గురించి చెపుతున్న అనుకుంటున్నారా???వస్తున్నా,వస్తున్నా ...అక్కడి కే వస్తున్నా.....తనకి చాలా మంచి జీతం తో ....HP  లో ఉద్యోగం వచ్చింది అండి....ఇవాళే మా కంపని లో లాస్ట్ వర్కింగ్ డే ....ఇంత మంచి మిత్రున్ని దూరం చేసుకున్తున్నమే అని కొంచం బాధగా ఉంది....అదీ కాక...నేను ఎప్పుడు తనని సరదాగా ఏడిపిస్తా ఉంటా....ఇకపయిన ఎవరిని ఏడిపించాలో ఎమో???ఒకటే దిగులు గా ఉంది...కానీ విను మాత్రం తెగ సంతోషం గా ఉన్నాడు...శాలరీ మాత్రమే కాదు అంట...నా వచ్చీ, రాని తమిళ్ నుంచి తనకు ఉపశమనం కలిగింది అని తెగ సంబర పడి పోతున్నాడు....కాని నేను వదల కదా!!!...నాకు కూడా HP ఉండే కాంపస్ లోనే ఇంకో మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చిందోచ్ ......వదల బొమ్మలి ...వదల......!!!!!


             ఏదీ ఏమయినా తనని మిస్ అవ్వబోతున్నాం అని చాలా బాధగా ఉంది....కానీ తను ఇకనయిన చక్క స్థిర పడాలి అని మనసారా కోరుకుంటూ...I wish all the very best for your bright future my dear friend.All is Well.


ఇంకో మాట అన్డోయి...విను కి ఇప్పుడే ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది ,,,,ఇప్పుడే మెసేజ్ ల దగ్గర ఉన్నారు....అదీ అలా అలా .....పెళ్లి వరకు రావాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నాను.

Saturday, July 17, 2010

ఏమయినది ఆ నా వాలు జడ...







అన్నవరం సినిమా లో పవన్ కళ్యాణ్ దొంగతనాని కి వెళ్లి "జడ "కత్తిరించుకొస్తారు.....ఇంచు మించు  అలాంటి సంగటనే నాకు కూడా ఎదురయింది....ఇవాళ ట్రైన్ లో ఒక అమ్మాయి వాలు జడ చూసి నాకు నా "వాలు జడ " గుర్తుకొచ్చి ,ఏడుపొచ్చి ...వెంటనే ఇలా మొదలు పెట్టాను....


      మొదటినుంచి నాది చాల మంచి హెయిర్....సిల్కి గా, నల్లగా మరుయి  పొడుగ్గా  ఉండేది .గొప్పలు  చెప్పుకుంటున్న  అనుకుంటున్నారా ???నిజ్జం  గా నిజమే  చెపుతున్న  అండి!!!! ...సన్ సిల్క్ మోడల్  హెయిర్ లా ఉండేది .పదవతరగతి  వరకు  బాగానే ఉంది ...ఇంటర్  కి వచ్చేటప్పటికి కొంచం  కొంచం రాలిపోవడం  మొదలయింది .... ఇంటర్ లో మొదటిసారి కత్తిరించా  నా జుట్టుని ....అది కూడా శుక్రవారం  రోజు ....శుక్రవారం  జుట్టు  అస్సలు కత్తిరించకూడదు  అంట ...అప్పుడు  ఆ  విషం  తెలిసి  చావదు!!! ...అలా  చేస్తే  జుట్టు పెరగదు  అంట ....ఇప్పడు  అనిపిస్తుంది,  అది నిజమేనేమో   అని ....ఏం  చేస్తాం  అంత  విధి రాత ....ఇంకా  అప్పటి  నుంచి  కొంచం  కొంచం  గా లావు  తగ్గడం మొదలయింది ...ఇంటర్  పూర్తి  అయ్యేవరకి ....T .B   వచ్చిన  రోగిలగా  సన్నగా  అయిపోయింది ...
ఇంకా ఏమి చేస్తాం ..అది అలా  నాగుపాముల  ఉన్న  కత్తిరిస్తే  మా  అమ్మ  కొడతారు  అనే  భయంతో  ..అలాగే  మైంతైన్  చేస్తూ వచ్చా ....
రోజు మా గ్యాంగ్ ఎంత ఏడిపించిన భరించే దాన్ని కాని....కత్తిరించే ధైర్యం లేదు.ఇలాగే ఒక రెండు సంవత్సరాలు నెట్టుకొచ్చా ....కానీ హారిక కళ్ళు అన్ని నా జుట్టు మీదనే ...
