Wednesday, June 23, 2010

'వర ' కట్నాలు ఎందుకివ్వాలి???

ఇదేం ప్రశ్న తల్లి అని అనుకుంటున్నారా??మీరే చెప్పండి అసలు ఎందుకివ్వాలి ఈ వర కట్నాలు??
    ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే అమ్మానాన్నలని వదిలేసి మీతో వస్తున్నందుకివ్వలా?
   వంటింటి మొహం కూడా చూడని అమ్మాయి మీకోసం వంటమనిషిగా  మారుతున్నందుకివ్వలా?
   ఆరుగంటలను గడియారం లో చూసికూడా ఎరగని అమ్మాయి తెల్లవారుజామున లేచి ఇల్లు చక్కబెట్టుకున్నందుకు ఇవ్వాళ???
   అమ్మాయి హోదానుండి 'అంటీ ' గా మరుతున్నందుకు ఇవ్వాలా???

అసలు ఎందుకివ్వాలి అని అడుగుతున్న అధ్యక్షా....

20 సంవత్సరాలు కళ్ళలో పెట్టుకొని  పెంచిన అమ్మానాన్నలని వదిలేసి మీతో వచ్చినందుకు మీరు కదా మాకు ఇవ్వాలి...అమ్మాయి పుట్టగానే "లక్ష్మి దేవి" పుట్టింది అని సంతోష పడతారు అమ్మానాన్న...కానీ అమ్మాయి పుట్టగానే..ఆ అమ్మాయికి కాబోయే అత్తగారింటి వాళ్ళకి "లక్ష్మి దేవి" పుట్టునట్లుగా మారిపోయింది నేటి సమాజం.అమ్మాయిని ఉత్తి చేతులతో పంపటం ఇష్టం లేక ఏదో తమకు 'ఉన్నంతలో' తల్లిదండ్రులు ఇచ్చుకునేదే 'వరకట్నం' .....కాని ఇప్పుడు తమకు 'ఉన్నదంతా'(అవసరమైతే అప్పు చేసి కూడా ) ఇవ్వడమే వరకట్నం అనబడుతుంది.అందులో కూడా కొన్ని షరతులు ఉన్నాయండోయ్ .....
                
   మొత్తం కట్నం నగదుగా ఇస్తారా లేక నగల రూపం లో ఇస్తారా ??
   బ్యాంకు లో వేస్తారా లేక డి.డి రూపం లో ఇస్తారా??
    ఇల్లు రూపం లో ఇస్తారా లేక భూమి రూపం లో ఇస్తారా???
        ఏది అయిన పరవ లేదు అండి మాకు ...అన్ని మామగారి పేరుమీద ఇవ్వండి అంతే.....
అమ్మాయి తండ్రి : కట్నం ఇచ్చేది అబ్బాయి కి, వీలునామా మామగారి పేరు మీద...మరి మా అమ్మాయి పరిస్థితి ఏంటి??...
అబ్బాయి తండ్రి: మీరు భలే వారండి పెళ్లి తరువాత మా అమ్మేయే అవుతది కదా...అందుకనే నాపేరు కరెక్ట్.
    
                    ఎంత మంచి మమగారో కదా.....
ఏమి అనకుంటే పెళ్లి కొడుకుకి ఒక ఒడ్డాణం చేసి ఇవ్వండి చాలు అని అడిగే సహృదయులు కూడా ఉన్నారండోయ్ ......
            మొన్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పాడు...అందులో కొన్ని మచ్చుకి...
1.ఒకతే అమ్మాయి అయి ఉండాలి (అక్క చెల్లెళ్ళు అస్సలు ఉండకూడదు )
2.అమ్మాయి కి పొరపాటున అన్నా కానీ తమ్ముడు కానీ ఉంటె వాళ్ళు ఈ అమెరిక నో ,పాకిస్తాన్ లో నో ఉండి ఉండాలి ....
3.నాన్న కి ,అమ్మకి (అమ్మాయి వాళ్ళ) మంచి ఉద్యోగం (రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వఉద్యోగం ఐతే మరీ మంచిది) ఉండి ఉండాలి
4.అమ్మాయి ఖచ్చితం గ MNC లో ఉద్యోగం అయి ఉండాలి
5.ఆస్తులు బాగా ఉండాలి (అబ్బాయే కాదు వాళ్ళ అమ్మ ,నాన్న కూడా కూర్చొని తిన్న కరిగిపోనంత )

ఇవన్ని ఉన్న అమ్మాయి ఎలా ఉన్నా...ఎలాంటిది అయిన పరవాలేదా???

