Friday, May 28, 2010

కళాశాల కబుర్లు ...



" కొత్త బంగారు లోకం " సినిమాలో ఒక tutor  ఉంటారు గుర్తుందా?????.
                                       "వేరు తమరు గోయింగ్??"
                                       "నొ Looks  ఓన్లీ బుక్సు "
                                       "always  వాటర్..నో చదువు మేటర్"

ఇలాంటి చక్కనయిన "తెంగ్లిష్ " మాట్లాడి పిల్లలని బాగా కష్టపెడతాడు(భాష తో )....అచ్చు మా లేడీ వా
ర్డెన్స్ కూడా అలాగే హింసించే వాళ్ళు...అందుకే నా ముందు టపా లో చెప్పాను కదా...మేము ఎంత బాగా పార్టీ ఇచ్చి పగ తీర్చుకున్నామో  ..బహుశ  మా ప్లాన్ మా మిత్ర వర్గం ఎక్కడో లిక్ చేసారు అనుకుంట...అది కాస్తా కొత్త బంగారు లోకం సినిమా కథా రచయిత గారికి దొరికిపోయింది...చక్కగా కాపీ కొట్టి ,చిత్రీకరించారు.అందులో కూడా వాళ్ళ tutor మరీ మా అంత సున్నితం గా కాకున్నా...కొంచం ఘాటు గానే పగ తీర్చుకున్నారు.

     ఈ విధంగా రెండు సంవత్సరాలు అష్టకష్టాలు,హాస్టల్ కష్టాలు పడి...విజయవంతం గా ఇంటర్మీడియట్ ముగించేసాము .....పరవాలేదు మాకు బాగానే టాలెంట్ ఉందండోయ్ ...ఇంటర్ లోను అటు ఎంసెట్ లోనూ మంచి మార్కులే వచ్చాయి (ఎన్ని ఎని మాత్రం అడగ కండి ...గూగుల్ ఉంది కదా అని నేను గుర్తు పెట్టుకోలేదు...గూగుల్ ఏమో " పేజి ని వెతకలేను అని చెపుతుంది "!!!) ..
    అలా ఇంటర్ పూర్తి చేసి....ఇంజనీరింగ్ మళ్లీ నల్గొండ లోనే చేరాను(హాస్టల్ కష్టాలు గుర్తొచ్చి).అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని,ఒక మంచి రోజు చూసి జాయిన్ అవ్వుదాం  అని డిసైడ్ అయ్యాను.ఆ మంచి రోజు వచ్చేటప్పటికి కాలేజి మొదలు పెట్టి ఒక మూడు రోజులు కూడా గడిసి పోయాయి.  సరే మనం లేటు గా వెళ్ళిన అడిగే వారు ఉండరు కదా(ఇదేమైన హాస్టల్ అనుకుంటున్నారా???) అనుకోని.... వెళ్ళా కాలేజికి...మా క్లాసు రూం ఎక్కడో  కనుక్కుందాం అని ఆఫీసు రూం దగ్గరికి వెళ్ళాను ...అక్కడ ఒక అమ్మాయి బుద్దిమంతురాలులా వాళ్ళ డాడి అప్లికేషను పూర్తి చేస్తుంటే...అది చూస్తా కూర్చుంది...ఎక్కడో చుసిన అమ్మాయి లాగా ఉంది అని అనుకునే లోపే..."
          "కవిత....."
          "కవిత...."
                  బాగా తెలిసన గొంతే  అని పరీక్షగా చూసా(సినిమా లో ఐతే కళ్ళజోడు సరి చేసుకుంటున్నట్లు సీన్ పెట్టె వారు...)....."హేఏఏఏఏఏఏఏఎ ....హారిక" ..
            నువ్వుకూడా ఇక్కడే నా??? ఇద్దరం ఎగిరి గంతేసిన అంత పని చేసాం.ఇంటర్ లో మేడంస్ కి treat ఇచ్చిన మా గ్రూప్ లో ఒక మెంబెర్ హారిక....సో మళ్లీ అల్లరి స్టార్ట్ అన్న మాట...
           మీము ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లోనే కూర్చునే వాళ్ళం ....ఎంత బుద్దిమంతులమో కదా....అక్కడ  ఒక లాజిక్ ఉంది అండి...మా క్లాసు రూం ఒక ఆడిటోరియం లాగా ఉండేది...అందుకనే మా మాస్టర్లు హాలు మధ్యలో కి వచ్చి పాఠాలు చెప్పే వారు... మేము ఫస్ట్ బెంచ్ కాబట్టి....మేమేమి చేసిన వాళ్ళకి తెలిసేది కాదు...చక్కగా నిద్ర పోయే వాళ్ళం,ఆటలు ఆడుకునే వాళ్ళం,కబుర్లు చెప్పుకునే  వాళ్ళం.నాలుగు సంవత్సరాలు మేము అదే ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాం...
                             