అనగనగ ఒక రోజు ...సెమిస్టరు ఎగ్జామ్స్ అని 'కంబయిండు స్టేడి'  కోసం పద్దు రూం కి వెళ్ళాం ....అప్పటికి వరకు బాగానే చదువుకున్నాం ....టైం పన్నెండు కావస్తుంది...సడన్ గా హారిక....హే నీ జుట్టు బాగానే ఉంది కానీ...కొంచం షేపు చేస్తే ఇంకా బాగుంటది అని అనింది ....ఆహా నా వీక్నేస్స్ మీద కొట్టిందే!!! ...సరే  కానీ, కట్ చేయకూడదు అని చెప్పా అమాయకంగా.నీ మొహం, కట్ చేయకుండా ఎలా షేపు చేస్తారు???కొంచం అయిన కట్ చేయాలి....అంటే సరే అని ఒప్పేసుకున్న...ఒక కొంచమే అని మరీ మరీ చెప్పా.సరే నువ్వు అటు తిరుగు ...అస్సలు కదలొద్దు ...కదిల్తే షేప్ పోతది అని చెప్పారు ...సరే అని ఒప్పుకున్నా ....ఒక అద్దం ఇచ్చి కూర్చో పెట్టారు ...కదుల్తే నీ ఇష్టం ...మొత్తం పాడు అవుతది అని చెప్పేసరికి భయం వేసింది.చేస్తుంది చేస్తుంది ,...చేస్తానే ఉంది .....ఒక పావుగంట అయింది ...ఇంకా షేపు అవదే??? ....ఇంకా ఎంత సేపు.. అని అడిగా ....ఇదిగో అయిపోయింది... అని చేతులో పెట్టింది ...ఒక మూర జడ!!!! .....అప్పుడు చూడాలి నా ఫీలింగ్స్...ఏడవాలో ,నవ్వాలో కూడా తెలిదు ....వెంటనే హారిక...ఇప్పుడు చూడు ఎంత బాగుందో...ఇన్ని రోజులు పల్లెటూరు అమ్మాయి లా ఆ పాముని వెంట వేసుకొని  తిరిగేదానివి..."ఇప్పుడు అంత చిన్న జడ(పోనిటేల్) ఈ పాషన్"... అని ఒత్తాయింపు వేరే... ఏం చేస్తాం???చేసేది ఏమి లేక ఆ జడ నే చూస్తూ,ఫీల్ అవుతూ నవ్వినట్లుగా ఆక్షన్ చేశా ..
       ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ ఏమంటారో.?? అని బయపడుతునే వెళ్ళాను...'కాలు ఇంటి లోపల పెడితే ...కాలు విరుగుద్ది' అని కట్టే పట్టుకొని నిల్చున్నారు గుమ్మం ముందు.తెలియక కట్ అయింది అమ్మ.. అని చెప్పినా.. వినరే ....!!!!అల ఒక నెల వరకు ...నా జుట్టు కనపడినప్పుడల్లా తిట్ల భారతం  కొనసాగుతూనే ఉండేది...మా అమ్మ నన్ను,నేను హరికని తిట్టుకోవడం అలవాటు అయిపొయింది.కానీ...ఇంతకు ముందయినా లావు లేకున్నా, పొడగు అయిన ఉండేది .ఇప్పుడు  చూడండి.. అటు లావు లేదు ,ఇటు పొడవు లేదు(ఈ టీ లో రంగు లేదు ,రుచి లేదు టైపు లో ) ...సరే ఈ పొట్టి జుట్టయిన లావుగా పెంచుదాం లే అని అడ్జుస్ట్ అయ్యాను ...ఎన్ని చేసిన పొడవు పెరగదు,లావూ పెరగదు....ఇంకా విసుగొచ్చి జుట్టు గురించి పట్టించుకోవడం మానేసా...నేను పట్టించుకోకుంటే ,మేమయిన పట్టించుకోవాలి కదా అని మా గ్యాంగ్ రెడీ గా ఉండే వాళ్ళు...
ఇప్పుడిప్పుడే నా పొట్టి జుట్టు అలవాటు అయి ...పొడుగు జుట్టు సంగతి మర్చి పోయారు మా అమ్మ.కానీ మేము ఒకదగ్గర కుదురుగా ఉంటే కదా ...ఒక రోజు హారిక సడన్ గా వచ్చి....మా అంటీ ఒకరు బ్యూటీ పార్లర్ పెట్టారు...చాల బాగా హెయిర్ స్టైల్ చేస్తారు....నీ జుట్టు ఎలాగో పెరగట్లేదు కదా,....దాన్ని రింగులు గా మారుస్తే...కొంచం లావుగా కనపడుతుంది ...చాల తక్కువ రేటులో చేస్తారు ...అలా చేపిద్దాం అని చెప్పింది.సరే అలా చేస్తే అయిన మా అమ్మ కొంచం సంతోషిస్తారు అనుకోని సరేఅనేశా....
