Friday, May 28, 2010

కళాశాల కబుర్లు ...



" కొత్త బంగారు లోకం " సినిమాలో ఒక tutor  ఉంటారు గుర్తుందా?????.
                                       "వేరు తమరు గోయింగ్??"
                                       "నొ Looks  ఓన్లీ బుక్సు "
                                       "always  వాటర్..నో చదువు మేటర్"

ఇలాంటి చక్కనయిన "తెంగ్లిష్ " మాట్లాడి పిల్లలని బాగా కష్టపెడతాడు(భాష తో )....అచ్చు మా లేడీ వా
ర్డెన్స్ కూడా అలాగే హింసించే వాళ్ళు...అందుకే నా ముందు టపా లో చెప్పాను కదా...మేము ఎంత బాగా పార్టీ ఇచ్చి పగ తీర్చుకున్నామో  ..బహుశ  మా ప్లాన్ మా మిత్ర వర్గం ఎక్కడో లిక్ చేసారు అనుకుంట...అది కాస్తా కొత్త బంగారు లోకం సినిమా కథా రచయిత గారికి దొరికిపోయింది...చక్కగా కాపీ కొట్టి ,చిత్రీకరించారు.అందులో కూడా వాళ్ళ tutor మరీ మా అంత సున్నితం గా కాకున్నా...కొంచం ఘాటు గానే పగ తీర్చుకున్నారు.

     ఈ విధంగా రెండు సంవత్సరాలు అష్టకష్టాలు,హాస్టల్ కష్టాలు పడి...విజయవంతం గా ఇంటర్మీడియట్ ముగించేసాము .....పరవాలేదు మాకు బాగానే టాలెంట్ ఉందండోయ్ ...ఇంటర్ లోను అటు ఎంసెట్ లోనూ మంచి మార్కులే వచ్చాయి (ఎన్ని ఎని మాత్రం అడగ కండి ...గూగుల్ ఉంది కదా అని నేను గుర్తు పెట్టుకోలేదు...గూగుల్ ఏమో " పేజి ని వెతకలేను అని చెపుతుంది "!!!) ..
    అలా ఇంటర్ పూర్తి చేసి....ఇంజనీరింగ్ మళ్లీ నల్గొండ లోనే చేరాను(హాస్టల్ కష్టాలు గుర్తొచ్చి).అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని,ఒక మంచి రోజు చూసి జాయిన్ అవ్వుదాం  అని డిసైడ్ అయ్యాను.ఆ మంచి రోజు వచ్చేటప్పటికి కాలేజి మొదలు పెట్టి ఒక మూడు రోజులు కూడా గడిసి పోయాయి.  సరే మనం లేటు గా వెళ్ళిన అడిగే వారు ఉండరు కదా(ఇదేమైన హాస్టల్ అనుకుంటున్నారా???) అనుకోని.... వెళ్ళా కాలేజికి...మా క్లాసు రూం ఎక్కడో  కనుక్కుందాం అని ఆఫీసు రూం దగ్గరికి వెళ్ళాను ...అక్కడ ఒక అమ్మాయి బుద్దిమంతురాలులా వాళ్ళ డాడి అప్లికేషను పూర్తి చేస్తుంటే...అది చూస్తా కూర్చుంది...ఎక్కడో చుసిన అమ్మాయి లాగా ఉంది అని అనుకునే లోపే..."
          "కవిత....."
          "కవిత...."
                  బాగా తెలిసన గొంతే  అని పరీక్షగా చూసా(సినిమా లో ఐతే కళ్ళజోడు సరి చేసుకుంటున్నట్లు సీన్ పెట్టె వారు...)....."హేఏఏఏఏఏఏఏఎ ....హారిక" ..
            నువ్వుకూడా ఇక్కడే నా??? ఇద్దరం ఎగిరి గంతేసిన అంత పని చేసాం.ఇంటర్ లో మేడంస్ కి treat ఇచ్చిన మా గ్రూప్ లో ఒక మెంబెర్ హారిక....సో మళ్లీ అల్లరి స్టార్ట్ అన్న మాట...
           మీము ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లోనే కూర్చునే వాళ్ళం ....ఎంత బుద్దిమంతులమో కదా....అక్కడ  ఒక లాజిక్ ఉంది అండి...మా క్లాసు రూం ఒక ఆడిటోరియం లాగా ఉండేది...అందుకనే మా మాస్టర్లు హాలు మధ్యలో కి వచ్చి పాఠాలు చెప్పే వారు... మేము ఫస్ట్ బెంచ్ కాబట్టి....మేమేమి చేసిన వాళ్ళకి తెలిసేది కాదు...చక్కగా నిద్ర పోయే వాళ్ళం,ఆటలు ఆడుకునే వాళ్ళం,కబుర్లు చెప్పుకునే  వాళ్ళం.నాలుగు సంవత్సరాలు మేము అదే ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాం...
                             