నిజంగానే బాగా ఆస్తిపాస్తులు ఉన్నవారు ఐతే ఇచ్చుకోగలరు...ఏమి లేని మధ్య తరగతి,పేద తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ???ఎలా తీర్చగలరు ఈ " గొంతమ్మ కోరికలు ".....
ఇంతగా డిమాండ్ చేసే ఆ అత్తమామలు తమకు ఒక కూతురు(అలయాస్ ఒక ఇంటి కోడలు ) ఉంది అనే విషయం మర్చిపోతారేమో ....

ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరిది తప్పు??వరకట్నాలు అడుగుతున్న అబ్బాయి వాళ్ళదా ?ఇస్తున్న అమ్మాయి వాళ్ళదా??అన్నిటి కి  ఒప్పుకుంటున్న పెళ్లి కొడుకా??
ఎవరు మారాలి ???పెళ్లి పేరుతో జరిగే ఈ అన్యాయాన్ని(వ్యాపారాన్ని) ఎవరు ఆపాలి ???
ఇప్పటికే ప్రభుత్వం చాల చట్టాలు తెచ్చింది ...కాని ఏవి ఆచరణలో పెట్టిన పాపాన పోలేదు....ఎప్పుడు ఈ వరకట్న బాధలు పోయి.....కన్యాశుల్కం వస్తుందో అని వెయ్యి  కనులతో ఎదురుచూస్తున్నా (హి హి హి హి).....

మీరనవచ్చు అందరు 'అలా' ఉండరు అని...నేను చెప్పేది 'అలా' ఉండని వారి గురించే ....ఏదో నా అనుభవాలు,ఆలోచనలు మాత్రమే ఇక్కడ చెప్పను...  (కొసమెరుపు )

27 comments:

  1. నేను కట్నం తీసుకోలేదు అందుకే నాకు తెలీదు :)

    ReplyDelete
  2. తండ్రి ఆస్తి పై(లో) కూతురి కి కూడా హక్కు(వాటా) ఉంది అని ... తనకంటూ ప్రత్యేక కుటుంబం ఏర్పర్చుకున్న మహిళ కి చెందే ఆస్తి భాగమే కట్నం పేరుతో ఇస్తున్నాం... ఇక్కడ సంప్రదాయం అత్తవారింట్లో ఉండటం కాబట్టి కొడుకు ఆస్తి డిమాండ్ చేయట్లేదు ... అమ్మాయి ఆస్తి దగ్గర లేకుండా ఆస్తి వ్యవహారాలు చూసుకోగలదా ? ... అందుకె పెళ్ళితో ఈ తతంగం పూర్తి చేస్తారు...

    ReplyDelete
  3. twarlo mi questions ki answer dorukuthundi

    ReplyDelete
  4. Looks like you are watched some old movie recently. The concept entirly different now. I agree with you there might be some people but not all or not most now.

    Practically some of these questions are being asked by girls now a days. I hate to list them all but some of them,

    Is Boy living with their parents?

    Is boy parents are living on their own or depend on him?

    Is boy got 85% in his graduation?

    Does boy have any fixed income apart from his job?

    ReplyDelete
  5. ఇవన్ని ఉన్న అమ్మాయి ఎలా ఉన్నా...ఎలాంటిది అయిన పరవాలేదా??? //

    meeru mareenu, alaa elaa kudurutundi ammaayi koodaa baavundaali.

    --Badri

    ReplyDelete
  6. Budda gaari explanation choodandi

    http://gpv-buddha.blogspot.com/2010/06/blog-post_3595.html

    ReplyDelete
  7. I agree with Pracash. In AP, Guys take dowry and after no other share expected in the property of the girl's father.
    In TamilNadu, they do not take dowry.But they take 33% of share in the property.