           నెక్స్ట్ రోజు హారిక ఇంటికి వచ్చి తిసుకెల్లింది పార్లర్ కి....అంటీ ని పరిచయం చేసాక...లోపలి కి తను మాత్రమే పంపండి అని చెప్పి వెళ్లి పోయారు ఆ పార్లర్ అంటీ ...వెళ్ళే ముందు పేస్ ఫీచర్స్ బాగున్నాయి అనే కంప్లిమేంట్ కూడా ఇచ్చారు లెండి!!!!....ఇంకేముంది రెచ్చిపోయి,సరే నే మీరు వెయిట్ చేయండి...నేను రింగుల జుట్టు చేపించుకొని వస్తాను అని చెప్పి...పోసు కొడుతూ వెళ్ళాను లోపలి.వెళ్ళంగానే కుర్చీ లో కూర్చో పెట్టి,కళ్ళ మీద కీర దోసకాయ ముక్కలు పెట్టి కళ్ళు మూసుకో అని చెప్పారు.సరే అని అలాగే కళ్ళు మూసుకొని...వాళ్ళెం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉన్నా...ఏమో రసాయనాల వాసనా ...ఎలుకలు,పిల్లు,పందులు  చచ్చిన వాసన రావడం మొదలు అయింది
...కొంచం సేపు కళ్ళతో పాటు ,ముక్కు,నోరు కూడా మూసుకున్నాను....బయట మా వాళ్ళు 'భార్య డెలివరీ టైం లో ...హాస్పిటల్ వార్డ్ ముందు టెన్షన్ పడుతూ తిరుగుతున్న మొగుడిలా ' టెన్షన్ పడుతూ అటు,ఇటు తిరుగుతున్నారు...ఎందుకంటే అప్పటికి నన్ను రూం లో కి తీసుకెళ్ళి మూడు గంటల పయిమాటే..ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి??
ఇక్కడ నా పరిస్తి ఏమో ....నన్ను చంపడానికే   ఇలా ప్లాన్ వేసారు అనుకుంట అని...ఏడుపు వచ్చిన ఆపుకొని ....ఇక ఆ ఆ వాసన తట్టుకోలే అంటీ ఏంటా వాసన అని అడిగా....కొంచం పక్కన పెట్టారా, తట్టుకోలేక పోతున్న...అని అడిగా.అంటీ వెంటనే...అది నీ తలలోంచే వస్తుంది అమ్మ ..అన్నారు...అంతే...నాకు సుక్కలు కనపడ్డాయి అనుకోండి...నా తలలోంచి ఎలుకలు చచ్చిన వాసనా???అప్పుడు కళ్ళు తెరిచా ...అసలు ఏం జరుగుతుంది ఇక్కడ...నాకు తెలియాలి ,తెలియాలి అని యమస్ నారాయణ స్టైల్ లో అడిగా...అప్పుడు ఆ అంటీ నీ జుట్టు రింగులు గా మార్చాలి అంటే ఈ రసాయనం వాడాలి అమ్మ...లేకుంటే ఆ రింగులు వారం కూడా ఉండవు అని చెప్పారు...జుట్టు మీద నాకున్న మక్కువతో భరించాలి అనుకున్న...ఒక్క సారి మా వాళ్ళని చూడాలి అని అడిగా...ఆంటీ సరే అని వాళ్ళని లోపలి కి పిలిచారు,,,,పద్దు,హారిక...లేపలికి వస్తూనే ముక్కులు ఒకరకం గా పెట్టారు...అప్పుడే నాకు సీన్ అర్థం అయింది...కాసేపు తోడు కుర్చోండే ...మూడు గంటలు కళ్ళు ,నోరు(ముక్కు కూడా) మూసుకో ని బోర్ కొడుతుంది అన్నాను..హారిక నెమ్మది గా ఈ వాసనేంటే  బాబు?? ...వాంతి కొస్తుంది అని అడిగింది...నేను పోసుకొడుతూ నాకేం లేదే అన్నాను...అవునా...అని నా పక్క ప్లేస్ లో వాసన రావట్లేదు కాబోలు అని,..నా పక్కకు వచ్చింది...అంతే...వాక్ వాక్ అని బయటకు పరుగు పెట్టారు,...ఎలాగో అలా ఆ వాసనా భరించి...మొత్తానికి రింగులు తిరిగింది అని అద్దం ఇచ్చారు ఆంటీ...అద్దం లో చుస్కున్నాక నా పేస్ చూడాలి....కరెంటు షాక్ తగిలిన కాకిలా....ఏంటి ఇది నా పేస్ఏనా??అసలు ఇంకా నన్ను ఎవరయినా గుర్తు పడతార???
