Saturday, June 5, 2010

నా(మన ) సాఫ్ట్వేర్ కష్టాలు....

ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే పెళ్లి చేసేసారు ఇంట్లో.మా శ్రీవారు  చెన్నై లో  జాబు కాబట్టి నాకు కూడా అక్కడే జాబు వస్తుంది లే అనే ధైర్యం తో "వాకే " అనేసా పెళ్లి కి.కానీ అనుకున్నది ఒక్కటి,అయినది ఒక్కటి.పెళ్లి చేసుకొని,చెన్నై కి వచ్చిసెటిల్ అయ్యే లోపు.. రెండు  సంవత్సరాలు పయినే పట్టింది.అప్పటి కి  ఫ్రేషేర్ టైం కాస్త  అయిపోయింది.అటు ఎక్స్పీరింస్ కూడా లేదాయే...ఏమి చేద్దురా  దేవుడా అని ఒకటే దిగులు పట్టేసింది.మా బాట్చు(హారిక,పద్దు మరియు ఇతర స్నేహితులు ) అంతా ఏదో ఒక జాబు లో జాయిన్ అయ్యారు.నేనేమో ఇలా ఏకాకి నిరిద్యోగిల మిగిలి 
పోయా.ఏం చేయాలి అని హారిక కి ఫోన్ చేస్తే "తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్నావ్,ఇప్పటికయినా మించి పోయింది లేదు ,హైదరాబాద్ కి వచ్చేయి  జాబు,విడాకులు రెండు నేను అర్రెంజ్ చేస్తా " అని మన్మధుడు సినిమా లో నాగార్జున ల చెప్పింది.ఇప్పుడు ఏం చేయలిరో దేవుడా అని తల బాదుకుంటున్న సమయం లో  "జావా " నేర్చుకుంటే జాబు తొందరగా వస్తుంది అని ఒక శ్రేయోభిలాషి గారు చెప్పారు.ఎలాగో అలా జావా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టా.మొదట్లో బాగా భయమనిపించేది... పోగా పోగా ఇంటర్వ్యూ అంటే బయమే లేకుంట పోయింది(తినగ తినగ వేము తియ్యనుండు టైపు లో అన్నమాట).ఇంటర్వ్యూ అంటే భయం  ఉండేది కాదు ,కానీ మా ఆయనని చూస్తే నే భయం వేసేది ...ఎందుకంటే ఇంటర్వ్యూ అవగానే రిజల్ట్స్ వస్తాయి   కదా....అది ఎలార బాబు చెప్పేది అని...(జాబు రాలేదు అనే కదా చెప్పాలి).మరి నా పరిస్థితి(ఎవ్వరు ఆలోచించరు) అలానే ఉంది ....జావా అప్పుడే నేర్చుకొని ,పది మంది చెప్పిన మాటలు విని రెండు  సంవత్సరాలు "ఫలానా" కంపెనీ లో ఉద్యోగం  చేశాను అని అబద్ధం చెపుతున్నాకదా...ఐన మన వెర్రి కాని..ఆ మాత్రం కనిపెట్టలేర అండి ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు???అది నాలాంటి వాళ్ళ ని చూస్తే యిట్టె చెప్పేస్తారు...అంత అమాయకం  గా పెడతాం కదా మనం ఫేస్ ఆ సమయం లో.ఏది ఏమైతే నేం...సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి ...ఇంటర్వ్యూ కి వెళ్ళటం ..ఇంటికి రాగానే నెక్స్ట్ రౌండ్ కి (సెలెక్ట్ యితేనే ) ఫోన్ చేస్తాం అన్నారు అండి ,అని చెప్పటం అలవాటు అయిపోయింది.తిరగని కాంసేలేటేన్చి లు లేవు అనుకోండి.అలా ఒక ఆరు నెలలు వెతికా ఉద్యోగం కోసం.అప్పుడు ఒక ఐడియా వచ్చింది...ఇలా ఉద్యోగం(సాఫ్ట్ వేరు) కోసం అంటూ సమయం వృధా చేయడం కంటే...ఏదయినా టెక్నికల్ ఇనుస్త్యుటులో అయిన  జావా ఫాకల్టి గా చేయటం మంచిది కదా...అలా చెపితే మనకూ మంచిది.... అటు పిల్లలకూ మంచిది...వెంటనే మా వారి చెవిలో ఉదేసా నా ఐడియా.గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది 