    ReplyDelete
  8. మీ భావాలు బావున్నాయి.వాస్తవానికి వదువే వరునకు అసలు.సిసలైన కట్నం.చాలామంది వరులకు ఈ నిజం తెలియడంలేదు.అసలు ఆడపిల్లే లక్ష్మీదేవి అంటారు గదా కవిత గారు /జయదేవ్.చల్లా -చెన్నై-౧౭

    ReplyDelete
  9. The practice of dowry is a complex issue. No simple answer's to the points raised by the blog's author.

    It has economical, cultural, social, geographical and religious elements.

    With out dwelling into the reasons mentioned above, I would like to point out the following.

    1) If the parents of the Bride (or girl herself), choose a Bridegroom compatible with her family circumstances(social & economic status), the issue of dowry go away gradually.

    It is still persisting because of higher expectations of Bride's parents or Bride her self while choosing a Bridegroom. They do that way, because they seek social acceptance and financial stability.

    If the role of parents go away from choosing a Bridegroom, the practice of dowry vanishes gradually.

    ReplyDelete
  10. కట్నం ఇచ్చేదీ మగాడే. తీసుకునేదీ మగాడే. ఆ కట్నం డబ్బులు సంపాదించడం కోసం నానా తిప్పలు/బాధలు పడేది కూడా మగాడే. ఏదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్లుగా మధ్యలో ఆడాళ్లకెందుకో మంట. :-))

    ReplyDelete
  11. @శ్రీనివాస్ గారు చాల మంచి పని చేసారండి ....కట్నం తీసుకోనందుకు ధన్యవాదాలు ...మీలాగా అందరు ఆలోచిస్తే ఈ సమాజం తొందరలోనే బాగుపడుతుంది ....

    @ప్రకాష్ గారు,చాల చాల బాగా చెప్పారు అండి....ఉన్న ఆస్తినే వాటాలు పంచితే అందరికి సంతోషమే...కాని అది దారిమల్లినట్లుగా అనిపిస్తుంది ...అప్పోసప్పో చేసి అయిన ఆడపిల్ల పెళ్లి చేయాలి అనే పరిస్థితి వచ్చింది.వాళ్ళు సంతోషంగా ఇంచినదే వరకట్నం అంటే.....అంతకంటే మంచి సమాజం ఇంకోటి ఉండదు ....అలాంటి రోజులు రావాలి అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ...

    @శివ సమాధానం దొరకాలి అనే ఎదురుచూస్తున్నాం ....

    @అననిమౌస్ గారు,అలాంటి వాళ్ళుకూడా ఉన్నారు ...కాదనట్లేదు కానీ...వాళ్ళ డిమాండ్స్ కి కారణం కూడా ఈ వరకట్నమే అయి ఉండవచు....మేము మీరు అడిగింత కట్నం ఇస్తున్నప్పుడు మీరు కూడా మా డిమాండ్స్ కి తగినట్లుగా ఉండాలి అని ఉదేశ్యం ఏమో....నా అబిప్రాయం మాత్రమేనండోయ్.....

    @బద్రి గారు....కదా మరి!!!!....అమ్మాయి గుణగణాలు ,అమ్మాయి బాగుంటే చాలు అని అనుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి .....

    @తెలుగు గారు...మంచి సమాధానాలు ఇచ్చారు కదా అండి బుద్ధ గారు .....

    @హరీష్ గారు,ప్రకాష్ గారికి ఇచ్చిన సమాధానం మీకు కూడా అండి...ఉన్నదాంట్లో వాటాలు తీసుకుంటే అంతకంటే అదృష్టం కూడానా ???మీకుందా? లేదా?? మాకు అనవసరం,మా అబ్బాయి 'ఇంత' చదివాడు,'ఇంత' సంపాదిస్తున్నాడు ...మాకు 'ఇంత' కావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు అనే కదా బాధ అంత ....ఒకరకంగా తమిళనాడు లో నాయమేనండి ....వస్తురుపేనా మాత్రమే తిసుకున్తున్న్నారు...