వెంటనే...ఆంటీ ఈ రింగులు తిసేయ్యాలి అంటే ఎంత తీసుకుంటారు అని అడిగా....ఇంకా ఏం చేయలేము అమ్మ....ఒక ఆరు నెలలు ఐతే వాటంతట అవే పోతాయి,,,అల్ ది బెస్ట్!!! అని చెప్పి...ఒక వారం రోజులు జుట్టు దువ్వకూడదు,తలంట కూడదు...అలా చేస్తే రింగులు తొందరగా పోతాయి అని జాగ్రత్తలు కూడా చెప్పారు.అప్పుడు చూడాలి....ఒక
చిన్న సైజు పిచ్చుక గూడు నా తలమీద పెట్టి నట్లు ఉంది...బయట కొంచం సేపు కదల కుంట ఉంటె ఖచితంగా పిట్టలు గుడ్లు పెట్టి,కాపురాలు కూడా పెడతాయి....వెంటనే హరికని పట్టుకొని ఏడవాలి అని పించింది...అదేమో పక్కకు రాకే వాసన తట్టుకోలెం అంటుంది..."అత్త తిట్టినందుకు కాదు ..తోటి కోడలు నవ్వినందుకు" అన్నట్లు....బంగారం లాంటి జుట్టు ఇలా పిచుక గూడు లా మారినందుకు కాదు నా బాద ...నా జుట్టునుంచి వాసన వస్తుంది అని....వెంటనే...ఆ వాసన పోవాలి అని తల స్నానం చేశా,,,వాసన ఐతే పోయింది కానీ...గూడు మాత్రం చెదర లేదు...ఇంటి కి వెళ్తే మా అమ్మ చేతులో ఖాయం అని నిర్నయిన్చికున్న....ఏమి చేయలేక....గమ్మున వెళ్లి నిల్చున్న...అంతే కనక దుర్గ అమ్మవారి ని చూసినంత పని అయింది...నాకు ఇంకా గుర్తుంది మా అమ్మ నాతో వారం రోజులు మాట్లాడ లేదు...ఆ గూడు చెదర్చాడని కి చేయని ప్రయత్నాలు లేవు అనుకోండి,,,ఏం చేసిన ఫలితం మాత్రం అంతంత మాత్రమే...


అసలే నా తల పయిన కట్టుకున్న గూడు ని చూస్తూ నేను ఏడుస్తుంటే...నా చిన్న నాటి స్నేహిస్తుడు "సెరీనా విల్లింస్" లాగా ఆ జుట్టేంటి అని అనేసాడు...అప్పుడు చూడాలి..కళ్ళనిండా నీళ్ళు తిరుగాయి.కానీ ఆ ఎలుకల మందు రసాయనం ఏంటో గాని ఎన్ని చేసిన నా గూడు మాత్రం అలాగే ఉంటుంది...ఇది జరిగి నాలుసంవత్సరాల  పయిమాటే....గూడు చెదిరిన నా పాత జుట్టు మాత్రం నాకు రాలేదు అండి..

Friday, July 2, 2010

జావా తెచ్చిన చిక్కులు

ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ అనే పర్వం ......అది చూసి ఏడవని ఇంజనీరింగ్ విద్యార్దులు ఉండరు అనుకుంట ...మేము ఐతే మీరు ఎడ్చినదానికి వంద సార్లు ఏడిచాం అనుకోండి .....కలలో కూడా ప్రాజెక్ట్ వర్క్ కలవర పెట్టేది...ఏంటి అంత కష్టం అని ఆలోచిస్తున్నారా? మీరే వినండి...కాదు కాదు చదవండి....
       అందరు ప్రాజెక్ట్స్ కి టీం లు వెతుక్కుంటున్నారు ...కానీ మాకు ఆ బాధ లేదు ...మా బాత్చ్ కరెక్ట్ గా ఒక ప్రాజెక్ట్ కి సరిపడే ల ఉంది...ముచ్చటగా ముగ్గురం(నేను,పద్దు,హారిక).ఈలోపు హారిక, వాళ్ళ బాబాయి గారు "సెంట్రల్ యునివెర్సిటీ" లో ప్రోఫెసేర్ గా ఉన్నారు ...అక్కడ ప్రాజెక్ట్ ఇవ్వమని అడుగుదాం అనింది .అక్కడ ఐతే మనకు సహాయం చేయడాని బాబాయి ఉన్నారు ...ఈజీగా ప్రాజెక్ట్ చేసివేయ వచ్చు అని అందరం ఓకే చెప్పి....వెళ్లి వాళ్ళ బాబాయి గారిని కలిసాము .అయన కూడా సరే అనేసారు.కాలేజి లో రిపోర్ట్ చేసి "ప్రాజెక్ట్ రిపోర్ట్ " కోసం భాగ్యనగరం బయలుదేరాము.