  రాగింగ్ ఎక్కువ గా అనుబవించదు కానీ...హారిక ని మాత్రం ,రొజూ  (ఒక నెల)  సీనియర్లు "డైరీ మిల్క్" తెప్పించారు...పాపం చాల డబ్బు లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.నన్ను ఒక రోజు బస్సు లో ఒక సీనియర్ మేడం(అలా అనకుంటే తిట్టే వాళ్ళు) పిలిచి నా బయో-డేటా మొత్తం తెలుగు లో చెప్పమని చెప్పింది.అప్పుడు నా కష్టాలు చూడాలి...పదవతరగతి వరకు బాగానే చెప్పాను...ఇంటర్ ని తెలుగు లో ఏమంటారు??ఎంత ఆలోచించిన అర్థం కాలే...మరుసటి రోజు మా ఫ్రెండ్ ని అడిగితే చెప్పింది...పదకొండవ సంవత్షరం అని చెప్పెయమని...నిజమే కదా...నా బుర్ర కి ఎందుక ఆలోచన రాలేదు చెప్మా??(బుర్ర ఉంటె కదా వచ్చేది  అని అంటున్నారా???కానివ్వండి కానివ్వండి).


   నేను కూడా నా సెకండ్ ఇయర్ లో రాగింగ్ చేద్దామా  అని ఒక రోజు బస్సు లో స్టైల్ గా నా ముందు నిల్చున్నఒక జూనియర్ అమ్మాయి ని పిలిచి."సీనియర్ ని కనపడట్లేదా??విష్ చేయాలి అని తెలీదా??" అన్నాను పోసు కొడుతూ...వెంటనే ఆ పిల్ల..."మీరు నా వెనకాల ఉన్నారు ఎలా కనపడతారు " అని అనేసింది....అంతే పరువు నష్టం ..అప్పటి నుంచి మళ్లీ జూనియర్ల  జోలికి పోలేదు....జునియర్లా??మజాకా??
         సెమిస్టరు ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం నైట్ ఔట్లు,కంబైండ్ స్టడిలు చేసి ఎలాగో అలా బయట పడేవాళ్ళం అనుకోండి.ఇలాగె 2nd ఇయర్ ఫస్ట్ సెమిస్టరు ఎగ్జామ్స్ టైం లో  ఒక రోజు అనుకోకుండా కంబినేడ్ స్టడి కుదరలేదు.ఎవ్వరి ఇంట్లో వాళ్ళం చదువుకున్నాం ....ఎక్షమ్ రోజు చక్కగా చేతులో పుస్తకం పట్టుకొని కాలేజీ బస్సు ఎక్కాను....అందరు తెగ చేదివేస్తున్నారు...కానీ అందరి చేతుల్లో ఆ రోజు ఎగ్జాం బుక్ కాకుంట ..వేరే బుక్ ఉంది.ఇదేంటి అని బస్సు మొత్తం తిరిగి తిరిగి చూసా...అందరు అదే పుస్తకాన్ని చించి చించి చదువుతున్నారు...నాకు ఏదో అనుమానం వచ్చి హారిక ని(నా పక్క సీట్ లో నే కూర్చుంది )అడిగా,
                అదేంటి ఇవాళ "XXX"
ఎగ్జాం ఐతే మీరు అందరు "YYY " చదువుతున్నారు . 
 దానికి పెద్ద  డౌట్ ...అవునా???ఇవాళ "XXX" ఎగ్జామా అహ్హ??ఉండు పద్దు ని అడుగుత అని లాస్ట్ సీట్ లో కూర్చున్న పద్దు ని అడిగేసింది...ఇంకేముంది బస్సు అందరికి తెలిసిపోయింది ...నేను "YYY " కి బదులు "XXX " చదువు కొచ్చాను అని.ఇప్పుడు ఎం చేయాలి???భయం తో చెమటలు పట్టేసాయి...సరే ఏదో చ ప్రేపరషన్ టైం లో చదివిన నాలుగు ముక్కలు గుర్తున్నాయి..రాసేద్దాంలే అనుకున్న...వెంటనే హారిక "హే ,supplementary
ఎగ్జాం లో నువ్వు తోడు ఉంటావు కదా...అప్పుడు ఇద్దరం  కంబైండ్ స్టడి చేసి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుందాంలే ...ఇప్పుడు రాస్తే బోర్డర్ లో పాస్ ఐతే మళ్లీ percentage పోతది కదా "అని జ్ఞానోదయం చేసింది...
నాకు కూడా నిజమే అనిపించింది ....సరే మరీ ఇప్పుడు ఇంటి కి వెళ్తే మా అమ్మ తన్తుందే అని బయపడుతూ చెప్పా....ఇంత పెద్ద  ప్లాన్ వేసిన వాళ్ళము ...అక్కడ వేయలేమా???
               సరే అని ఆలోచించడం మెదలు పెట్టాం..అందరు ఎక్షమ్ టెన్షన్ లో ఉంటె...మేము ఎక్కడ సేద తీరాలి అనే టెన్షన్ లో ఉన్నాం...
 వెంటనే ఒక మంచి ఐడియా వచ్చింది(మళ్లీ హారిక కే)...." ఫస్ట్ షో సినిమా సమయం,మన ఎక్షమ్ టైం ఒకటే నే...మనం ఇప్పుడు సినిమా కి వెళ్తే ఎక్షమ్ అయ్యే టైం కి అది అయిపోతుంది ...అప్పుడు ఎక్షమ్ రాసినట్లు గానే...అలసి పోయి ఇంటికి వెళ్ళ వచ్చు "....
         సలహా సూపర్ కదా........అలాగే కానియ్ ...అనే వెళ్లి పోయాము సినిమా(దిల్) కి...
 ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఒక డొక్కు సబ్జెక్టు ఉండేది ఫస్ట్ ఇయర్ లో...అది పాస్ అవడాని కి నేను పడ్డ కష్టాలు దేవుడు కూడా తెలిదు అనుకుంట.
 ఇంకో secrete  అండి...మా కాలేజి అబ్బాయిలకు మాత్రం చెప్పకండే...స్మార్ట్ గా ఉన్న అబ్బాయిలని(అప్పుడప్పుడు మాస్టార్లని) వదలకుంట సైట్ కొట్టే వాళ్ళం(అతడు నాకు,ఇతడు నీకు అని పంచుకొని మరీ )....ఇలాగే నేను  ఒక మాస్టారుని రెండు సంవత్సరాలు సైట్(సైట్ మాత్రమే) కొట్టాను ...కానీ అతను నా కళ్ళ ముందే ఇంకో అమ్మాయి ని పెళ్లి చేసుకొని,ఆ పెళ్లి కి మాకు పార్టీ కూడా ఇచ్చి నా చిట్టి హృదయాన్ని ముక్కలు చేసారు...మళ్లీ నా పెళ్లి టైం లో , అ ముక్కలని అతికించి మా ఆయన కి ఇచ్చాలెండి...
      వినాయక చవితి సమయం లో మాస్టర్ల కోసం వాళ్ళ బల్లల మీద పెట్టిన పులోహోర పొట్లాలు(ప్రసాదం) కొట్టేసి తినడం,పోరపాటున ఎప్పుడయినా అమ్మాయి ల బస్సు ఎక్కినా మాస్టార్లని ఏడిపించటం,ల్యాబ్ ఎగ్జామ్స్ టైం లో అదే మాస్టార్లని నవ్వుతూ పలకరించటం(అప్పుడే కదా మార్కులు ఎక్కువ పడేవి)....అబ్బో ఇలా ఒకటా,రెండా ...మేము చేయని అల్లరి పనులు లేవు అనుకోండి.
          ఆ నాలుగు సంవత్సరాలు గడిచి పోయిందే తెలియ లేదు అంటే,చుడండి ఎంత ఎంజాయ్ చేసామో జీవితాన్ని.
     ఇలాంటి సంగటనలు(అల్లర్లు)  ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే ....ఎంతో సంతోషంగా అనిపిస్తుంది..అవ్వన్నీ గోల్డెన్ డేస్ ..మళ్లీ తిరిగి రాని క్షణాలు..
      ఇంత అల్లరి చేసినా ...మేము అంత ఇప్పుడు బాగానే స్దిరపడ్డం ....ఇప్పుడు హారిక  విప్రోలో,పద్దు HSBC లో మంచి స్థానం లో ఉన్నారు....కానీ వాళ్ళు అందరు హైదరాబాద్ లో ఉన్నారు...నేను ఒక్కదాన్నే ఈ తొక్కలో చెన్నై లో పడి తమిళంలో కష్టాలు పడుతున్న...అప్పుడప్పుడు వెళ్లి పోదామా హైదరాబాద్ కి అనిపిస్తుంది..కానీ మా అయన గారు ఒప్పుకోరు కదా....హారిక ,పద్దు ...ఐ మిస్ యు పీపుల్ అలోట్...
  