    @జేయదేవ్ గారు.....ఎంత మంచి మాట అన్నారు అండి....వధువే వరుడికి అసలయిన కట్నం....వినడానికే చాలా సంతోషంగా ఉంది...మీ వాక్యాలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి...ధన్యవాదాలు అండి...

    అననిమౌస్ గారు,మొదటగా మీకు ధన్యవాదాలు...చాలా చక్కగా,ఓపికగా వివరణ ఇచ్చారు అండి...మీరు చెప్పిన ప్రతి పాయింట్ నూటికి నూటొక్క పాలు నిజం అండి ...నేను ఒక్క అబ్బాయి సైడ్ ఈ తప్పు అని చెప్పటం లేదు...."మాకుతురికి ఇంత కట్నం ఇచ్చాను " అని అమ్మాయి వాళ్లు కూడా prestagious గ ఫీల్ అవుతున్నారు...అదికూడా ఒకందుకు కారణం అవుతుంది .....

    నాగ ప్రసాద్ గారు...కట్నం ఇచేది,తీసుకునేది మరియు సంపాదించేది మగవాళ్ళే కానీ.. "అమ్మాయి"(వధువు) పేరుతోనే కదా ఈ వ్యవహారం జరుగుతుంది...
    "మా కూతురుకి కట్నం ఇస్తున్నాను" అంటారు వధువుతండ్రి....
    "మా ఆవిడకి ఇంత కట్నం తెచ్చింది" అంటాడు వరుడు....
    "మాకోడలు ఇంత కట్నం తేవాలి " అంటారు మామ గారు...
    మద్యలో అమ్మాయే కదా కీలక పాత్ర ....అమ్మ్మాయే లేకుంటే 'వర'కట్నం అనే మాట ఎందుకొస్తుంది చెప్పండి ....అందుకే ఒక అమ్మాయి(అలయాస్ ఒక కోడలు) గ ఇంత బాధ అదే మీరనే "మంట ".
    ఇంకో మాట అండి ...ఇప్పుడు భార్య , భర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు...ఐతే ఇప్పుడు మాకు మాట్లాడానికి (అదే మీరనే 'మండిపడడానికి') హక్కు ఉన్నట్లే కదా ....

    ReplyDelete
  12. కవిత గారు, ఈ వర కట్నం అనేది అనాదిగా మన సమాజంలో పాతుకుపోయింది. దాన్ని మూలాలతో సహా పెకిలించి వేయడం సాధ్యం కాకపోవచ్చు కానీ, కొత్త తరం యువకులు ఈ దురాచారాన్ని పాటించకుండా ఉంటె, భావి తరాలలో నెమ్మదిగా ఈ వర కట్నం అనేది నాశనం అవుతుంది.. ఎంత చదుకున్న యువకుడు అయినా తన తండ్రి కట్నం తీసుకుంటుంటే అడ్డుకోలేకపోవడం మూర్ఖత్వం.. రేపు తనకి కూతురు పుట్టినా అదే పరిస్థితి అని ఎందుకు ఆలోచించడు.. ఇప్పటికే నగరాలలో చాలా మార్పు వచ్చింది .. పల్లెల్లో చిన్న పట్టణాలలో మార్పు ఇంకా రావలసి ఉన్నది.. మీలో భావోగ్వేదాన్ని చాలా చక్కగా వివరించారు.. నెనర్లు :-)

    ReplyDelete
  13. అమ్మా,నాన్న, అత్తా ,మామ ఎవరైనా మనవాళ్ళే కదా. వాళ్ళ కోసం ఎన్నైనా సేవలు చేయొచ్చు.అది పెద్ద issue కాదు.ఏమంటారు కవిత గారు?
    కాని అమ్మా నాన్నలు చూసినంత ప్రేమగాను,గారంగాను అత్తా మామలు భర్త కూడా అలాగే చూడాలని కోరుకుంటుంది ప్రతీ అమ్మాయి. అలాంటి ప్రేమైనా గారమైనా డబ్బు పెట్టి కొనుక్కోవాలంటే అది మాత్రం సమంజసం కాదు .