అక్కడ తెలిసిన వాళ్ళ సహాయం తో ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకున్నాం.తీసుకున్నాక తెలిసింది అది ఒక 'పరమవీర  చక్ర' గారి ఇల్లు అని.సామాను ఇంట్లో పెట్టక ముందే వొనర్ అంటీ వచ్చారు...ఇలా ఉండాలి  ,అలా ఉండాలి ,ఇది ఇక్కడ పెట్టండి,అది అక్క పెట్టవద్దు ...ఇలా చెపుతానే ఉంది.లాస్ట్ లో ఆమె చెప్పిన ముఖ్య షరతు ...ఇంటికి ఎవ్వరు(అబ్బాయిలు అనే కదా అనుకుంటాం!!!) రావద్దు ,లాస్ట్ కి తల్లిదండ్రులు కూడా అంట.ఒక వేల వచ్చినా  ఒకపూట మాత్రమే ఉండాలి.అసలే మాది కోతి మూక...కోతి మెడకు కళ్ళెం వేసిన అది చేసే కోతిశెకలు మానుతుందా చెప్పండి!!!! .....సరే ఆంటి అని బుద్దిగా చెప్పాము.ఇప్పడు మా ముందు రెండు టార్గెట్లు ఒకటి ప్రాజెక్ట్ ఐతే ,ఇంకోటి ఎలా ఇక్కడినుండి తప్పించుకోవటం ??వెంటనే హారిక ,ముందు మనం సెటిల్ ఐతే నే కదా ప్రాజెక్ట్ బుద్దిగా చేయగలం,మన తక్షణ కర్తవ్యం ఇల్లు మారటమే, అని చెప్పేసింది.ఎవ్వరం సమానులు సద్దుకోవద్దు ..వేరే ఇల్లు వెతికే ప్రయత్నం లో ఉండండి అని ఖచితం గా ,బల్ల గుద్ది మరి చెప్పేసింది.మాకు తోడు హారిక వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు.అంటీ చాలా మంచివాళ్ళు...చిన్న పిల్ల లా మాతోపాటే కలిసి పోయే వారు....మేము వేసే వెధవ,మంచి(అప్పుడప్పుడు) ప్లాన్స్ కి ఫుల్లు సపోర్ట్ ఇచ్చేవారు ....'సరే రా, మనం వేరే ఇల్లు వెతికి... తరువాత ఎలాగో అల యీ ఆంటీ ని నేను కంప్రోమిసే చేస్తలెండి 'అన్నారు....ఇంకేముంది ...అగ్నికి,ఆద్యం తోడయినట్లు ....వెంటనే వేరే ఇల్లు వెతికాం..ఈసారి కాప్షన్ మార్చేసాం ..."కొంచం ఖర్చు అయిన పరువలేదు కాని,వొనర్ లేని ఇల్లు చూడాలి "...అల అలా వెతికి లాస్ట్ కి ఒక మంచి అపార్ట్మెంట్ లో దిగేసాం ....
        
   ఇక ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం .......వెళ్లి ప్రాజెక్ట్ జాయిన్ అయినట్లు రిపోర్ట్ చేదం అని బయలుదేరాం....ప్రోఫెసేర్ గారిని కలిసాక....ఎం ప్రాజెక్ట్ చేయాలి నిర్ణయించుకోండి అని ...ఏవో కొన్ని పేపర్లు ఇచ్చారు ...@౩%$#&* $%&(@#$$%^ .....ఏమయినా అర్థం అయిందా???మాకు కూడా ఆ పేపర్లు చూస్తే ఇలాగే అనిపించింది.ఇంతకు ఇవన్ని ఏంటి అండి?? అని అడిగితే ...ప్రాజెక్ట్ టైటిల్స్ అన్నారు ...ఇందులో ఏది చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి అని మళ్ళి అడిగారు....వెంటనే నాకొక ఆలోచన తట్టింది ....మూడు వేళ్ళలో ఏదో ఒక వేలు పట్టుకోవే అని అడిగా పద్దు ని .అది మొదటి వీలే పట్టుకుంది ...వెంటనే "వే విల్ గో విత్ ఫస్ట్ " అన్నాను.సరే ఐతే వెళ్లి చేయండి అని ఒక పెద్ద బుక్ ఇచ్చారు ... అప్పుడు నేను సునీల్ లాగా అమాయకంగా పేస్ పెట్టి...ఇదేంటి అండి అన్నాను....ఇది శాంపిల్ ప్రాజెక్ట్ బుక్....పోయినసారి ఒక అమ్మాయి చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్...మీరు కూడా ఇలాగే తాయారు చేసి కాలేజీ లో సబ్మిట్ చేయాలి అన్నారు.మాకు ఒకటే సంతోషం ...మన ప్రాజెక్ట్ ఇంత సులువు అవుతుంది అనుకోలేదు కదా అని.ఏదో ఘన కార్యం చేసిన గర్వం తో రూం కి వచ్చేసాం ...
