Tuesday, June 29, 2010

ఎలా చెప్పను !!!







నీ పేరే పలకాలనుకునే పెదవులకి  నా చిరునవ్వు నువ్వని ఎలా చెప్పను !!!
నిన్ను ఆశగా వెతికే చూపులకి నా కంటి పాప నువ్వని ఎలా చెప్పను !!!
నాలోని నీ ప్రతి జ్ఞాపకానికి నా గుండె చప్పుడే నువ్వని ఎలా చెప్పను !!!
స్నేహితులుగా మనం గడిపిన కాలానికి నీ మీద నాకున్నది ప్రేమే అని ఎలా చెప్పను !!!

Wednesday, June 23, 2010

'వర ' కట్నాలు ఎందుకివ్వాలి???

ఇదేం ప్రశ్న తల్లి అని అనుకుంటున్నారా??మీరే చెప్పండి అసలు ఎందుకివ్వాలి ఈ వర కట్నాలు??
    ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే అమ్మానాన్నలని వదిలేసి మీతో వస్తున్నందుకివ్వలా?
   వంటింటి మొహం కూడా చూడని అమ్మాయి మీకోసం వంటమనిషిగా  మారుతున్నందుకివ్వలా?
   ఆరుగంటలను గడియారం లో చూసికూడా ఎరగని అమ్మాయి తెల్లవారుజామున లేచి ఇల్లు చక్కబెట్టుకున్నందుకు ఇవ్వాళ???
   అమ్మాయి హోదానుండి 'అంటీ ' గా మరుతున్నందుకు ఇవ్వాలా???

అసలు ఎందుకివ్వాలి అని అడుగుతున్న అధ్యక్షా....

20 సంవత్సరాలు కళ్ళలో పెట్టుకొని  పెంచిన అమ్మానాన్నలని వదిలేసి మీతో వచ్చినందుకు మీరు కదా మాకు ఇవ్వాలి...అమ్మాయి పుట్టగానే "లక్ష్మి దేవి" పుట్టింది అని సంతోష పడతారు అమ్మానాన్న...కానీ అమ్మాయి పుట్టగానే..ఆ అమ్మాయికి కాబోయే అత్తగారింటి వాళ్ళకి "లక్ష్మి దేవి" పుట్టునట్లుగా మారిపోయింది నేటి సమాజం.అమ్మాయిని ఉత్తి చేతులతో పంపటం ఇష్టం లేక ఏదో తమకు 'ఉన్నంతలో' తల్లిదండ్రులు ఇచ్చుకునేదే 'వరకట్నం' .....కాని ఇప్పుడు తమకు 'ఉన్నదంతా'(అవసరమైతే అప్పు చేసి కూడా ) ఇవ్వడమే వరకట్నం అనబడుతుంది.అందులో కూడా కొన్ని షరతులు ఉన్నాయండోయ్ .....
                
   మొత్తం కట్నం నగదుగా ఇస్తారా లేక నగల రూపం లో ఇస్తారా ??
   బ్యాంకు లో వేస్తారా లేక డి.డి రూపం లో ఇస్తారా??
    ఇల్లు రూపం లో ఇస్తారా లేక భూమి రూపం లో ఇస్తారా???
        ఏది అయిన పరవ లేదు అండి మాకు ...అన్ని మామగారి పేరుమీద ఇవ్వండి అంతే.....
అమ్మాయి తండ్రి : కట్నం ఇచ్చేది అబ్బాయి కి, వీలునామా మామగారి పేరు మీద...మరి మా అమ్మాయి పరిస్థితి ఏంటి??...
అబ్బాయి తండ్రి: మీరు భలే వారండి పెళ్లి తరువాత మా అమ్మేయే అవుతది కదా...అందుకనే నాపేరు కరెక్ట్.
    