....NIIT  లో నా ఫస్ట్ జాబు ఫాకల్టి గా.NIIT  కబుర్లు చెప్పాలి అంటే ఇంకో టపా రాయాల్సిందే....అంత బాగా నేర్చుకున్న జావా మరియు జీవిత పాఠాలు....అప్పుడు తెలిసింది నాకు "నేను ఫాకల్టి కి ఎక్కువ,సాఫ్ట్వేర్ కి తక్కువ " అని.నిజం చెప్పాలి అంటే ....సబ్జెక్టు ఉన్నా తగిన అనుభవం(కంపెనీ  వాళ్ళు ఎదురుచుసేది అదే కదా!!) లేకపోవటమే ముఖ్య కారణం అయినది .
                             ఇలా ఒక సంవతరం పాటు NIIT  లో "మేడం","మిస్"(పెళ్లి అయినాక కూడా!!!) అని పిలిపించుకొని..తెగ మురిసిపోయాను...మళ్ళి మాయన మొదలు పెట్టారు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఫాకల్టి గా చేస్తావ్?సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే ఐడియా ఉందా??లేదా??(నన్ను "మిస్" అని పిలుస్తుంటే కుళ్ళుకొని ,తట్టుకోలేక ఇలా బయట పడ్డారు ) ...మళ్ళి మొదలు సాఫ్ట్వేర్ కష్టాలు ....నిజం చెప్పాలి అంటే నాకు ఆ NIIT  లైఫ్ బాగా నచ్చేసింది ...బోలెడు మంది ఫ్రండ్స్(స్టూడెంట్స్ కూడా)...సంతోషం గా ఉండేది...ఇలాంటి సమయం లో ఒక
మంచి వ్యక్తి,సహృదయుడు(ఇంకా ఏమయినా  నాలుగు మంచి మాటలు కలుపుకొండే) నా రేసుమి చూసి పిలిచి సాఫ్ట్వేర్ కంపెనీ లో,అది ఫ్రేషేర్ గా (జూనియర్  డెవలపర్ గా) ఉద్యోగం  ఇచ్హారు.ఆ సమయం లో అయన నాకు దేవుడి లా,ఆపద్భాందవుడు సినిమా లో చిరంజీవి లాగా కనపడ్డారు .....వచ్చాక  తెలుస్తుంది ఆ NIIT లైఫ్ ఈ సుఖం అని ....అనవసరం గా మా అయన మాటలు విని ఇక్కడ వచ్చిపడ్డాను(కుడితిలో పడ్డ ఎలుక లాగా!!).డెడ్ లైన్(చావటాని మార్గం) అంటాడు,టార్గెట్ అంటాడు,ఇంట్లో వాళ్ళ ఆవిడా తిడితే  ఇక్కడ మీటింగ్ అంటాడు...చస్తున్న అనుకోండి.హుంమ్(పెద్ద నిట్టుర్పు) ఎం చెప్పా మంటారు నా సాఫ్ట్వేర్ కష్టాలు....
             కానీ ఇక్కడ నాలాగా జాబు కోసం ఎదురుచూసే వాళ్ళని చులకనగా చూడటం నేను జీర్ణించుకోలేక  పోతున్న.ఒక నిజాయితి ఉండదు,ఒక బలమయిన,స్పష్టమయిన సంబంధ బాంధవ్యాలు ఉండవు.ఏదో వచ్చామా?పోయామా???అంతే.మొన్న ఈమధ్య ఒక ఫ్రేషేర్ కావాలి అని ఒక ఇంటర్నల్ రెఫరెన్సు మెయిల్ వచ్చింది...అందులో సారాంశం మీకోసం...