           తరువాత రోజు ప్రాజెక్ట్ వర్క్(ఏదో హోమేవోర్క్ లాగా) చేద్దాం  అని కూర్చున్నాం అందరం ....సరే కవిత నువ్వు మొదలెట్టు అన్నది పద్దు....సరే ఐతే అన్నాను...అవును ఎం చేయాలి??అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి??? అన్నాను....వెంటనే హారిక ....టైటిల్ సెలెక్ట్ చేసావు కదనే....  అదే చేసి చూపించాలి ప్రాక్టికల్ గా ....అయ్యో అవునా.మేము పింకీ ,పొంకి చెప్పి ఒకటి సెలక్ట్ చేసాం అంతే ...కానీ మాకు ఏ పాపము తెలియదే అన్నాను.చచ్చాం కదే...నిజం గా నీకు తెలుసేమో అని నేను బాబాయి ఎమైన హెల్ప్ కావాలి అంటే చెప్పండి అన్నప్పుడు .... వద్దండి  అని చెప్పా ...అంటూ ఉరిమి చూసింది ... సరే ఐతే ఇప్పుడు హెల్ప్ కావాలి అని అడగవే...కొంచం ప్రాజెక్ట్ చేసి పెట్టమని అడుగుదాం అన్నాను...సరే ఐతే....కానీ డైరెక్ట్ గా వెళ్లి అడుగుదాం అని చెప్పింది...సరే అని మళ్ళి బయలుదేరాం కాలేజి కి ...బాబాయి ని కలిసి...కొన్ని డౌట్స్ ఉన్నాయి అండి అన్నాం...అయన చెప్పండి అన్నారు..."సర్ యీ ప్రాజెక్ట్ ఎలా చేయాలో(అసలేం చేయాలో,ఎక్కడ మొదలు పెట్టాలో ??? ) అర్థం కావట్లేదు అండి అన్నాను.ఏ ప్లాట్ఫారం లో చేస్తున్నారు అని అడిగారు....అప్పుడు నా పేస్ చూడాలి....వంద మంది సునీల్లు కూడా సరిపోరు ...ప్లాట్ఫారం ఏంటి ??నిన్న ప్రాజెక్ట్ చేయమన్నారు(అదేదో పూర్తి చేసుకోచిన ఫీలింగ్ తో),ఇవాళ ప్లాట్ఫారం అంటున్నారు ...అని ఒకటే భయం,ఏడుపు.వెంటనే  హారిక ని పక్కకి తిస్కేల్లి,,,,ఇదంతా కాదు కానీ...'చిన్న హెల్ప్ బాబాయ్ ...కొంచం యీ ప్రాజెక్ట్ మాత్రం చేసి పెట్టండి' అని అడిగేయవే...లేదంటే రోజుకో కొత్త  పదం చెపుతున్నారు ...ఎందుకొచ్చిన రిస్క్ చెప్పు...అన్నాను.అది నీ మొహం అల అడిగితే నా పరువు పోతది..మా బాబాయి వెళ్లి మా డాడి తో చెప్పారు అంటే అంతే....అమ్మో నేను అడగను...డౌట్,డౌట్ అని చెప్పి ఒక్క ఒక్క స్టెప్ ఆయనతోనే చేపిద్దాం పద... అని చెప్పింది...నేను ఎం చేసేది లేక 'సరే' అన్నాను....మరి ఆ ప్లాట్ఫారం సంగతి ఏంటి???అని మళ్ళి అడిగా .....అది నేను కవర్ చేస్తా ఉండు ,,,,అని బాబాయి ఏ  ప్లాట్ఫారం ఐతే బెటర్ అని అడిగింది...అయన వెంటనే...."జావా" ఐతే బాగుంటుంది అమ్మ...పయిగా  "జావా చేస్తే  జాబులు తొందరగా వస్తాయి " అన్నారు....వెంటనే హారిక సరే సరే...ఐతే మేము జావా లో నే చేస్తాం,అనేసింది తొందర పడి.మరి మీకు జావా ఎంత బాగా వచ్చు???కాలేజి లో చవిన జావా సరిపోదు..ఇంకా కొంచం డీప్ గా తెలియాలి అన్నారు.కాలేజి లో జావా చదివామ??ఎప్పుడే ???...అనేసింది పద్దు కంగారు పడుతూ ....వెంటనే హరిక ఎవరినయినా కనుక్కుందాం లేవే ....ఎందుకు కంగారు పడతావ్ అని సద్దిచెప్పింది...మరి ఎక్ష్త్ర జావా ఎక్కడ చదవాలి సర్ అని అడిగా(అసలు జావా కే దిక్కు లేదు,ఏక్ష్త్ర జావా గురించి దిగులు!!!!)..ఏదయినా  మంచి ఇన్స్టిట్యూట్ చూసి జావా జాయిన్ అవ్వండి...