   
                                        

Friday, May 21, 2010

ఇది ప్రేమా?? ఆకర్షణా??




మొన్న ఈ మధ్య పేపర్లో చుసిన ఒక కధనం నన్ను కలిచి వేసింది...అది మీతో పంచుకుందాం అని ఇలా మొదలు పెట్టాను ...

http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram4

పాపం ఆ అబ్బాయి పరిస్థితికి కారణం ఎవరు?? ఆ అమ్మాయేనా??? టెక్నాలజీ మనకు మంచి చేస్తుందా?? కీడు చేస్తుందా??తను పోగొట్టుకున్న కాలం,ధనము తిరిగి తెచ్చుకోగాలడా ??

   అబ్బాయిలైనా ,అమ్మాయిలైనా ప్రేమించే ముందు ఆలోచించరా??? "లవ్ అట్ ఫస్ట్ సైట్" అని మాత్రం చెప్పకండి ప్లీజ్ తట్టుకోలేను...సరే అలాగే కానిద్దాం ..మొదటి చూపులోనే ప్రేమ పుట్టినట్లు .ఆలోచన కూడా పుట్టాలి కదా...అలా పుట్టలేదు అంటే అది ప్రేమనో ,కేవలం ఆకర్షణనో ఆలోచించుకోండి ఒకసారి...

 ఒక అబ్బాయిని అమ్మాయో ,ఒక అమ్మాయిని అబ్బాయో చూడగానే ...ప్రేమ అని చెప్పే ముందు ...నిజంగా మనకు తగిన వాళ్ళేనా?? అమ్మ,నాన్న లకు నచ్చుతారా? ఒప్పించాగలమా?? ఇలాంటివి అన్ని ఎందుకు ఆలోచించ కూడదు???
  గుడ్డిగా ప్రేమించేయడం..పెళ్లి దగ్గర కి వచ్చేటప్పటికి అందరికి కష్టాలే...పాపం అమ్మ,నాన్న మన పెళ్లి మీద ఎన్ని అశలు పెట్టుకున్నారో...ఎన్ని కలలు కన్నారో...మీరు చెప్పే ప్రేమ అనే ఒక్క మాట వాళ్ళ కలలని నిలువునా కాల్చేస్తుందేమో ఒకసారి ఆలోచించండి ....

