Thursday, July 22, 2010

I miss u my friend...

విను ...ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయి.నిజం ఈ కాప్షన్ తనకు నూటికి నూరు శాతం సూటు అవుతుంది.సున్నిత స్వభావం,మంచి మనసు ఉన్న అబ్బాయి.అటు ఇటు పెళ్లి కావలసిన వయస్సు...కానీ ఇంతవరకు మాట వరసకు కూడా అమ్మాయిల టాపిక్ చెప్పిన సందర్బాలు లేవు.నాకు ఒక మూడు సంవత్స్తరాలు గా మంచి మిత్రుడు.తమిళ్ అబ్బాయి ..పల్లెటూరు వాతావరణం లో పెరిగి వచ్చాడు .అందులోను వాళ్ళ నాన్న గారు రిటైర్ అయిన అర్మి ఉద్యోగి.కొంచం బరువు ,బాధ్యతలు ఎక్కువే అనుకోండి(కొంచం కాదు లెండి ,మోయలేనంత ఎక్కువ )...ఇద్దరు అక్కలకి పెళ్లి చేసాడు,ఒక అక్క కి ఇంకా పెళ్లి చేయాలి....ఏదో మెదడు సంభంద వ్యాదితో బాధపడుతున్న అన్న ఉన్నారు...ఇవన్ని చక్క పెట్టి....తను పెళ్లి చేసుకోవాలి...!!!! బహుశా ఈ భాద్యతలే  తనను తన గురించి ఆలోచించ నివ్వట్లేవు కాబోలు.  
 
ఫ్రెండ్ అని మోసేస్తున్న అనుకోకండి...నిజం గా చెపుతున్న అండి...చాలా చాలా మంచి కుర్రాడు.మీరే చెప్పండి ఈ కాలం లో తన గురించి కాకుంట కుటుంబం గురించి పాకులాడే వాళ్ళు ఎంత మంది ఉంటారు ???నాన్న కు వచ్చే పెన్షన్ ఏమాత్రం సరిపోతుంది చెప్పండి...ఇద్దరు అక్కలకి పెళ్లి చేసిన ..సారెలు,చీరాల పేరుతో వాళ్ళని కూడా చుసోవాల్సిందే.ఇవన్ని తన బాధ్యతగా తనే చక్కగా నెరవేర్చు కొస్తాడు..చాలా ఓపికగా ..ఎన్ని ఇబ్బందులు వచ్చినా...మా ఫ్యామిలీ కోసమే కదా అని భరిస్తాడు ...మాతో పటు ఆఫీసు కొస్తాడు ....సాయంత్రం టైం లో ప్రైవేటు పాఠాలు చెపుతాడు....ఒక సారి ఆన్సయిటు ఛాన్స్ వస్తే వద్దు అంటున్నాడు...తనకు డబ్బు ఎంత అవసరమో నాకు బాగా తెలుసు మరి ఇదేంటి బంగారం లాగా వచ్చిన ఛాన్స్ వద్దంటాడు?ఏంటా అని ఆరా తీస్తే .... అక్క కి బాబు పుట్టి అయిదు నెలలు అయింది ...మేడలో బంగారు గొలుసు వేయకుండా పంపిస్తే వాళ్ళ అయన ఊరుకోరు ...ఇప్పుడు నేను దుబాయ్ వెళ్తే ...ఆ డబ్బు ఎవరు సద్దుతారు అని చెప్పి, వాపోయాడు!!! ...నాకు చాలా బాధేసింది ..సరే అ డబ్బు నేను మీ ఇంట్లో ఇస్తాను, నువ్వు వెళ్ళు దుబాయ్ కి అని చెప్పాక ...ఒప్పుకున్నాడు.... చూసారా అండి!!!...ఎంతగా ఆలోచిస్తున్నాడో ఫ్యామిలీ గురించి.


         ఇప్పుడు ఎందుకు ఇతని గురించి చెపుతున్న అనుకుంటున్నారా???వస్తున్నా,వస్తున్నా ...అక్కడి కే వస్తున్నా.....తనకి చాలా మంచి జీతం తో ....HP  లో ఉద్యోగం వచ్చింది అండి....ఇవాళే మా కంపని లో లాస్ట్ వర్కింగ్ డే ....ఇంత మంచి మిత్రున్ని దూరం చేసుకున్తున్నమే అని కొంచం బాధగా ఉంది....అదీ కాక...నేను ఎప్పుడు తనని సరదాగా ఏడిపిస్తా ఉంటా....ఇకపయిన ఎవరిని ఏడిపించాలో ఎమో???ఒకటే దిగులు గా ఉంది...కానీ విను మాత్రం తెగ సంతోషం గా ఉన్నాడు...శాలరీ మాత్రమే కాదు అంట...నా వచ్చీ, రాని తమిళ్ నుంచి తనకు ఉపశమనం కలిగింది అని తెగ సంబర పడి పోతున్నాడు....కాని నేను వదల కదా!!!...నాకు కూడా HP ఉండే కాంపస్ లోనే ఇంకో మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చిందోచ్ ......వదల బొమ్మలి ...వదల......!!!!!