ఆ నేర్చుకున్న దాని  తో యీ ప్రాజెక్ట్ చేయండి అన్ని చెప్పి వెళ్లి పోయారు...వెళ్ళే ముందు....జగ్రత్హగా నేర్చుకోండి..అసలే నాకు జావా రాదు...టైం కి సబ్మిట్ చేయకపోతే కాలేజి లో మార్కులు రావు...మీ ఇష్టం .....అని నవ్వుతూ చెప్పి వెళ్లి పోయారు....అప్పుడు చూడాలి అందరి మైండ్స్ బ్లాక్డ్ ...ఏంటి మన గతి...ఈయన, నాకు జావా రాదు అంటాడు...అల ఐతే మన ప్రాజెక్ట్ ఎలా చేసి పెడతారు??ఇప్పుడు ఎం చేయాలి??వెంటనే పద్దు.....మనం ముగ్గురం జాయిన్  అవ్వడం కంటే మీ బాబాయి నే జావా జాయిన్ అవ్వమని చెపుదాం ...అని అవిడియా ఇచ్చింది...వెంటనే నేను అందుకొని...అసలు ఏది అయితే బెటర్ అని అడగకుంట...మీకు ఏది వచ్చు అండి అని అడిగితే బాగుండు...అని అరిచేస హరికని చూస్తూ....అదంతా ఎం కాదులే అయన మనం అల చెపితే బాగా చదువుతారు అనుకోనిఅలా చెప్పి ఉంటారు...లాస్ట్ మొమెంట్ లో హెల్ప్ చేస్తారు లెండి...వెళ్లి జావా జాయిన్ అవుదాం పదందే అని పురమాయించింది.


బాబాయి గారు చెప్పినట్లు జావా జాయిన్ అయ్యాము....అయన డైలీ క్లాసు అంటారు,object అంటారు కానీ....ఒక్క రోజుకూడా ప్రాజెక్ట్ అనరే అని కోపం వచ్చి ఒక రోజు అడిగేసా....అయన నాకు ప్రాజెక్ట్ చేసే తెలివే ఉంటె ....నేను ఇక్కడ ,ఇలా ఎందుకు పని చేస్తాను ???ఏదయినా మంచి MNC లో ఉద్యోగం చేస్తూ ఉండేవాన్ని అన్నారు....ఇంకేముంది ...చచ్చింది గొర్రె ....బాబాయి గారు జావా రాదు అంటారు,వీడు ప్రాజెక్ట్ చేయరాదు అంటారు,,,,ఇప్పుడు ఎం చేయాలి అని ఒకటే కంగారు.యీ లోపు కాలేజి లో మొదటి దఫా ప్రాజెక్ట్  సమర్పించాలి అంట,,,,మా చేతులో జావా క్లాసు,object అంటూ ఏవో రెండు,మూడు ప్రోగ్రాములు తప్ప వేరే ఎం లేదు.అప్పుడు తలుక్కున ఒక ఐడియా తట్టింది హారిక కి...మా బాబాయి అవసరమయి రెఫెర్ చేయమని ఒక పుస్తకం ఇచ్చారు చూడు  అది కొంచం,కొంచం మర్చి,పేరు మర్చి...మన కాలేజి లో ఇచేసేద్దాం అని చెప్పింది.ఐడియా ఏదో బాగానే ఉంది...కానీ అది పుస్తక రూపం లో ఉంది....సిస్టం లో కి రావాలి అంటే ఎలా???ఏముంది...అందరం తలా కొన్ని(ఒక యబాయి నుండి నూరు మద్యలో ) పేజీలు టైపు చేయాలి ...అంతే ....సింపుల్ అని సింపుల్ గా చెప్పేసింది అది.చేసేదేముంది కానీయ్ ...అని మొదలు పెట్టాం.నేను ఒక ముప్పయి పయినే  పేజిలి టైపు చేశా....ఇంకా చేస్తానే ఉన్న సడన్ గా కరెంటు పోయింది....ఏముంది....టైపు చేసినది మొత్తం పోయింది .....హి బాగావాన్...ఏమని చెప్పను నా బాధలు.?????ఇలా కింద,మీద పడి టైపు చేసిందే ఒకటికి పడి సార్లు చేసి...ఎలాగో అల చెప్పిన టైం కి కాలేజి లో ఇచ్చేసాం.అందరు సగం ,సగమే తెచ్చారు ...మేము మాత్రమే చేసినది,చేస్తున్నది,చేయ బోతున్నది మొత్తంసమర్పించాం ....ఎంత గొప్ప వాళ్ళమో కదండీ.....హి హి హి.పాపం మా కాలేజి లో ఎవ్వరు యీ (కాపీ కొట్టిన సంగతి ) విషయాన్నీ గమనించలేక పోయారు.ఎలాగో అలా బయటం పడ్డాం....