  ఏంటి ఇంత ఘాటుగా రాస్తుంది అనుకుంటున్నారా??? ఏమోనండి ఇలా ప్రేమ పేరుతో జీవితాన్ని ,అందమైన భావిష్యతుని పాడుచేసుకునే వాళ్ళని చూస్తే నాలో దాగి ఉన్న "విజయశాంతి" బయటకు వచ్చేస్తుంది  ...నాకు పేపర్ లో కానీ,టీవీ లో కానీ చూస్తే నే బాధ అనిపిస్తుంది ....అలాంటిది మా కుటుంబం లో జరిగితే తట్టుకోలేక...మీతో ఇలా గోడు వెల్లబోసుకుంటున్న ...


ఒక రోజు పోదున్నే ఆఫీసు కి వచ్చి సిస్టం ఆన్ చేశా....ఫోన్ మోగింది...అబ్బ పోదున్నే మొదలయిందా ...ఈ క్లైంట్ గాడో..ఎన్ని బుగ్స్ లిస్టు ఇస్తాడో ...దేవుడా దేవుడా అని మొక్కుకుంటూ ఫోన్ చూసా....
చిన్ని కాలింగ్ ......అమ్మయ్య అని ఉపిరి పీల్చుకున్న
చిన్ని:కవిత నీకో  గుడ్ న్యూస్..
నేను:అవునా???ఏంటి నీ పెళ్లి కుదిరిందా??
చిన్ని:కాదు
నేను:మరి??
చిన్ని:మీ(నొక్కి చెపుతూ "మీ" అన్నాడు) అనిత కి పెళ్లి కుదిరింది అంట...
నేను:మా అనితకా???
చిన్ని:ఇప్పుడే అంటీ(అంటే మా అమ్మ)కి ఫోన్ చేస్తే చెప్పారు.
                  .....కట్నం,కానుకలు...వగయిరా చెప్పాడు.
 వినగానే తట్టుకోలే క పడి,పడి ఏడ్చేసా  ....
పెళ్లి అనగానే ఎవరయినా సంతోష పడతారు,లేదా మన్మధుడు సినిమా లో లా "ఎందుకు" అని అడగుతారు..ఎందుకు ఏడుస్తున్న అనుకుంటున్నారా???
ఇక్కడ మీకో ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి అండి...తను మీ అనిత అని ఎందుకు అన్నాడు అంటే...

అనిత మా మేనమామ కూతురు ..పుట్టగానే మా తమ్ముడికి అని పేరు పెట్టేసారు...అందరికి తెలిసిన విషయమే...మా నాన్న చివరి కోరిక కూడా అదే అండి...మామకి ఒక్కగానొక్క కూతురు...బాగా గారాలపట్టి..మా మామ వాళ్ళ ఇంట్లో కంటే మా ఇంట్లో నే ఎక్కువ పెరిగింది అనుకుంట...అంత ఇష్టం అమ్మ అంటే...కనీసం రబ్బెర్ బ్యాండ్ కొనాలి అన్న ..కవితక్క(వదిన అనే అలవాటు లేదు లెండి) ఏ కలర్ కొనను అని ...ఫోన్ చేసేది...తీర జీవితం విషయం లో మా ఇష్టాలతో పని లేకుండా ...నిర్ణయం తిసేసుకుంది.
ఏంటి విషయం అని ఆరాతిస్తే...

ఎవరో కాలేజి లో సీనియర్ అంట..డిగ్రీ పూర్తి చేసి జాబు వెతుకుతున్నాడు  అంట..తండ్రి చిన్నప్పుడే చనిపోతే ...వేరే ఒకరు తండ్రి స్థానం లో ఉన్నారు అంట...వాళ్ళ అమ్మ ఒక లేడీస్ ఎంపోరియం పెట్టుకొని గడుపుతున్నారు అంట...
 మరి వెనక,ముందు ఏమయినా ఉన్నాయా??అని అడిగా ఆత్రుతగా....
 కేవలం ఆ ఎంపోరియం తప్పించి వేరే ఆధారం కూడా లేదు...తండ్రి కానీ తండ్రి కొంచం సపోర్ట్ ఇస్తాడు అంట...


మా తమ్ముడిని చేసుకోలేదు అని కాదు నా బాధ....అ అబ్బాయి ఏం పెట్టి పోషిస్తాడు ???ఇంకా ఎన్ని రోజులకు జాబు వస్తుంది?? అలాంటి కుటంబం లోకి మన పిల్లని పంపిస్తే మన  పిల్లకి ఎమైన గౌరవం ఉంటదా??