  రాగింగ్ ఎక్కువ గా అనుబవించదు కానీ...హారిక ని మాత్రం ,రొజూ  (ఒక నెల)  సీనియర్లు "డైరీ మిల్క్" తెప్పించారు...పాపం చాల డబ్బు లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.నన్ను ఒక రోజు బస్సు లో ఒక సీనియర్ మేడం(అలా అనకుంటే తిట్టే వాళ్ళు) పిలిచి నా బయో-డేటా మొత్తం తెలుగు లో చెప్పమని చెప్పింది.అప్పుడు నా కష్టాలు చూడాలి...పదవతరగతి వరకు బాగానే చెప్పాను...ఇంటర్ ని తెలుగు లో ఏమంటారు??ఎంత ఆలోచించిన అర్థం కాలే...మరుసటి రోజు మా ఫ్రెండ్ ని అడిగితే చెప్పింది...పదకొండవ సంవత్షరం అని చెప్పెయమని...నిజమే కదా...నా బుర్ర కి ఎందుక ఆలోచన రాలేదు చెప్మా??(బుర్ర ఉంటె కదా వచ్చేది  అని అంటున్నారా???కానివ్వండి కానివ్వండి).


   నేను కూడా నా సెకండ్ ఇయర్ లో రాగింగ్ చేద్దామా  అని ఒక రోజు బస్సు లో స్టైల్ గా నా ముందు నిల్చున్నఒక జూనియర్ అమ్మాయి ని పిలిచి."సీనియర్ ని కనపడట్లేదా??విష్ చేయాలి అని తెలీదా??" అన్నాను పోసు కొడుతూ...వెంటనే ఆ పిల్ల..."మీరు నా వెనకాల ఉన్నారు ఎలా కనపడతారు " అని అనేసింది....అంతే పరువు నష్టం ..అప్పటి నుంచి మళ్లీ జూనియర్ల  జోలికి పోలేదు....జునియర్లా??మజాకా??
         సెమిస్టరు ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం నైట్ ఔట్లు,కంబైండ్ స్టడిలు చేసి ఎలాగో అలా బయట పడేవాళ్ళం అనుకోండి.ఇలాగె 2nd ఇయర్ ఫస్ట్ సెమిస్టరు ఎగ్జామ్స్ టైం లో  ఒక రోజు అనుకోకుండా కంబినేడ్ స్టడి కుదరలేదు.ఎవ్వరి ఇంట్లో వాళ్ళం చదువుకున్నాం ....ఎక్షమ్ రోజు చక్కగా చేతులో పుస్తకం పట్టుకొని కాలేజీ బస్సు ఎక్కాను....అందరు తెగ చేదివేస్తున్నారు...కానీ అందరి చేతుల్లో ఆ రోజు ఎగ్జాం బుక్ కాకుంట ..వేరే బుక్ ఉంది.ఇదేంటి అని బస్సు మొత్తం తిరిగి తిరిగి చూసా...అందరు అదే పుస్తకాన్ని చించి చించి చదువుతున్నారు...నాకు ఏదో అనుమానం వచ్చి హారిక ని(నా పక్క సీట్ లో నే కూర్చుంది )అడిగా,
                అదేంటి ఇవాళ "XXX"
ఎగ్జాం ఐతే మీరు అందరు "YYY " చదువుతున్నారు . 
 దానికి పెద్ద  డౌట్ ...అవునా???ఇవాళ "XXX" ఎగ్జామా అహ్హ??ఉండు పద్దు ని అడుగుత అని లాస్ట్ సీట్ లో కూర్చున్న పద్దు ని అడిగేసింది...ఇంకేముంది బస్సు అందరికి తెలిసిపోయింది ...నేను "YYY " కి బదులు "XXX " చదువు కొచ్చాను అని.ఇప్పుడు ఎం చేయాలి???భయం తో చెమటలు పట్టేసాయి...సరే ఏదో చ ప్రేపరషన్ టైం లో చదివిన నాలుగు ముక్కలు గుర్తున్నాయి..రాసేద్దాంలే అనుకున్న...వెంటనే హారిక "హే ,supplementary
ఎగ్జాం లో నువ్వు తోడు ఉంటావు కదా...అప్పుడు ఇద్దరం  కంబైండ్ స్టడి చేసి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుందాంలే ...ఇప్పుడు రాస్తే బోర్డర్ లో పాస్ ఐతే మళ్లీ percentage పోతది కదా "అని జ్ఞానోదయం చేసింది...