                    ఎంత మంచి మమగారో కదా.....
ఏమి అనకుంటే పెళ్లి కొడుకుకి ఒక ఒడ్డాణం చేసి ఇవ్వండి చాలు అని అడిగే సహృదయులు కూడా ఉన్నారండోయ్ ......
            మొన్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పాడు...అందులో కొన్ని మచ్చుకి...
1.ఒకతే అమ్మాయి అయి ఉండాలి (అక్క చెల్లెళ్ళు అస్సలు ఉండకూడదు )
2.అమ్మాయి కి పొరపాటున అన్నా కానీ తమ్ముడు కానీ ఉంటె వాళ్ళు ఈ అమెరిక నో ,పాకిస్తాన్ లో నో ఉండి ఉండాలి ....
3.నాన్న కి ,అమ్మకి (అమ్మాయి వాళ్ళ) మంచి ఉద్యోగం (రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వఉద్యోగం ఐతే మరీ మంచిది) ఉండి ఉండాలి
4.అమ్మాయి ఖచ్చితం గ MNC లో ఉద్యోగం అయి ఉండాలి
5.ఆస్తులు బాగా ఉండాలి (అబ్బాయే కాదు వాళ్ళ అమ్మ ,నాన్న కూడా కూర్చొని తిన్న కరిగిపోనంత )

ఇవన్ని ఉన్న అమ్మాయి ఎలా ఉన్నా...ఎలాంటిది అయిన పరవాలేదా???

నిజంగానే బాగా ఆస్తిపాస్తులు ఉన్నవారు ఐతే ఇచ్చుకోగలరు...ఏమి లేని మధ్య తరగతి,పేద తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ???ఎలా తీర్చగలరు ఈ " గొంతమ్మ కోరికలు ".....
ఇంతగా డిమాండ్ చేసే ఆ అత్తమామలు తమకు ఒక కూతురు(అలయాస్ ఒక ఇంటి కోడలు ) ఉంది అనే విషయం మర్చిపోతారేమో ....

ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరిది తప్పు??వరకట్నాలు అడుగుతున్న అబ్బాయి వాళ్ళదా ?ఇస్తున్న అమ్మాయి వాళ్ళదా??అన్నిటి కి  ఒప్పుకుంటున్న పెళ్లి కొడుకా??
ఎవరు మారాలి ???పెళ్లి పేరుతో జరిగే ఈ అన్యాయాన్ని(వ్యాపారాన్ని) ఎవరు ఆపాలి ???
ఇప్పటికే ప్రభుత్వం చాల చట్టాలు తెచ్చింది ...కాని ఏవి ఆచరణలో పెట్టిన పాపాన పోలేదు....ఎప్పుడు ఈ వరకట్న బాధలు పోయి.....కన్యాశుల్కం వస్తుందో అని వెయ్యి  కనులతో ఎదురుచూస్తున్నా (హి హి హి హి).....

మీరనవచ్చు అందరు 'అలా' ఉండరు అని...నేను చెప్పేది 'అలా' ఉండని వారి గురించే ....ఏదో నా అనుభవాలు,ఆలోచనలు మాత్రమే ఇక్కడ చెప్పను...  (కొసమెరుపు )

Saturday, June 5, 2010

నా(మన ) సాఫ్ట్వేర్ కష్టాలు....

ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే పెళ్లి చేసేసారు ఇంట్లో.మా శ్రీవారు  చెన్నై లో  జాబు కాబట్టి నాకు కూడా అక్కడే జాబు వస్తుంది లే అనే ధైర్యం తో "వాకే " అనేసా పెళ్లి కి.కానీ అనుకున్నది ఒక్కటి,అయినది ఒక్కటి.పెళ్లి చేసుకొని,చెన్నై కి వచ్చిసెటిల్ అయ్యే లోపు.. రెండు  సంవత్సరాలు పయినే పట్టింది.అప్పటి కి  ఫ్రేషేర్ టైం కాస్త  అయిపోయింది.అటు ఎక్స్పీరింస్ కూడా లేదాయే...ఏమి చేద్దురా  దేవుడా అని ఒకటే దిగులు పట్టేసింది.మా బాట్చు(హారిక,పద్దు మరియు ఇతర స్నేహితులు ) అంతా ఏదో ఒక జాబు లో జాయిన్ అయ్యారు.నేనేమో ఇలా ఏకాకి నిరిద్యోగిల మిగిలి 
పోయా.ఏం చేయాలి అని హారిక కి ఫోన్ చేస్తే "తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్నావ్,ఇప్పటికయినా మించి పోయింది లేదు ,హైదరాబాద్ కి వచ్చేయి  జాబు,విడాకులు రెండు నేను అర్రెంజ్ చేస్తా " అని మన్మధుడు సినిమా లో నాగార్జున ల చెప్పింది.ఇప్పుడు ఏం చేయలిరో దేవుడా అని తల బాదుకుంటున్న సమయం లో  "జావా " నేర్చుకుంటే జాబు తొందరగా వస్తుంది అని ఒక శ్రేయోభిలాషి గారు చెప్పారు.ఎలాగో అలా జావా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టా.మొదట్లో బాగా భయమనిపించేది... పోగా పోగా ఇంటర్వ్యూ అంటే బయమే లేకుంట పోయింది(తినగ తినగ వేము తియ్యనుండు టైపు లో అన్నమాట).ఇంటర్వ్యూ అంటే భయం  ఉండేది కాదు ,కానీ మా ఆయనని చూస్తే నే భయం వేసేది ...ఎందుకంటే ఇంటర్వ్యూ అవగానే రిజల్ట్స్ వస్తాయి   కదా....అది ఎలార బాబు చెప్పేది అని...(జాబు రాలేదు అనే కదా చెప్పాలి).మరి నా పరిస్థితి(ఎవ్వరు ఆలోచించరు) అలానే ఉంది ....జావా అప్పుడే నేర్చుకొని ,పది మంది చెప్పిన మాటలు విని రెండు  సంవత్సరాలు "ఫలానా" కంపెనీ లో ఉద్యోగం  చేశాను అని అబద్ధం చెపుతున్నాకదా...ఐన మన వెర్రి కాని..ఆ మాత్రం కనిపెట్టలేర అండి ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు???అది నాలాంటి వాళ్ళ ని చూస్తే యిట్టె చెప్పేస్తారు...అంత అమాయకం  గా పెడతాం కదా మనం ఫేస్ ఆ సమయం లో.ఏది ఏమైతే నేం...సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి ...ఇంటర్వ్యూ కి వెళ్ళటం ..ఇంటికి రాగానే నెక్స్ట్ రౌండ్ కి (సెలెక్ట్ యితేనే ) ఫోన్ చేస్తాం అన్నారు అండి ,అని చెప్పటం అలవాటు అయిపోయింది.తిరగని కాంసేలేటేన్చి లు లేవు అనుకోండి.అలా ఒక ఆరు నెలలు వెతికా ఉద్యోగం కోసం.అప్పుడు ఒక ఐడియా వచ్చింది...ఇలా ఉద్యోగం(సాఫ్ట్ వేరు) కోసం అంటూ సమయం వృధా చేయడం కంటే...ఏదయినా టెక్నికల్ ఇనుస్త్యుటులో అయిన  జావా ఫాకల్టి గా చేయటం మంచిది కదా...అలా చెపితే మనకూ మంచిది.... అటు పిల్లలకూ మంచిది...వెంటనే మా వారి చెవిలో ఉదేసా నా ఐడియా.గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది 