మా మామ వద్దు అని బుజ్జగించి,కొట్టి,తిట్టినా ప్రయోజనం లేక....బలవంతంగా ఒప్పుకున్నారు(ఒప్పించింది...పెళ్లి చేస్తారా...లేదా అని ఏదో అఘాయిత్యం కూడా చేసుకుంది అంట.) మాకు తెలిస్తే ఎక్కడ మాట పోతుందో అని ఇవేమీ మాకు చెప్పలేదు మా మామ.కనీసం నాకు చెపితే అయినా కొంచం క్లాసు పీకి బుద్ది చెప్పేదాన్నేమో(ట్రైనర్గా పని చేసిన అనుభవంతో )...ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోయింది. ఈ నెల 30  కి తన పెళ్లి.పాపం మా మామ అటు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని...ఎంత క్రుంగిపోతున్నారో అర్థం చేసుకోగలం....ఒక్కసారి ఆలోచించు కొని ఉంటె, తన జీవితం వేరే మలుపుతిరిగేదేమో...తమ్ముడు ఇప్పుడు సింగపూర్ లో ఉన్నాడు...మంచి పోసిషన్,శాలరీ ....ఇలా అన్ని వదిలేసుకొని అక్కడికి వెళ్లి ఎన్ని కష్టాలుపడుబోతుందో ..అని బాధ...

 తన ఒక్క లవ్ వల్ల...అటు తన తల్లిదండ్రులు,ఇటు మా కుటుంబం(మా అమ్మ ఐతే ఇంకా ఏడుస్తనే ఉంది)...ఎంత కుమిలి పోతున్నామో....


అమ్మాయిలు,అబ్బాయిలు ...ప్రేమించండి...కానీ పెళ్లి మాత్రం అందరికి ఇష్టం అయ్యేలాగా బాగా స్థిరపడి ...అందరిని ఒప్పించి చేసుకోండి...తల్లిదండ్రుల సంతోషం కంటే ...ఎక్కువ ఏం ఉండదు జీవితం లో....వాళ్ళ విలువ(నాన్న ని మిస్ అవుతున్న నాకు తెలుసు...వాళ్ళ ఎంత ముక్యమో ...) తెలుసుకొని ముందడుగు వేయండి ..


Anyhow ....I wish you a Happy married life Anitha.....

ఈ మధ్య వచ్చిన "కొత్త బంగారు లోకం " సినిమా లో ఇదే మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ ...ప్రేమించే ముందు..అది ప్రేమ?? ఆకర్షణ అని ...ఒకటి కి 100 సార్లు అలోచించి అడిగేయండి అని చక్క గ చెప్పారు...మూవీ చూడని వాళ్ళు ఉంటె...ఒక లుక్ వేయండి సుమా....

Wednesday, May 19, 2010

ఆ నాటి ఆ బంధం ఏనాటిదో ????

పదవ తరగతిలో మంచి మార్కులు రావడం తో మా ట్యూషన్  మాస్టారు నన్ను ఎంసెట్ మీద బాగా దృష్టి సారించమని చెప్పారు.ఆయన మాట అంటే నాకు,మా కుటుంబానికి  వేదం అన్నమాట .ఎంసెట్ రాంక్ రావాలి అంటే ...మా నల్గొండ లో చదవటం వేస్ట్,అక్కడ అంత మంచి కోచింగ్ ఇచ్చే కాలేజీలు ఏమీలేవు. అందుకని మంచి రెసిడెన్షియల్ కాలేజీ లో చేర్పించాలి అని చెప్పారు నాన్నకి.అమ్మకి ఓకే ,కానీ నాన్న వేరే ఊళ్ళకి పంపను అని తేల్చి చెప్పేసారు.కానీ మా ఊరిలో అసలు మంచి కాలేజీ లేక పోవటం తో తను ఒప్పుకోక తప్పలేదు.మా మాస్టారు సహాయంతో నన్ను గుంటూరు లో మంచి కాలేజీ(అనుకోని) చూసి చేర్పించారు...

                    ఇన్ని రోజులు ఎప్పుడు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళింది లేదు.బాగా హోంసిక్ అనిపించేది.ఎప్పుడు అమ్మ,నాన్న ఫోన్ చేసినా ఏడిచేదాన్ని. కానీ అమ్మ ధైర్యం చెప్పి చదువు మీద దృష్టి నిలుపమని చెప్పే వారు. "అలా లేదు అంటే నాన్న తీసుకొచ్చి నల్గొండలో జాయిన్ చేస్తారు .అప్పుడు ఎంసెట్ ఉండదు ఏమి  ఉండదు.నీ ఇష్టం "అని చెప్పేవారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావటం నా ఆశయం అప్పట్లో.ఇలా ఎడ్చానంటే నాన్న అన్నంత  పని చేస్తారు అని కష్టపడి చదవటం స్టార్ట్ చేశా...మెల్ల మెల్లగా ఫ్రండ్స్ పరిచయం అవ్వటం తో హోంసిక్ తగ్గి ,చదువులో దృష్టిపెట్టగలిగా.