నాకు కూడా నిజమే అనిపించింది ....సరే మరీ ఇప్పుడు ఇంటి కి వెళ్తే మా అమ్మ తన్తుందే అని బయపడుతూ చెప్పా....ఇంత పెద్ద  ప్లాన్ వేసిన వాళ్ళము ...అక్కడ వేయలేమా???
               సరే అని ఆలోచించడం మెదలు పెట్టాం..అందరు ఎక్షమ్ టెన్షన్ లో ఉంటె...మేము ఎక్కడ సేద తీరాలి అనే టెన్షన్ లో ఉన్నాం...
 వెంటనే ఒక మంచి ఐడియా వచ్చింది(మళ్లీ హారిక కే)...." ఫస్ట్ షో సినిమా సమయం,మన ఎక్షమ్ టైం ఒకటే నే...మనం ఇప్పుడు సినిమా కి వెళ్తే ఎక్షమ్ అయ్యే టైం కి అది అయిపోతుంది ...అప్పుడు ఎక్షమ్ రాసినట్లు గానే...అలసి పోయి ఇంటికి వెళ్ళ వచ్చు "....
         సలహా సూపర్ కదా........అలాగే కానియ్ ...అనే వెళ్లి పోయాము సినిమా(దిల్) కి...
 ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఒక డొక్కు సబ్జెక్టు ఉండేది ఫస్ట్ ఇయర్ లో...అది పాస్ అవడాని కి నేను పడ్డ కష్టాలు దేవుడు కూడా తెలిదు అనుకుంట.
 ఇంకో secrete  అండి...మా కాలేజి అబ్బాయిలకు మాత్రం చెప్పకండే...స్మార్ట్ గా ఉన్న అబ్బాయిలని(అప్పుడప్పుడు మాస్టార్లని) వదలకుంట సైట్ కొట్టే వాళ్ళం(అతడు నాకు,ఇతడు నీకు అని పంచుకొని మరీ )....ఇలాగే నేను  ఒక మాస్టారుని రెండు సంవత్సరాలు సైట్(సైట్ మాత్రమే) కొట్టాను ...కానీ అతను నా కళ్ళ ముందే ఇంకో అమ్మాయి ని పెళ్లి చేసుకొని,ఆ పెళ్లి కి మాకు పార్టీ కూడా ఇచ్చి నా చిట్టి హృదయాన్ని ముక్కలు చేసారు...మళ్లీ నా పెళ్లి టైం లో , అ ముక్కలని అతికించి మా ఆయన కి ఇచ్చాలెండి...
      వినాయక చవితి సమయం లో మాస్టర్ల కోసం వాళ్ళ బల్లల మీద పెట్టిన పులోహోర పొట్లాలు(ప్రసాదం) కొట్టేసి తినడం,పోరపాటున ఎప్పుడయినా అమ్మాయి ల బస్సు ఎక్కినా మాస్టార్లని ఏడిపించటం,ల్యాబ్ ఎగ్జామ్స్ టైం లో అదే మాస్టార్లని నవ్వుతూ పలకరించటం(అప్పుడే కదా మార్కులు ఎక్కువ పడేవి)....అబ్బో ఇలా ఒకటా,రెండా ...మేము చేయని అల్లరి పనులు లేవు అనుకోండి.
          ఆ నాలుగు సంవత్సరాలు గడిచి పోయిందే తెలియ లేదు అంటే,చుడండి ఎంత ఎంజాయ్ చేసామో జీవితాన్ని.
     ఇలాంటి సంగటనలు(అల్లర్లు)  ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే ....ఎంతో సంతోషంగా అనిపిస్తుంది..అవ్వన్నీ గోల్డెన్ డేస్ ..మళ్లీ తిరిగి రాని క్షణాలు..
      ఇంత అల్లరి చేసినా ...మేము అంత ఇప్పుడు బాగానే స్దిరపడ్డం ....ఇప్పుడు హారిక  విప్రోలో,పద్దు HSBC లో మంచి స్థానం లో ఉన్నారు....కానీ వాళ్ళు అందరు హైదరాబాద్ లో ఉన్నారు...నేను ఒక్కదాన్నే ఈ తొక్కలో చెన్నై లో పడి తమిళంలో కష్టాలు పడుతున్న...అప్పుడప్పుడు వెళ్లి పోదామా హైదరాబాద్ కి అనిపిస్తుంది..కానీ మా అయన గారు ఒప్పుకోరు కదా....హారిక ,పద్దు ...ఐ మిస్ యు పీపుల్ అలోట్...
  