    ReplyDelete
  14. nijame namDi,naa adrushTamemo kaani , maa cheLli ki kaTnam ivvaledu, nenu kaTnam teesukonu.

    ReplyDelete
  15. అమ్మాయి పేరుతో ఇచ్చినప్పటికీ, కష్టాలు పడేది మాత్రం మగవాడే. అప్పో, సప్పో చేసి ఆఖరికి తల తాకట్టు పెట్టయినా సరే అమ్మాయికి అమెరికా సంబంధం తేవాలనుకుంటాడు. పోనీ కట్నం తీసుకున్న వాడు బాగుపడతాడా అంటే అదీ లేదు. ఇచ్చిన కట్నం మొత్తంలో దాదాపు 50% శాతం డబ్బులతో అమ్మాయికి బంగారం ఇవ్వాలి. ఇంకా 10% ఆడపడుచుల కివ్వాలి. మిగిలిన 40% లో పెళ్ళి ఖర్చులు పోగా, మిగిలిన డబ్బును అమ్మాయి పేరు మీద బ్యాంకులో వెయ్యాలి. ఆఖరికి మగాడికి మిగిలేది చిప్ప. :-))). ఈ మాత్రం దానికి అంత కట్నం తీసుకున్నారు, ఇంత కట్నం తీసుకున్నారు అని ఒక చెడ్డపేరు. ఆ తర్వాత తనకు ఇద్దరు ఆడపిల్లలు పుడితే, వాళ్ళకు పెళ్ళి చేయడం కోసం మళ్ళీ తను తీసుకున్న కట్నానికి పదింతలు సంపాదించాలి. మరి కట్నం తీసుకుని మగాడు బాగు పడిందేమిటో నాకింతవరకు అర్థం కాలేదు. చెడ్డపేరు మూట కట్టుకోవటం తప్ప. :-))

    ఆ మధ్య కాలంలో ఈ టాపిక్ పై ఒక కామెడీ పోస్ట్ రాస్తే, దాని మీద కూడా సీరియస్ అయ్యారు కొంత మంది. అందుకే ఇంతకు మించి ఈ టాపిక్ జోలికి పోదల్చుకోలేదు.

    అన్నట్టు ఒక విషయం, మీ ఫ్రెండ్‌కు చెప్పండి. ఇప్పుడు ట్రెండ్ మారిందని. ఒకతే అమ్మాయి ఉన్న సంబంధాలని ఈ కాలంలో అబ్బాయిలు ప్రిఫర్ చెయ్యడం లేదు. ఎందుకంటే, అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే, ఆమె తరుపున చూసుకునే వాళ్ళు ఎవరూ ఉండరని. :-))


    >>"ఇప్పుడు భార్య , భర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు...ఐతే ఇప్పుడు మాకు మాట్లాడానికి (అదే మీరనే 'మండిపడడానికి') హక్కు ఉన్నట్లే కదా"

    లేదు..:-)). ఎప్పుడైతే "ఉద్యోగం పురుష లక్షణం" అన్న నానుడి పోతుందో అప్పుడే మీకు హక్కు వస్తుంది. :-). ఎందుకంటే, ఉద్యోగం పేరు చెప్పి మా మగజాతిని ఐఐటీ, యమాసెట్టులనే తదితర పేర్లతో నాలుగ్గోడల మధ్య హింసిస్తున్నారు. :-))

    ReplyDelete
  16. నాగ ప్రసాద్ జయహొ, జయహొ, జయహొహొ హొ హొ హొ హొ హొ హొ హొ హొ హొ .......... అక్క నిన్ను ఇంక ఆ దేవుడే రక్షించాలి:-)అమ్మో నాకు ఏ పాపం తెలియదు మల్లి వస్తా:-)

    ReplyDelete
  17. @కిషన్,చాల బాగా చెప్పారు,....ఈ తరం యువతీ,యువకులు ఈ దురాచారాన్ని మార్చటానికి కృషిచేయాలి ....సరే ఐతే మీనుంచే స్టార్ట్ చేద్దాం ....ఏమంటారు??