                  అలా మొదలయింది నా కాలేజీ లైఫ్. ఇంక అక్కడినుంచి ఆగలేదు నా కోతి చేష్టలు. మాకు అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే కాంపస్ లు ఉండేవి.ఓన్లీ అమ్మాయిలం మాత్రమే కాబ్బట్టి ,మా అల్లరికి హద్దులు ఉండేవి కావు. మా వార్డెన్స్(రక్షకులు...కాదు వాళ్ళు భక్షకులు) కూడా ఆడవాళ్లే ఉండే వాళ్ళు. అస్సలు బయటి ప్రపంచం తో పని ఉండేది కాదు మాకు. పోదున్నే 4 కి వార్డెన్ మేడం  వచ్చి నిద్రలేపేది,ఆ టైంలో ఆమెని చూస్తే "నీకేం పని పాట లేదా?మా వెంట పడతావ్..." అని తిట్టాలి అనిపించేది.కానీ మనకు అంత ధైర్యం లేదు..అసలే తండ్రి చాటు పిల్లని.ఆమె వాయిస్ కూడా అలాగే ఉండేది...


"అమ్మాయ్... .అమ్మాయ్." అంటూ లేచే వరకు పిలుస్తానే ఉండేది.ఆమె ముందు లేచి కూర్చుంటే కానీ...అక్కడి నుంచి కదిలేది కాదు.మేడం వెళ్ళగానే మల్లి బ్యాక్ టు బెడ్ అన్నమాట.5  కి స్టడీ హౌర్ ఉండేది...ఎలాగో అలా కష్టపడి స్టడీ హౌర్ కి వెళ్ళే దాన్ని అనుకోండి.ఇలా స్టార్ట్ అయ్యేది మా దినచర్య.మేము స్టడీ హౌర్స్ లో చదువుకుంటుంటే మా వార్డెన్స్ మాత్రం చైర్స్ లో కూర్చొని మా ముందే నిద్ర పోయే వాళ్ళు."మమ్ముల్ని జాలి కూడా లేకుండా నాలుగుకి లేపుతారా? మీరు మాత్రం ఇప్పుడు చక్కగా నిద్ర పోతారా???ఎంత అన్యాయం??అలా ఎలా నిద్ర పోనిస్తాం???"...మేము కూడా చిటికలు వేసి వాళ్ళ ని డిస్టర్బ్ చేయడం,లేకుంటే ఏదో తొక్కలో డౌట్ (నిజంగా అది డౌట్ కాదు)అడగటం చేసి పగ తీర్చుకునే వాళ్ళం. వాళ్ళకి మా మీద పీకల దాక కోపం ఉండేది.

ఇది ఇలా ఉండగా ...మా ఫ్రెండ్ ఒక రోజు ఎవరో న్యూ జాయినీ పేరెంట్స్ వచ్చి ఎలా ఉంది కాలేజీ, ఫుడ్  ...వగైరా విషయాలు  అడుగుతుంటే..."అంత బాగానే ఉంటది కానీ..ఈ వార్డెన్స్ పేరెంట్స్  ముందు ఒక మాట...తరువాత ఒక మాట మాట్లాడుతారు" అని చెప్పి...వెనక్కి చూసే వరకు హెడ్ వార్డెన్ అక్కడే నిల్చొని ఉంది....అంతే నిద్ర పోతున్న సింహాన్ని లేపినంత  పనైంది. ఇక అప్పటి నుంచి మేము పడ్డ కష్టాలు,బాధలు ఆ దేవుడుకే తెలుసు.నిజంగా  ఒంట్లో బాలేదు అన్నా కూడా పర్మిషన్ ఇచ్చే వాళ్ళు కాదు.కావాలి అని కోస్చేన్స్  అడిగే వాళ్ళు...అయినా మేమేమైనా  తక్కువ వాళ్ళమా ...మా పనులు మేం చేసేవాళ్ళం.మా అల్లరి తట్టుకో లేక కొన్నిసార్లు ఏడ్చే వాళ్ళు పాపం.ఇంత చేసిన మేము చదువు లో టాప్ త్రీలో ఉండే వాళ్ళం.ఇలా మమ్ముల్ని ..ఒకటి కాదు రెండు సంవత్శారాలు ఏడిపించారు. అతగారిల్లు కూడా ఇలాగే ఉంటది అని చూపించారు అనుకోండి. మేమేమిన తక్కు వ వాళ్ళమ???ఎంసెట్ ఎగ్జాం అయి పోయి హాస్టల్ ఖాళి చేసే రోజు మా వార్డెన్ మేడంస్ ని ట్రీట్ కి ఆహ్వానించాం. షార్ప్ టైం కి చక్కగా  రెడీ అయ్యి వచ్చారు.మేము పుఫ్ఫ్స్,కేక్స్ (అప్పట్లో మేము అవే ఇవ్వ గలిగే వాళ్ళం) అండ్ కూల్ డ్రింక్స్...(కూల్ డ్రింక్స్ బాగా గుర్తు పెట్టుకోండి సుమ!!!)...తరువాత మిమ్ముల్ని ఒక కోస్చేన్  అడుగుతాను మరి.మా బాచ్ అంత తెగ సంతోషంగా ఉన్నాం...హాస్టల్ లైఫ్ కి బాయ్ బాయ్ చెప్పటం,ఎంసెట్ బాగా రాసేసాం,ఇంకో 5  నెలలు  వరకు చదువు అనే వాళ్ళు ఉండరు,అన్నిటి కంటే ముంది ఈ వార్దేన్స్ గొంతు పొద్దున్నే వినే పనుండదు...ఇలా మా సంతోషాల లిస్టు ,ఇండియన్ ఫ్లాగ్ లాగా రెప రెప లాడుతూ ఉంది.మా ఫ్లాగ్ హోస్టింగ్ కి వార్డెన్స్ ని కూడా పిలవటం తో కాంపస్ అంతా ఒకటే సంతోషం.మా వార్డెన్స్ కూడా..."మీరు చాల మంచి వాళ్ళు...కొంచం అల్లరి ఎక్కువనే కానీ...బాగా చదువుతారు అని మా తల్లిదండ్రులతో ఎక్కడ లేని ప్రేమ వోలకబోస్తున్నారు(మరి పార్టీ ఇస్తే ఆమాత్రం చెప్పరా ఏంటి???)".ఇలా అన్ని రకాలుగా  కష్టపడి..హాస్టల్ నుంచి బయటపడ్డాం అన్న మాట.
           అవును మీకు ఎవ్వరికి అనుమానం రాలేదా మా మీద??? ఇంతలా కష్టపెట్టినా కూడా వాళ్ళకి ట్రీట్ ఇవ్వడం ఏంటి అని???ఇంత మంచి వాళ్ళో అనుకున్నారా???
          ఇలా అడిగాకా అయినా డౌట్ వచ్చిందా??
          వచ్చే ఉంటది(వచ్చేలా  చేశాను కదా!!!!)......
          మీ అనుమానం నిజమే సుమండీ....