     రోజు జావా క్లాసు కి వెళ్ళే వాళ్ళం ,వచ్చే వాళ్ళం అంతే,,,,ప్రాజెక్ట్ గురించి ఆలోచనే లేదు,,,ఎందుకంటే,,,డీప్ గా వస్తేనే చేయగలుగుతాం అన్నారు బాబాయి గారు...మాకేమో ఇంకా a ,b ,c ,d  లే చెపుతున్నారు ...x ,y ,z  వచ్చాకే ప్రాజెక్ట్ చేయగలుగుతాం అని ఏమి చేయక పోయే వాళ్ళం.ఇలా రోజులు గడుస్తు ఉన్నాయి....యీ లోపు కాలేజి లో ఫైనల్ ప్రాజెక్ట్ సమర్పించాలి అని పిలుపు వచ్చింది...కానీ మా మాస్టారు మాత్రం ఆ a ,b ,c ,d దగ్గరే ఉన్నారు...అదేమిటి అంటే అంతకంటే ఎక్కువ తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉండే వాణ్ణి అంటాడు...ఇప్పుడు ఎం చేయాలి??సరే బాబాయి గారు...ఏమయినా హెల్ప్ చేస్తారా అంటే....ప్రాజెక్ట్ అంటే సొంతం గానే చేయాలి...ఎవ్వరు సహాయం చేయరు...అది ఇలాంటి విశ్వ విద్యాలయం లో ప్రాజెక్ట్ చేయడం అంటే మాటలా ఏంటి???మీకు మంచి భవిష్యత్తు(నాకు అప్పుడు 'భవిష్యత్తు' బాగానే కాళ్ళ ముందు కన పడుతుంది)  ఉంటది అంటారు....తప్ప హెల్ప్ అనే మాటనే దరిచేయనివ్వట్లేరు ....ఇప్పుడు ఎం చేయాలి???అందరికి ఒకటే టెన్షన్...సరే ఎక్కడయినా ప్రాజెక్ట్ కొని అది సబ్మిట్ చేద్దామా అంటే...వాళ్ళ దగ్గర ఉన్నవే మేము కొనాలి తప్ప....మా టైటిల్ కి సంబంధించినది వాళ్ళు చేయరు అంట....ఇప్పుడు ఎలా???ఎలాగో అలా మా అన్నయ్య ని బ్రతిమిలాడి ఒక ప్రాజెక్ట్స్ చేసే అతన్ని పట్టుకున్నాం.ఎంత ఖర్చు అయిన పరవాలేదు మాకు యీ ప్రాజెక్ట్ చేసి పెట్టరు...అని కాళ్ళ ,వేళ్ళ పడి ...ఒప్పించుకున్నం.దేవుడు లా వచ్చి....టైం కి ఏదో అలా జావాలో ఒక నాలుగయిదు పేజీలు సృష్టించి ఇచ్చారు....అప్పుడు కానీ మా ప్రాణం కుదుట పడలేదు....కానీ అంతలో ఇంకో కష్టం....మీరు చేసిన ప్రాజెక్ట్ మీరే కాలేజి కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయాలి అన్నారు...మకదేమో తెలిదు ఆయె,....ఎలాగో అలా మా కాలేజి యాజమాన్యాన్ని ఒప్పించి...మా కంప్యూటర్ లో నే ప్రాజెక్ట్ చూపించే ఏర్పాటు చేసింది హారిక.....హమ్మ్మం (పెద్ద జావా నిట్టుర్పు ).ఇలా పలు విధాలు గా కస్టపడి ప్రాజెక్ట్ అనే పర్వాన్ని ముగించేసాం ...ఎన్ని మార్కులు వేసారు అని మాత్రం ఇప్పటికి అడగకండి...వింటే మీరు తట్టుకోలేరు....అదన్నమాట సంగతి!!!!!!.....


కొస మెరుపు:కానీ ఒక మాట అండి...బాబాయి గారు నిజమే చెప్పారు అండి....మేము అందరం ఇప్పుడు జావా లోనే ఉన్నాం......థాంక్స్ టు అశోక్ బాబాయి గారు....