   
                                        

15 comments:

  1. బాగున్నాయి మీ కళాశాల కబుర్లు ...

    ReplyDelete
  2. కవిత గారు, హాస్టల్ లో మీరు ఇచ్చిన పార్టీ ఐడియా ని కొత్తబంగారులోకం లో కాపీ కొట్టలేదు. మా హాస్టల్ లో మా వార్దేన్ ని దుప్పటి ముసుగేసి కొట్టిన దాన్ని కాపీ కొట్టారు. మీరు చెప్పిన కాలేజి కబుర్లు అని విని కాదు కాదు చదివి ఎక్కడికో వెళ్ళిపోయాను. అవి అన్ని గోల్డెన్ డేస్. ఎంత సంపాదించినా మల్లి తిరిగి రావు. ఐ మిస్ యు ఓల్డ్ కాలేజి డేస్. నేను కూడా నా కాలేజి & హాస్టల్ లో చేసిన అల్లరి ని రాస్తాను.
    మోహన్

    ReplyDelete
  3. బాగున్నాయి మీ కబుర్లు:)

    ReplyDelete
  4. భలే ఎంజాయ్ చేసారండి మీరు................. హేపిడేస్ సినిమా సెకండ్ పార్ట్ చూసినట్టుంది మీ పోస్ట్ చదువుతుంటే.

    ReplyDelete
  5. కవిత గారు బాగున్నాయి మీ కబుర్లు . హ హ హ.... నేను మా క్లాస్ లో ఫస్ట్ బెంచే..... నాన్న గారు చెప్పారండి ఎప్పుడు ఫస్ట్ బెంచీ లోనే కూర్చోమని

    ReplyDelete
  6. ఎన్నెన్నో కథలు చెబుతాయి కాలేజి రోజులు
    విన్నాక వివరాలు మిగులుతాయి తీపిగురుతులు

    కాలేజిలో చేరాక పేరు అడిగారు ఊరు అడిగారు
    సంతోషించాను పాట పాడుమని అంటే ఆలోచించాను

    కాలేజికింతలో కొత్త జూనియర్లు వచ్చారు
    తెల్లగా నున్నగానున్న అమ్మయిలైతె చచ్చారు..........

    నేను కొత్తగా క్లాసులోకి వెళ్ళాక నాతో కూడ రాగింగ్ చేయించుకున్నారు
    కాని తర్వత వాళ్ళా స్నేహ హస్తంతో నన్ను స్నేహితులుగా చేర్చుకున్నారు మొదటి సంవత్సరమున మొదలైన పరిచాయలు ముడు సంవత్సరల తర్వత ఓ తీయటి కలలా మిగిలిపోయింది. ఇల చెప్పుకుంటు పోతె ఎన్నొ తీపిగుర్తులున్నాయి కాలేజి రోజుల్లో అందుకే మీరు చేప్పినట్టు college days అద్వితీయమైనవి మరువలేనటువంటివి.