పద్మ:    ఎంతగా ఏడిపించారు.... వాళ్ళ కి మనం గుర్తుండాలి కదా...
హారిక:   ఎన్ని సార్లు నన్ను హెడ్ వార్డెన్ కి బుక్ చేసారో తెలుసా??
నేను:   ఒకసారి మా నాన్న  ఫోన్ చేస్తే నాకు చెప్పను కూడా చెప్పలేదు ....
     ఇలా అందరం వాళ్ళవాళ్ళ బాధలు అన్ని చెప్పుకొని ,రేపు ఎంసెట్ ఎగ్జాం అనేది కూడా పక్కన పెట్టి (ఎంసెట్ అంటే సంవత్సరాని ఒకసారి వస్తది ,కానీ ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే మల్లి మేడంస్  దొరకరు కదా!!!).....


ఒక మాస్టర్ ప్లాన్ వేసాం....      
  
ఇప్పుడు మీ ప్రశ్న??
ఇంతకు మేము ఇచ్చే  వార్డెన్స్ ట్రీట్ లిస్టు లో ఒక ఐటెం అండర్ లైన్  చేయమన్నాను...ఏంటి అది???మరీ టీవీ అంకర్ లా కాకున్నా....ఏదో అలా ట్రైనర్ గా వర్క్ చేసిన అనుభవంతో అక్కడక్కడ ఇలా ప్రశ్నలు అడుగుతున్నాను...తిట్టుకోకండే  ...
 గుర్తోచిందా??? ఫాస్ట్ గా పైకి వెళ్లి చెక్ చేసుకోండి ...
కనిపెట్టేసారా??
ఎస్...కూల్ డ్రింక్.
మీరు భలే  షార్ప్ సుమండీ....
హ్మం....ఎం చేసాము అంటే...ఆ కూల్డ్రింక్ లో మోషన్  టాబ్లెట్స్ (2 -3 కలిపాం)........వాళ్ళవాళ్ళ పాపాల లిస్టు ని పట్టి టాబ్లెట్స్ నెంబర్ డిసైడ్ చేసాం...మాగ్జిమం మూడే లెండి. పాపం అనిపించినా ఆ టైంలో అలా కసి తీర్చుకోవాలి అనిపించింది. మీరే చెప్పండి ...అమ్మ,నాన్న లని వదిలి హాస్టల్స్ కి వచ్చే పిల్లలని అమ్మ(కనీసం అక్క లాగా)లా  చూడాల్సిన వాళ్ళు...నరకం చూపిస్తే ఇలానే ఉంటది మరి....మేము అయినా మంచి పిల్లలం(కదా !!!!) కాబట్టి టాబ్లెట్స్ తో సరి పెట్టం..అదే ఈ జనరేషన్  పిల్లలు ఐతే ఇంకా ఎంచేసే వారో?
      వార్డెన్ మేడంస్(చెడ్డ వాళ్ళ కు మాత్రమే)...తస్మాత్ జాగ్రత్త...
  

Tuesday, May 18, 2010

ఐ లవ్ యు నాన్నా.....

మాములుగా ఆడపిల్లలకి నాన్నమీద ఎక్కువ ప్రేమ ఉంటుంది,అమ్మతో ఎంత చనువు ఉన్న నాన్న మీద అభిమానం,గౌరవం,ప్రేమ అన్ని ఎక్కువే ఉంటాయి.నేను కూడా ఆ కోవకు చెందిన దాన్నే...