    @శివరంజని మన వాళ్ళకోసంఎంత రిస్క్ తుసుకున్న తప్పేమీ ఉండదు ....కానీ వాళ్ళ ప్రేమని డబ్బుతో(కట్నం) కొనడమే బాధాకరమయిన విషయం....

    @హను,మంచివాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది....కట్నం తిసుకోకుడదు అనే మీ నిర్ణయని కి మీకు చప్పట్లు....

    @నాగప్రసాద్ గారు,మీరేదో చాల కోపం లో ఉన్నట్లు ఉన్నారు...ఎప్పుడో,ఎక్కడో ఈ కట్నం విషయం లో కష్టాలు అనుభవించినట్లు ఉన్నారు(నా లాగే )...ఎవ్వరి అభిప్రాయాలూ వాళ్ళవి....మీ అబిప్రాయాలను గౌరవించటం సాటి బ్లాగర్ గా నా బాద్యత...ఒక్క విషయం అండి..అస్సలు నేను చెప్పకూడదు అనుకున్నాను ...కానీ మీకోసం చెపుతున్న .....నేను ఈ వరకట్న వేదింపులు అనుభవించాను ...ఇంత జాబు చేసి ,ఇంత సంపదిస్తున్నకూడా ఇంకా పుట్టింటినుంచి తేవాలి అనే ఆచారం నేను తట్టుకోలేక ఇలా టపా రూపం లో బయట పడ్డాను....

    @అశోక్ తమ్ముడు,నువ్వు సమన్యుడివి కావు....

    ReplyDelete
  18. అవును అక్క నేను సామన్యుడిని కాదు అని నాకు కొంచెం అనిపించింది కాని మీరు పూర్తిగ చెప్పరు.

    ఎందుకంటే మొన్న బ్లాగ్ అంతర్జాలం లో అతివలు అనే టైటిల్ తో పాటు బ్లాగ్ అంతర్ జాలం లో అబ్బాయిల హవా అనే టైటిల్ ప్రస్తానానికి వచ్చింది. ఆ ప్రస్తానంలో మాలకుమార్ గారు కొందరి బ్లాగ్ ల తోపాటు నా బుజ్జి బ్లాగ్ ను కూడ పరిచయం చేశారు మాలకుమార్ గారికి ధన్యవాదాలు ఒక్కసారి మీరు కూడ తిలకించండి.http://sahiti-mala.blogspot.com/2010/06/blog-post_19.html

    అయినా మల్లి వస్తాను అప్పుడు అసలు,సిసలైన మీ పోస్ట్ కి కామెంట్ ఇవ్వడానికి(కొసమెరుపు)

    ReplyDelete
  19. @కవిత గారు, కట్నం విషయంలో నేను ఇప్పటి వరకు ఎటువంటి కష్టాలు అనుభవించలేదు. :-)). ఏదో మా మగవాళ్ళకు సపోర్ట్‌గా ఉంటుందని సరదాగా అలా రాశాను. :-))

    >>"ఇంత జాబు చేసి ,ఇంత సంపదిస్తున్నకూడా ఇంకా పుట్టింటినుంచి తేవాలి అనే ఆచారం"

    It depends on. అబ్బాయి గవర్నెమెంట్ జాజ్ చెయ్యాలి. లేదా ఐఐటీలో చదివి మంచి పొజిషన్లో ఉంటూ బాగా వెనకేసి ఉండాలి. అబ్బాయి వెనక కోట్లు కోట్లు ఆస్తి పాస్తులుండాలి. ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు పీజీ చేసి ఉండాలి అనుకుంటున్నారు. ఇట్టాంటి గొంతెమ్మ కోరికలు కోరుకుంటే, దానికి తగ్గట్టే కట్నం కూడా ఇవ్వాల్సి వస్తుంది మరి. నేను నా లైఫ్‌లో చాలా ఉదాహరణలు చూశాను. అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు. శక్తికి మించి కట్నం ఇవ్వాలని చూస్తున్నారు. వాళ్ళు తెచ్చుకునే కోడలేమో వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టాలి. వీళ్ళ అమ్మాయి మాత్రం మెట్టినింటికి వెళ్ళి ఏ మాత్రం పని చేయకూడదు. ఇట్టాంటి మెంటాలిటీ ఉన్నంతకాలం వరకట్నాలు ఉంటూనే ఉంటాయి.