....NIIT  లో నా ఫస్ట్ జాబు ఫాకల్టి గా.NIIT  కబుర్లు చెప్పాలి అంటే ఇంకో టపా రాయాల్సిందే....అంత బాగా నేర్చుకున్న జావా మరియు జీవిత పాఠాలు....అప్పుడు తెలిసింది నాకు "నేను ఫాకల్టి కి ఎక్కువ,సాఫ్ట్వేర్ కి తక్కువ " అని.నిజం చెప్పాలి అంటే ....సబ్జెక్టు ఉన్నా తగిన అనుభవం(కంపెనీ  వాళ్ళు ఎదురుచుసేది అదే కదా!!) లేకపోవటమే ముఖ్య కారణం అయినది .
                             ఇలా ఒక సంవతరం పాటు NIIT  లో "మేడం","మిస్"(పెళ్లి అయినాక కూడా!!!) అని పిలిపించుకొని..తెగ మురిసిపోయాను...మళ్ళి మాయన మొదలు పెట్టారు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఫాకల్టి గా చేస్తావ్?సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే ఐడియా ఉందా??లేదా??(నన్ను "మిస్" అని పిలుస్తుంటే కుళ్ళుకొని ,తట్టుకోలేక ఇలా బయట పడ్డారు ) ...మళ్ళి మొదలు సాఫ్ట్వేర్ కష్టాలు ....నిజం చెప్పాలి అంటే నాకు ఆ NIIT  లైఫ్ బాగా నచ్చేసింది ...బోలెడు మంది ఫ్రండ్స్(స్టూడెంట్స్ కూడా)...సంతోషం గా ఉండేది...ఇలాంటి సమయం లో ఒక
మంచి వ్యక్తి,సహృదయుడు(ఇంకా ఏమయినా  నాలుగు మంచి మాటలు కలుపుకొండే) నా రేసుమి చూసి పిలిచి సాఫ్ట్వేర్ కంపెనీ లో,అది ఫ్రేషేర్ గా (జూనియర్  డెవలపర్ గా) ఉద్యోగం  ఇచ్హారు.ఆ సమయం లో అయన నాకు దేవుడి లా,ఆపద్భాందవుడు సినిమా లో చిరంజీవి లాగా కనపడ్డారు .....వచ్చాక  తెలుస్తుంది ఆ NIIT లైఫ్ ఈ సుఖం అని ....అనవసరం గా మా అయన మాటలు విని ఇక్కడ వచ్చిపడ్డాను(కుడితిలో పడ్డ ఎలుక లాగా!!).డెడ్ లైన్(చావటాని మార్గం) అంటాడు,టార్గెట్ అంటాడు,ఇంట్లో వాళ్ళ ఆవిడా తిడితే  ఇక్కడ మీటింగ్ అంటాడు...చస్తున్న అనుకోండి.హుంమ్(పెద్ద నిట్టుర్పు) ఎం చెప్పా మంటారు నా సాఫ్ట్వేర్ కష్టాలు....
             కానీ ఇక్కడ నాలాగా జాబు కోసం ఎదురుచూసే వాళ్ళని చులకనగా చూడటం నేను జీర్ణించుకోలేక  పోతున్న.ఒక నిజాయితి ఉండదు,ఒక బలమయిన,స్పష్టమయిన సంబంధ బాంధవ్యాలు ఉండవు.ఏదో వచ్చామా?పోయామా???అంతే.మొన్న ఈమధ్య ఒక ఫ్రేషేర్ కావాలి అని ఒక ఇంటర్నల్ రెఫరెన్సు మెయిల్ వచ్చింది...అందులో సారాంశం మీకోసం...