                             మాకు(అనగా మా కంపెనీ  కి) ఒక ఫ్రేషేర్ కావాలి,కొంచం జావా తెలిసి ఉంటె చాలు(అని విడివిడిగా టాపిక్స్ లిస్టు ఇచ్హారు..అది చూస్తే మొత్తం జావా తెలిసి ఉండాలి అని చెప్పకనే చెప్పారు)..కానీ మొదటి మూడు నెలలు  జీతం ఉండదు ..ఆ తరువాత పనితీరు నచ్చితే (మాకు అవసరం ఉంటె) జాబు ఇస్తాం....ఎవరయినా తెలిసిన,నమ్మకస్తులు(సాలరీ ఇవ్వకుంట పనిచేయిన్చుకునే విషయం బయట చెప్పనంత నమ్మకం గా) ఉండే నిరుద్యోగులు(దారిద్యరేఖకు దిగువున ఉన్నవాళ్లు) ఉంటె ..రేసుమి పంపగలరు....
          ఇది సారాంశం.
          నిజం గా చెప్పండి మీరయితే  ఏం చేస్తారు?తెలిసన వాళ్ళు ఉంటే(తప్పకుంట ఉండే  ఉంటారు) రెఫెరెన్సు ఇస్తారా??ఇన మూడు నెలలు జీతం ఉండని జాబు కి ఎలా రమ్మని అడుగుతాం??సరే మూడు నెలలు ఎలాగయినా సద్దుకున్న ,తరువాత జాబు ఖచితం గా ఇస్తారు అనే గ్యారెంటి ఇవ్వగలరా??ఇవన్ని ఆలోచించి నేను ఎవ్వరి గొంతు  కోయలేను అని నిర్ణయించుకున్నాను ....కానీ ఎవరో ఒక అబ్బాయి ని పంపించారు పాపం...తన పరిస్థితి కూడా నాలాగే "ఒక్క ఛాన్స్ ,ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి" అని ఖడ్గం సినిమా లో రవితేజ ల బ్రతిమిలడుకునే పరిస్థితి అని తెలిసి బాధనిపించింది.ఇంజనీరింగ్ అయిపోయి ఇదు సంవత్త్సరాలు ఇన ఇంతవరకు సాఫ్ట్వేర్ దేవత కరుణించలేదు అని చెప్పు కొచ్చాడు ...సరే ఒక్క మూడు నెలలు మనవి కావు అనుకుంటే చాలు ...చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగినయి పోవచ్చు అనుకున్నాడు కాబోలు...వచ్చి జాయిన్ అయ్యాడు.మూడు కాదు ,ఇదు నెలలు అయింది  ,ఇంతవరు సాలరీ అనే మాట అనటం లేదు ....ఉండలేక వెళ్లి అడిగితే మిమ్ములని HR వాళ్ళు తీసుకోవటానికి నిరాకరించారు అని మెల్లగా,పుండు మీద కారం చల్లినట్లు గా చెప్పారు మేనేజర్ గారు.ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు....ఇదు నెలలు జీతం లేకుంట ఈ మహానగరం లో ఎలా బ్రతకగలడు?సాఫ్ట్వేర్ మీద ఉన్నా వ్యామోహం ..తన చేత అప్పు చేసిన తప్పు లేదు అనేలా చేసిందా???తినటాని కి కూడా డబ్బులు లేక ..భోజనం చేయకుంట ఉన్న రోజులు ఎన్నో చూసాడు అంట ఈ ఇదు నెలలలో..అమ్మ,నాన్న లకి జీతం లేదు అంటే బాధ పడతారు అని....ఏదో బ్యాంకు లో ప్రాబ్లెం అని చెప్పి...తన మేడలో ఉన్నా బంగారు గొలుసు అమ్మేసి గడిపాడు అంట.ఇన్ని కష్టాలు పడిన,చివరి కి ఏం మిగిలింది??ఎంత అన్యాయం  జరిగింది చూడండి...మళ్ళి ఇప్పుడు రోడ్డున పడ్డాడు...
           