    అంతెందుకండీ, స్వంతంగా బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు వెనకేసే వాడి కంటే, ఎక్కడో, ఏదో సిటీలో ఐటీ కూలీ చేస్తూ సంవత్సరానికి మహా అయితే లక్షో, రెండు లక్షలో వెనకేసే వాడినే ఫ్రిపర్ చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు. కాబట్టి, డిమాండ్‌కు తగ్గట్టుగా వాళ్ళు కూడా కట్నం డిమాండ్ చేస్తారు.

    ఇంకా పొలం పనులు చేసే వాళ్ళని అయితే ఎదో అంటరాని వాళ్ళను చూసినట్టు చూస్తున్నారు.

    ReplyDelete
  20. తొమ్మిది నెలలు చీకటిని చేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ
    ఇరవయి ఏళ్ళు విద్యాబుద్దులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న

    కుతురికి ఈడు రాగనే ముందుగ అలోచించి తాపత్రాయపడి
    చాలిచాలని మద్యతరగతి రాబడితో అప్పొసోప్పొ అని పెళ్లి చేసి

    అక్కడితో ఆగిపోని అయ్యవారికి పండుగకు పబ్బనికి మల్లి ఎదొ బహుమతి ఇచ్ఛి
    మధ్య మధ్యనా పార్టీలు, పెరంటాలు, ప్రెజంటేషన్ల, సందడులు చేసి

    కాళ్ల పారాణి ఆరకముందే ఇక వరుడి కుటుంబానికి ఆశ కాస్త ఎక్కువయె
    హింస పెరిగి ఇక నుంచి కట్నకానుకల కిరికిరి కూడ మొదలుపెట్టే

    మూట ముల్లె సర్దుకోని మల్లి మద్యతరగతి ఇంటిని తట్టి
    బరువెక్కిన గుండేతో భారంగా శ్వాస పిలుస్తు జరిగింతా ఎడ్చిచెప్పే

    ఆవేదనతో గుండే పగిలిన భాదతో వున్నఈ నిరుపేదకి ఇంకా ఏముంది ఇవ్వటానికి మరణం తప్పా!!!!!!!!!!!

    ఈ చట్టంఎంతో పటిష్టంగా ఉన్నప్పటికీ అమల్లో మాత్రం ఎన్నో లోపాల మరెన్నో సమస్యలు. అసలు నిందితులు చట్టం కళ్ల నుంచి సులువుగా తప్పించుకుంటుంటే చాలా సార్లు అమాయకులే బలవుతున్నారు. ఇక, కట్నం రూపేణా ముట్టజెప్పిన నగదు, నగలు, ఖరీదైన కానుకలు అమ్మాయి చనిపోయినా, విడాకులు తీసుకున్నా వెనక్కి మాత్రం రావు. ఒకవేళ ధైర్యం చేసి అడుగుదామంటే దానికి సాక్ష్యాలుండవు. కోర్టులకు వెళ్లినా ఉపయోగం ఉండదు. చాలా కుటుంబాలు ఇలా అమ్మాయితో పాటు డబ్బునూ పోగొట్టుకోవాల్సి వస్తుంది. వధువు తల్లితండ్రులుదశాబ్దాలుగా మన దేశంలో ఇదే పరిస్థితి. ఎంతో మంది విడాకులు తీసుకుంటున్నా కట్నం రూపేణా ఇచ్చిన స్త్రీ ధనాన్ని మాత్రం తిరిగి అందుకోలేకపోతున్నారు.