                             మాకు(అనగా మా కంపెనీ  కి) ఒక ఫ్రేషేర్ కావాలి,కొంచం జావా తెలిసి ఉంటె చాలు(అని విడివిడిగా టాపిక్స్ లిస్టు ఇచ్హారు..అది చూస్తే మొత్తం జావా తెలిసి ఉండాలి అని చెప్పకనే చెప్పారు)..కానీ మొదటి మూడు నెలలు  జీతం ఉండదు ..ఆ తరువాత పనితీరు నచ్చితే (మాకు అవసరం ఉంటె) జాబు ఇస్తాం....ఎవరయినా తెలిసిన,నమ్మకస్తులు(సాలరీ ఇవ్వకుంట పనిచేయిన్చుకునే విషయం బయట చెప్పనంత నమ్మకం గా) ఉండే నిరుద్యోగులు(దారిద్యరేఖకు దిగువున ఉన్నవాళ్లు) ఉంటె ..రేసుమి పంపగలరు....
          ఇది సారాంశం.
          నిజం గా చెప్పండి మీరయితే  ఏం చేస్తారు?తెలిసన వాళ్ళు ఉంటే(తప్పకుంట ఉండే  ఉంటారు) రెఫెరెన్సు ఇస్తారా??ఇన మూడు నెలలు జీతం ఉండని జాబు కి ఎలా రమ్మని అడుగుతాం??సరే మూడు నెలలు ఎలాగయినా సద్దుకున్న ,తరువాత జాబు ఖచితం గా ఇస్తారు అనే గ్యారెంటి ఇవ్వగలరా??ఇవన్ని ఆలోచించి నేను ఎవ్వరి గొంతు  కోయలేను అని నిర్ణయించుకున్నాను ....కానీ ఎవరో ఒక అబ్బాయి ని పంపించారు పాపం...తన పరిస్థితి కూడా నాలాగే "ఒక్క ఛాన్స్ ,ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అని ఖడ్గం సినిమా లో రవితేజ ల బ్రతిమిలడుకునే పరిస్థితి అని తెలిసి బాధనిపించింది.ఇంజనీరింగ్ అయిపోయి ఇదు సంవత్త్సరాలు ఇన ఇంతవరకు సాఫ్ట్వేర్ దేవత కరుణించలేదు అని చెప్పు కొచ్చాడు ...సరే ఒక్క మూడు నెలలు మనవి కావు అనుకుంటే చాలు ...చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగినయి పోవచ్చు అనుకున్నాడు కాబోలు...వచ్చి జాయిన్ అయ్యాడు.మూడు కాదు ,ఇదు నెలలు అయింది  ,ఇంతవరు సాలరీ అనే మాట అనటం లేదు ....ఉండలేక వెళ్లి అడిగితే మిమ్ములని HR వాళ్ళు తీసుకోవటానికి నిరాకరించారు అని మెల్లగా,పుండు మీద కారం చల్లినట్లు గా చెప్పారు మేనేజర్ గారు.ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు....ఇదు నెలలు జీతం లేకుంట ఈ మహానగరం లో ఎలా బ్రతకగలడు?సాఫ్ట్వేర్ మీద ఉన్నా వ్యామోహం ..తన చేత అప్పు చేసిన తప్పు లేదు అనేలా చేసిందా???తినటాని కి కూడా డబ్బులు లేక ..భోజనం చేయకుంట ఉన్న రోజులు ఎన్నో చూసాడు అంట ఈ ఇదు నెలలలో..అమ్మ,నాన్న లకి జీతం లేదు అంటే బాధ పడతారు అని....ఏదో బ్యాంకు లో ప్రాబ్లెం అని చెప్పి...తన మేడలో ఉన్నా బంగారు గొలుసు అమ్మేసి గడిపాడు అంట.ఇన్ని కష్టాలు పడిన,చివరి కి ఏం మిగిలింది??ఎంత అన్యాయం  జరిగింది చూడండి...మళ్ళి ఇప్పుడు రోడ్డున పడ్డాడు...
           
ఉద్యోగం మీద ఆశ ఉండవచ్చు ...కానీ మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి...మూడు నెలలు ఎందు కు జీతం ఇవ్వనంటున్నారు??అసలు కంపెనీ ఎలాంటిది ?ఒక్క సారి ముందు వెనక ఆలోచించి ముందడుగు వేయండి.అప్పుడప్పుడు నాలాంటి(హి హి హి) అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మర్చిపోకండి ....(కొస మెరుపు)