ఉద్యోగం మీద ఆశ ఉండవచ్చు ...కానీ మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి...మూడు నెలలు ఎందు కు జీతం ఇవ్వనంటున్నారు??అసలు కంపెనీ ఎలాంటిది ?ఒక్క సారి ముందు వెనక ఆలోచించి ముందడుగు వేయండి.అప్పుడప్పుడు నాలాంటి(హి హి హి) అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మర్చిపోకండి ....(కొస మెరుపు)
                  

27 comments:

  1. baga chepparu. I madhya I baapatu udyogalu perigayi. aa period ayyaka chetilo dabbulu undavu udyogam undadu. chala jali anipistumdi.

    ReplyDelete
  2. పోస్ట్ బావుంది అని రాయాలో
    కస్టాలు బావున్నాయ్ అని అర్ధంవచేలా వస్తాయని రాయడం లేదు

    కింద ఒక question మార్క్ పెట్టాల్సింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని

    ReplyDelete
  3. sitha kastalu tirchataniki ramudu unnadu kani software kastalu tirchadaniki evaru okaru puttali..(miru kuda kavachhu).faculty post chala baguntandi kada(naa exp)...e madya software cheatings ekkuva ga unnayi

    ReplyDelete
  4. now a days software job becomes hell not a gift

    ReplyDelete
  5. inka cheppali ante e job free ga cheyamani adagaru except okka software job ki tappa , enduko mari teliyadu. janalaki software meeda moju unnatna kalam inthe. evaru bagu cheyaleru
    okka software job matram job ani migathavi job kadu ani feeling.inka enno jobs manaku (naaku kuda)telisna ee job chesthunnanu .tappadu mari

    ReplyDelete
  6. nijam chepparu mana badalu vere vallaki asalu artam kaavu software kada inkenti anukuntaru digithe telustadi dantloni kastalu. tention unna life kavali ante software lo join avvali. miku software ante baga pichha (istam ekkuvayite ilagega anedi :) ) marriage ayyaka kuda software job mida anthaga kalavarincharu. endukante general ga marriage ayithe job evaro koddi mandi chestaru. marriage kakmundu job cheste ika marriage ayaka kuda ala continue chestaru, milaaga ayyaka kuda job chesedi chala thakkuva mandi endukante ma frnds ni chusanu kada. rameshwaram vellina shaneswaram thappaledante ide kabolu :(

    ReplyDelete
  7. ఏదో సరదాగా ఉండే కష్టాలు రాసారనుకన్నా....చివరకు ‘అయ్యో పాపం’ అనుకునెలా చేసారు. హరే కృష్ణ గారి పరిస్థితేను నాది కుడా..

    ReplyDelete
  8. ప్చ్..ప్చ్....పాపం కష్టాలు:(
    బాగారాసారు...:):)

    ReplyDelete
  9. ose banda dhana e post shiva chusarante talwar pattukone hyd ke ostaru......By the way main thing I want to say was its nt ur parents who did ur marriage its u who made them to do ur marriage or else eppateke alope ayye 5 years ayyedhe :)

    ReplyDelete
  10. don't publish....అక్కకి పుట్టిన రోజు శుబాకాంక్షలు.......మీరు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవున్ని కోరుకుంటూ...దేవుడు మీమ్మల్ని ఎల్లప్పుడు చల్లగా చూడలని మనసార ప్రార్థిస్తూ once again many many happy returns of the day akka....keep smile always ...సదా మీ సంతోషన్నికోరుకునే మీ తమ్ముడు....అశోక్

    ReplyDelete
  11. @మనోహర్ గారు,ధన్యవాదాలు.నిజం చెప్పారండి.చూస్తూ కూడా ఏమి చేయలేని పరిస్థితి మనది.

    @హరేకృష్ణ గారు,మరి ఈ సాఫ్ట్ వేర్ జాబుల పరిస్తి అలాగే(అర్థం కాకుంట) ఉంది మరి.ఎన్ని ప్రశ్నార్ధకాలు అయిన పెట్ట వచ్చు.....