    ఎప్పటివరకైతే తేరగా వచ్చిన సొమ్ముతో ఆస్థులు కూడాబెట్టుకుందామన్న మనస్తత్వాలు మారవో, ఎప్పటివరకైతే డబ్బులు వున్నవాళ్లు లక్షలకు లక్షలు ఇచ్చి ఆడపిల్లలను పంపి వాళ్ళు సుఖంగా కూడా వుండాలని ఆశించే పిచ్చి తల్లిదండ్రులు వుంటారో, ఎప్పటివరకైతే అమ్మాయిలు డబ్బు, హోదాలున్న అబ్బాయిలను మాత్రమే తగిన వరులుగా భావిస్తూ వారితో జీవితాన్ని పంచుకోవడంకోసం వెంపర్లాడుతూవుంటారో అప్పటివరకూ ఈ పరిస్థితి మారదు................ మారదు................ మారదు.....................


    అవును తల్లి నిజంగానే ఇది ఒక మంచి ప్రశ్న అమ్మ మలచ్చిమ్మి:-) చాల సాహసించావు ఇల ఎవ్వరు సాహసించి రాయరు. రియల్లి కవిత అక్క నీ టపాకి నాజోహర్లు తల్లిదండ్రుల కష్టాలను కూడ వివరించావు నాకు చాల నచ్చింది నమస్సుమాంజలులు లేదు లేదు పాదాభివందనాలు.

    ReplyDelete
  21. @నాగ ప్రసాద్ గారు,చాల బాగా వ్యక్తపరిచారు మీ భావాలని ...ధన్యవాదాలు .

    @అశోక్ తమ్ముడు మొదటగా నీకు అభినందనలు...నీ కవితకి ధన్యవాదాలు.చాల చక్కగా చెప్పావ్...నాకు పాదాభివందనాల???ఎంత మాట ,ఎంత మాట??మరి అంత పెద్ద దాన్ని కాదు లెండి.మరల మరల నీ కవితకు ధన్యవాదాలు ...

    @శివ ,Thank you so much....

    ReplyDelete
  22. hmm meeru chepindi 100% correct.. itche vallu vunte teesukovadam lo tappu ledu.. ala ani adigi. peedinchi teesukunte def ga tappee..

    manalo mana mata.. meeru etchara leda adee katnam?

    ReplyDelete
  23. @Anon,

    Thanks.

    Payina comments chadivithe me prashnnaki samadhanam dhorakakane dhorukuthundi.
    O look veyandi mari....

    ReplyDelete
  24. oooo etchara?? adee kada.. glass lekunda tea tagochemo gani.. katnam lekunda pelli matram cheyyaleru ga..

    ReplyDelete
  25. Glass lekunda tea thagocha??ela ela??

    Nijam ga chepparandi babu..eppudu maruddo ee samajam...

    ReplyDelete
  26. "ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరిది తప్పు??వరకట్నాలు అడుగుతున్న అబ్బాయి వాళ్ళదా ?ఇస్తున్న అమ్మాయి వాళ్ళదా??అన్నిటి కి ఒప్పుకుంటున్న పెళ్లి కొడుకా??
    ఎవరు మారాలి ???పెళ్లి పేరుతో జరిగే ఈ అన్యాయాన్ని(వ్యాపారాన్ని) ఎవరు ఆపాలి ???"

    కాంప్లికేటెడ్ క్వస్టెన్స్ అడిగారు.
    ఎవరో ఒకరో లేక కొంత మంది వల్లనో సాధ్యమయ్యేది మాత్రం కాదు అని చెప్పగలను. ఒకవేళ ఏదైనా ప్రయత్నం మొదలు పెట్టినా ఫలితాలు అంత త్వరగా కనిపించవు. సమాజం చాలా ఎక్సాసెర్బెటెడ్ గా తయారయింది. పెళ్ళిలో తాళి, జీలకర్ర బెల్లం లాంటి వాటిలా కట్నం కూడా ఒక భాగమైపోయిందంటే జనాల మనసుల్లో ఎంత బలంగా నాటుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

    మీరన్నట్టు కన్యాశుల్కం లాంటి నవల ఏదైనా వస్తే మార్పు వస్తుందేమో...
    గురజాడ గారిలాగా తెలియకుండా నెమ్మదిగా antidote ని పాఠకుల హృదయాల్లోకి ఇంజెక్ట్ చేసే రచనలు కావాలి.

    ReplyDelete