             ఏదీ ఏమయినా తనని మిస్ అవ్వబోతున్నాం అని చాలా బాధగా ఉంది....కానీ తను ఇకనయిన చక్క స్థిర పడాలి అని మనసారా కోరుకుంటూ...I wish all the very best for your bright future my dear friend.All is Well.


ఇంకో మాట అన్డోయి...విను కి ఇప్పుడే ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది ,,,,ఇప్పుడే మెసేజ్ ల దగ్గర ఉన్నారు....అదీ అలా అలా .....పెళ్లి వరకు రావాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నాను.

21 comments:

  1. మెదట మీ మంచి మనసుకి మెచ్చుకున్ననులే డబ్బు విషయంలో అతనికి సహయం చేసినందుకు ..most wel-come dubai your friend we also supproting friend sister ...may huna....

    ReplyDelete
  2. All the best to Vinu for his bright future and his budding love too :)

    ReplyDelete
  3. విను ...ఒక మంచి కాఫీ లాంటి అబ్బాయి.నిజం ఈ కాప్షన్ తనకు నూటికి నూరు శాతం సూటు అవుతుంది.ఈ కాలం లో తన గురించి కాకుంట కుటుంబం గురించి పాకులాడే వాళ్ళు ఎంత మంది ఉంటారు ??? 100% lekapoyina oka 10% anna untaru le.

    ReplyDelete
  4. కవిత గారు ఈ పోస్ట్ తో మీరు ఎక్కడికో ఎదిగిపోయారు.... ఆ అబ్బాయి ఫ్యూచర్ , మీ ఫ్రెండ్ షిప్ చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    ReplyDelete
  5. meeru anukunnaTlu gaane jaragaalani aaSistunnanu...

    ReplyDelete
  6. Friend gurunchi baga chepparu.. oka friend gurunchi entala aratapadutunnaru.. good..

    ekkado chadivaa.. Banduvulani devudu ishtadu.. friends ni manamee select chesukovali ani..

    mee kante, mee vinnu success ayyadu select chesukovadam lo.. :)

    ReplyDelete
  7. Anon gaaru,
    mari ala pogideyakani andi...nenu ippudu ekkado munga chettu chitaruna unnanu...Vinu kuda ledu adukovadani ki....

    Thank you so much for your support.

    ReplyDelete
  8. oho soopar post kavita gaaru
    ee post chaduvutuntoone mee andamaina manasu telustondi
    meeku hats off kavita garu

    ReplyDelete
  9. Anon,

    Please chalu chalu....intha kante ekkuva pogidithe na chitti hrudayam thattukoledu...heartattac vasthademo....

    ReplyDelete
  10. ఆ అజ్ఞాత చెప్పింది నిజమండీ
    మీ మనసు వెన్న కవిత గారు

    ReplyDelete
  11. vaddandi babu...asale ma ayanaki neyyi ante chala istam....na venna manasuni stove meeda petti karapetteyagalaru jagratha....

    ReplyDelete
  12. మీ అబ్బాయి కి పులి సింహం అంటే ఇష్టం ఉంటే మీరు ప్రతిరోజూ పులిహోర చేస్తారా

    ReplyDelete
  13. LOL...good catch anon.....sare babu oppukuntunna ,nadi venna mariyu andamayina manasu.Kastha ee vishaym oka sari ma vaariki kuda cheppi punyam kattu kovcahu kada.Nenu chepithe assalu nammatleru ....

    ReplyDelete
  14. మేము చెబితే జావా నేర్చుకొని మరీ మీ ఆఫీస్ లో మీ బాస్ మీ ఆయన అయ్యి మరీ బ్లాగ్ లు గట్రా బ్లాక్ చేస్తారు
    బ్లాగ్ చదివే మాలాంటి వాళ్లకు మీ బ్లాగ్ చదివే సంతోషం కూడా లభించనివ్వరా

    ReplyDelete
  15. babbau ...aa pani matram cheyakande...one of my best hobbies is blogging.aa chinna santhosham kuda lekunte cheyakandi babu...edo chinna chinna bloglu gatra rasukuntu ala ala naa office jeevithanni gadipesthunna..ee tamialla godava padakunda nannu nenu kaapadu kovali ante,ee blogs chadavadamo,rayadamo okate dhari naaku....

    ReplyDelete
  16. మీరు గొప్పలకు పోయి నెయ్యి వెన్న అని చెప్పకండి
    చెప్పిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మరవకండి
    ఇదే జీవిత సూత్రము

    ReplyDelete
  17. mee post soparandeee
    i second anonymous
    ur really good

    ReplyDelete
  18. Thank you shirish....Adhe me abhimanam...

    ReplyDelete