    ReplyDelete
  7. @జీవన్ గారు,ధన్యవాదాలు అండి.

    @మోహన్ గారు,ఐతే మీరు కూడా మా జాబితాలో నే(వార్డెన్ వ్యతిరేక సంగం) వస్తారు అన్న మాట.నిజం గా కాలేజి రోజులు అన్ని ,అందరి జీవితం లో మరపురాని క్షణాలు ...మీ బ్లాగ్ ఇప్పుడే చూసాను అండి...మరి తొందర లో మీ కాలేజి ముచట్లు రాసేద్దురు.....చూస్తాను మాకంటే ఎక్కువ అల్లరి చేసారో లేదో????

    @పద్మర్పిత గారు,ధన్యవాదాలు అండి.

    @3g గారు,ధన్యవాదాలు అండి...అవునండి,కాలేజీ లైఫ్ బాగా ఎంజాయ్ చేసాం.నా పోస్ట్ చూసి సినిమా గుర్తురావడం చాల సంతోషం గా ఉంది అండి...కానీ మీరు నిజం గా పట్టేశారు అండి...నాకు "కొత్త బంగారు లోకం " సినిమా చూస్తే నా ఇంటర్ లైఫ్," హ్యాపీ డేస్ " చూస్తే నా ఇంజనీరింగ్ లైఫ్ గుర్తొస్తాయి.మీ అభిమానాని కి ధన్యవాదాలు.మరి నాకు గోదావరి యాస ఎప్పుడు నేర్పిస్తున్నారు??

    @శివరంజని గారు,ధన్యవాదాలు అండి.అవునా??మీరుకూడా మాలాగే బాగా నే ఎంజాయ్ చేసి ఉంటారు...నాన్న గారు చెప్పారు అంటే పాటించాల్సిందే మరి....

    @అశోక్ తమ్ముడు,ధన్యవాదాలు...నీ కవిత కు ఒక పెద్ద "ఓఓ" ఎసుకున్న్న...నిజం గా ఆ లైఫ్ మల్లి తిరిగి రాదు కదా....

    ReplyDelete
  8. Hello Kavitha garu. Mee kotha tapa chala bagundi andi. Malli Kalasala rojulu gurthuku vachayi. Nenu kooda Inter modati samvatsaram modati bench lone vunnanu. Lecturers Kavalani ala koorchopettevaru. Kani first nunchi last bench marataniki chala kastapadalsi vachindi.Chala kastapadi maranu. Aa taruvatha Kitikilu dooki class jumpings, oka roju dookina ventane pakkane Principal .....:-) Ilantivanni ala ala gurthuku vastunnayi ... Ala ela cheyagaligam anedi teliyatam ledu ...:-)

    @Shreyobhilashi,

    ReplyDelete
  9. @శ్రేయోభిలాషి గారు,థాంక్స్ అండి...అసలు ఆ కాలేజి డేస్ అందరి జీవితం లో మరపురాని క్షణాలు ...ఆ టైం లో మన ధైర్యాని కి ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతది..నిజం గ మన మేనా ఆన్ల చేసింది అని...మీ అభిమానాని కి ధన్యవాదాలు అండి...

    ReplyDelete
  10. Kavitha, Really good work. Your post reminded me of my college days. mee antha allari kakapoyina, edo kontha chesam memu kooda...waiting for ur next post.

    ReplyDelete
  11. @Shiva,Thank you ...

    @Harika...Miss you too.Vachestha vachestha...thondharaga HYD ki.

    ReplyDelete
  12. mi korika(hyd ki ravali ) twara lo tirali(tiram cherali)
    ani korukuntunnanu

    ReplyDelete
  13. chennai netram ( ante madra eye, adee kallakalaka antaru ga), adi vatchi 3 days ayindi.. evala office ki vatcha.. ala ala choostunte me blog tagilindi.. nizamga chala happy ga vundi.. 12.50 aithe enta pedda pani vunna, managers to meeting vunna LUNCH ani chepi takkuna bayatiki vatchest..alantidi evala lunch ki kooda vellakunda chadivaa :)

    nice blog..

    ReplyDelete