మా ఇంట్లో ఒక్కతే ఆడపిల్లని కావటం వల్ల నేను అందరికి గారాలపట్టిని.నాన్నవాళ్ళ వంశంలో పుట్టిన ఒక్కగానొక్క అమ్మాయిని కావటం,నేను చేసుకున్న మొదటి అదృష్టం.దానికి తోడు నేను పుట్టాక బాగా కలిసి వచ్చింది అంట(ఇంకా నయం నాకు అదృష్టలక్ష్మి అనో లేక మహాలక్ష్మి అనో పేరు పెట్ట లేదు).అసలు ఎంత అంటే..నేను పుట్టగానే మా అమ్మ గారికి పాలు పడలేదు అంట...అలాంటి situations లో అందరు ఏం చేస్తారు???పాలు కొని పడతారు కదా..కానీ మా నాన్నమ్మ ఏకంగా గేదనే కొనేసింది అంట...ఇప్పటి కి గుర్తు చేస్తూ ఉంటుంది.

ఇక మాతాత గారి గురించి చెప్పక్కర్లేదు....బుజ్జమ్మ ,బుజ్జమ్మ అని కలవరించే వారు.స్కూల్ కి వెళ్ళే అప్పుడు,రాగానే కనపడకుండా పోతే అంతే,ఎడ్చేసే వారు. మా నాన్న ఏది తెచ్చిన నాకు ఫస్ట్ ఇచ్చాకే మా తమ్ముళ్ళకి ఇచ్చేవారు .అమ్మ ఎప్పుడయినా పొరపాటున పని చెప్పారు అంటే అంతే,చివాట్లు పడేవి నాన్నతో..."తను చదువుకుంటుంటే ఎందుకల డిస్టర్బ్ చేస్తావ్ అని.." విసుక్కునే వారు(పాపం అమ్మ...)..అప్పట్లో మనం కొంచం బాగానే చదివే వాళ్ళం లెండి.స్టేట్ ర్యాంక్ కోసం ట్రై చేశాను అనుకోండి.మా టెన్త్ ఎగ్జామ్స్ టైంలో ఎవరో బెండకాయ తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అని చెప్పారు అంట నాన్న కి ఇంకా అంతే ...రెండు నెలలు (అంటే ప్రేఫినల్స్ నుండి మెయిన్ ఎగ్జామ్స్ వరకు అన్న మాట) మా ఇంట్లో బెండకాయ కూరే ...మా తమ్ముల్లేమో నన్ను తిట్టు కునే వాళ్ళు..నిన్ను ఎవరు స్టేట్ ర్యాంక్ ట్రై చేయ మన్నారు అని..ఎలాగో అల టెన్త్ ముగించా...ఇంటర్ రెసిడెన్షియల్ లో జాయిన్ అవుతా అంటే..మా నాన్న ససేమిరా అన్నారు...ఎలాగోలా ఏడ్చి గుంటూరు లో జాయిన్ అయ్యాను.జాయిన్ అయ్యాక కానీ తెలిసింది, నాన్న ఎందుకు వద్దు అన్నారో అని...డైలీ ఫోన్ చేసి ఏడ్చే దాన్ని ...అది చూసి నాన్న ప్రతి వీకెండ్(మాకు వీకెండ్ అంటే ఫ్రైడే లెండి) ..ఆఫీసు లో లీవ్ పెట్టుకొని వచ్చేసేవారు.నా ఇంటర్ పూర్తి అయ్యే వరకు మా నాన్న 2yrs లీవ్స్ అడ్వాన్సు తిస్కోవాల్సి వచ్చింది.కష్టపడి(నేను+నాన్న) ఎలాగో అల ఇంటర్ మంచి స్కోరు తో పాస్ అయ్యాను.ఎంసెట్ లో ర్యాంక్ రావడం,ఇంజనీరింగ్ సీట్ రావడం అన్ని జరిగి పోయాయి.

5 సంవత్సరాల తరువాత .....
పెళ్లి అప్పుడు కూడా మా నాన్నని కంప్రోమైస్ చేయాల్సి వచ్చింది..అబ్బాయి బాగున్నారు అంటారు కానీ,చెన్నై లో జాబ్ అంట.అంత దూరం,వేరే రాష్ట్రం అస్సలు పంపను,పెళ్లి కాన్సిల్ అన్నారు.ఎలాగో అలా ఒప్పించాను నేనే...అప్పగింతలు అప్పుడు అమ్మ కంటే కూడా,నాన్న నే ఎక్కువ ఏడ్చారు...చెప్పాలంటే నాకు మా అమ్మ మీద కన్నా నాన్న మీద ఎక్కువ ప్రేమ. ఇప్పటి కి గుర్తొస్తే నాకు తెలియకుండ నేనే ఏడ్చేస్తాను ....

ఇలా చెప్పుకుంట పోతే మా ఇద్దరి అనుబంధం "ఆకాశమంత " మూవీ లో ప్రకాష్ రాజ్ అండ్ త్రిష కంటే ఎక్కువే ఉంటది...

మా అనుబంధం చూసి దేవుడు కి కన్ను కుట్టింది అనుకుంటా ,అనుకోకుండా సంవత్సరం క్రితం లివర్ ప్రాబ్లం తో నాన్న చనిపోయారు(కేవలం యాభై సంవత్సరాలకే.. )..డాడీ ఐ లవ్ యు అండ్ ఐ మిస్ యు సో ముచ్.నా మొదటి పోస్ట్ మీకే అంకితం చేస్తున్నాను నాన్న....మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉంటాయి అనుకోండి ......