    @శివ బాగా చెప్పావ్.కోరి తెచ్చుకున్న కష్టాలు మరి...బరించక తప్పదు మరి.

    @నాగార్జున గారు,మీ అభిమానాని కి ధన్యవాదాలు.హరేకృష్ణ గారికి ఇచ్చిన సమాధానమే మీకు కూడా.

    @పద్మర్పిత ,ధన్యవాదాలు...పాపం కష్టాలు అన్నారు,మరి నేను(నాలాంటి వారు) పాపం కాదా???

    @హారిక,మా అయన నిన్ను ఏమి అనకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాలే .ఇక నా పెళ్లి సంగతి మనం,మనం తరువాత మాట్లాడుకుందాం.

    @అశోక్ తమ్ముడు....ధన్యవాదాలు.నీ విషెస్ నాకు చాల సంతోషాన్ని కలిగించాయి.

    ReplyDelete
  12. @స్వప్న గారు,ధన్యవాదాలు.పెళ్లి అయ్యాక కూడా జాబు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అండి..మా వారికి ఆర్ధికంగా సపోర్ట్ గా ఉండాలి అనేది ముఖ్య కారణం .ఇన నాకు ఇంట్లో ఉంటె బోర్...మనం చదివిన చదువుకు ఒక అర్థం ఉండాలి అనేది నా స్త్రొంగ్ ఫీలింగ్.ఇన మేము ఆఫీసు లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం లెండి...అది చూడలేకే మా బాస్ అప్పుడప్పుడు మీటింగ్లు గట్రా పేడత వుంటాడు...

    ReplyDelete
  13. మన్మధుడు సినిమా లో డైలాగ్ కేక

    ReplyDelete
  14. once again many many happy returns of the day akka

    ReplyDelete
  15. @Shiva ranjani, Thank you so much.

    @Shiva,Thanks for the wishes and about the party...the same response which i got from you,when i ask for your Birthday treat.Enjoy the party thammudu.

    ReplyDelete
  16. naku munde telusu aa dialogue antaru ani

    ReplyDelete
  17. @శివ ,అవునా ??? ఏంటో చెప్పి కొంచం పుణ్యం కట్టుకోబాబు ...అసలే ఏం రాయాలా అని తెగ ఆలోచిస్తున్న ....చెప్పండి ఏం రాయబోతున్ననో ???

    ReplyDelete
  18. chepthe naku enti(asalu naku enti).naa chethilo entho kantho pedithe tappa cheppanu kani. akka kosam policy change chesthanu le.


    i expect or think or may be ur niit faculty exp or mi pellichupulu (don't mind)

    ReplyDelete
  19. Kavitha garu, chala alasymga Chadivanu. Mana kasatalu chala bagunnayi andi. Ayina aa mathram kastalu leka pothe life lo thrill emuntindi cheppandi.

    @Shreyobhilashi

    ReplyDelete
  20. శ్రేయోభిలాషి గారు ,ధన్యవాదాలు.లేట్ గ రిప్లై ఇస్తున్నందుకు క్షమించగలరు .....కష్టాలు బాగున్నాయి అంటారా???కానివ్వండి ....కానివ్వండి.మీరన్నది నిజమే లెండి ...ఆ త్రిల్ ఉండాలి లైఫ్ లో.

    @శివ,లేట్ గ రిప్లై ఇస్తున్నందుకు క్షమించగలరు ...పరవాలేదు బాగానే అవియిడాలు ఇస్తున్నారు...

    ReplyDelete
  21. నమస్కారం.
    మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
    సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
    తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
    సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
    సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
    దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
    -- ధన్యవాదముతో
    మీ సమూహము

    ReplyDelete
  22. achu gudhinattu ma comp laga vundi edi.. kopma teesi meeru ma comp lo vunnara enti?? mee comp name cheptara konchem??

    ReplyDelete
  23. Kachithamga mee comp kadu lendi...Endu kante ma office chennai lo undi...

    ReplyDelete