Wednesday, May 19, 2010

ఆ నాటి ఆ బంధం ఏనాటిదో ????

పదవ తరగతిలో మంచి మార్కులు రావడం తో మా ట్యూషన్  మాస్టారు నన్ను ఎంసెట్ మీద బాగా దృష్టి సారించమని చెప్పారు.ఆయన మాట అంటే నాకు,మా కుటుంబానికి  వేదం అన్నమాట .ఎంసెట్ రాంక్ రావాలి అంటే ...మా నల్గొండ లో చదవటం వేస్ట్,అక్కడ అంత మంచి కోచింగ్ ఇచ్చే కాలేజీలు ఏమీలేవు. అందుకని మంచి రెసిడెన్షియల్ కాలేజీ లో చేర్పించాలి అని చెప్పారు నాన్నకి.అమ్మకి ఓకే ,కానీ నాన్న వేరే ఊళ్ళకి పంపను అని తేల్చి చెప్పేసారు.కానీ మా ఊరిలో అసలు మంచి కాలేజీ లేక పోవటం తో తను ఒప్పుకోక తప్పలేదు.మా మాస్టారు సహాయంతో నన్ను గుంటూరు లో మంచి కాలేజీ(అనుకోని) చూసి చేర్పించారు...

                    ఇన్ని రోజులు ఎప్పుడు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళింది లేదు.బాగా హోంసిక్ అనిపించేది.ఎప్పుడు అమ్మ,నాన్న ఫోన్ చేసినా ఏడిచేదాన్ని. కానీ అమ్మ ధైర్యం చెప్పి చదువు మీద దృష్టి నిలుపమని చెప్పే వారు. "అలా లేదు అంటే నాన్న తీసుకొచ్చి నల్గొండలో జాయిన్ చేస్తారు .అప్పుడు ఎంసెట్ ఉండదు ఏమి  ఉండదు.నీ ఇష్టం "అని చెప్పేవారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావటం నా ఆశయం అప్పట్లో.ఇలా ఎడ్చానంటే నాన్న అన్నంత  పని చేస్తారు అని కష్టపడి చదవటం స్టార్ట్ చేశా...మెల్ల మెల్లగా ఫ్రండ్స్ పరిచయం అవ్వటం తో హోంసిక్ తగ్గి ,చదువులో దృష్టిపెట్టగలిగా.

                  అలా మొదలయింది నా కాలేజీ లైఫ్. ఇంక అక్కడినుంచి ఆగలేదు నా కోతి చేష్టలు. మాకు అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే కాంపస్ లు ఉండేవి.ఓన్లీ అమ్మాయిలం మాత్రమే కాబ్బట్టి ,మా అల్లరికి హద్దులు ఉండేవి కావు. మా వార్డెన్స్(రక్షకులు...కాదు వాళ్ళు భక్షకులు) కూడా ఆడవాళ్లే ఉండే వాళ్ళు. అస్సలు బయటి ప్రపంచం తో పని ఉండేది కాదు మాకు. పోదున్నే 4 కి వార్డెన్ మేడం  వచ్చి నిద్రలేపేది,ఆ టైంలో ఆమెని చూస్తే "నీకేం పని పాట లేదా?మా వెంట పడతావ్..." అని తిట్టాలి అనిపించేది.కానీ మనకు అంత ధైర్యం లేదు..అసలే తండ్రి చాటు పిల్లని.ఆమె వాయిస్ కూడా అలాగే ఉండేది...


"అమ్మాయ్... .అమ్మాయ్." అంటూ లేచే వరకు పిలుస్తానే ఉండేది.ఆమె ముందు లేచి కూర్చుంటే కానీ...అక్కడి నుంచి కదిలేది కాదు.మేడం వెళ్ళగానే మల్లి బ్యాక్ టు బెడ్ అన్నమాట.5  కి స్టడీ హౌర్ ఉండేది...ఎలాగో అలా కష్టపడి స్టడీ హౌర్ కి వెళ్ళే దాన్ని అనుకోండి.ఇలా స్టార్ట్ అయ్యేది మా దినచర్య.మేము స్టడీ హౌర్స్ లో చదువుకుంటుంటే మా వార్డెన్స్ మాత్రం చైర్స్ లో కూర్చొని మా ముందే నిద్ర పోయే వాళ్ళు."మమ్ముల్ని జాలి కూడా లేకుండా నాలుగుకి లేపుతారా? మీరు మాత్రం ఇప్పుడు చక్కగా నిద్ర పోతారా???ఎంత అన్యాయం??అలా ఎలా నిద్ర పోనిస్తాం???"...మేము కూడా చిటికలు వేసి వాళ్ళ ని డిస్టర్బ్ చేయడం,లేకుంటే ఏదో తొక్కలో డౌట్ (నిజంగా అది డౌట్ కాదు)అడగటం చేసి పగ తీర్చుకునే వాళ్ళం. వాళ్ళకి మా మీద పీకల దాక కోపం ఉండేది.

ఇది ఇలా ఉండగా ...మా ఫ్రెండ్ ఒక రోజు ఎవరో న్యూ జాయినీ పేరెంట్స్ వచ్చి ఎలా ఉంది కాలేజీ, ఫుడ్  ...వగైరా విషయాలు  అడుగుతుంటే..."అంత బాగానే ఉంటది కానీ..ఈ వార్డెన్స్ పేరెంట్స్  ముందు ఒక మాట...తరువాత ఒక మాట మాట్లాడుతారు" అని చెప్పి...వెనక్కి చూసే వరకు హెడ్ వార్డెన్ అక్కడే నిల్చొని ఉంది....అంతే నిద్ర పోతున్న సింహాన్ని లేపినంత  పనైంది. ఇక అప్పటి నుంచి మేము పడ్డ కష్టాలు,బాధలు ఆ దేవుడుకే తెలుసు.నిజంగా  ఒంట్లో బాలేదు అన్నా కూడా పర్మిషన్ ఇచ్చే వాళ్ళు కాదు.కావాలి అని కోస్చేన్స్  అడిగే వాళ్ళు...అయినా మేమేమైనా  తక్కువ వాళ్ళమా ...మా పనులు మేం చేసేవాళ్ళం.మా అల్లరి తట్టుకో లేక కొన్నిసార్లు ఏడ్చే వాళ్ళు పాపం.ఇంత చేసిన మేము చదువు లో టాప్ త్రీలో ఉండే వాళ్ళం.ఇలా మమ్ముల్ని ..ఒకటి కాదు రెండు సంవత్శారాలు ఏడిపించారు. అతగారిల్లు కూడా ఇలాగే ఉంటది అని చూపించారు అనుకోండి. మేమేమిన తక్కు వ వాళ్ళమ???ఎంసెట్ ఎగ్జాం అయి పోయి హాస్టల్ ఖాళి చేసే రోజు మా వార్డెన్ మేడంస్ ని ట్రీట్ కి ఆహ్వానించాం. షార్ప్ టైం కి చక్కగా  రెడీ అయ్యి వచ్చారు.మేము పుఫ్ఫ్స్,కేక్స్ (అప్పట్లో మేము అవే ఇవ్వ గలిగే వాళ్ళం) అండ్ కూల్ డ్రింక్స్...(కూల్ డ్రింక్స్ బాగా గుర్తు పెట్టుకోండి సుమ!!!)...తరువాత మిమ్ముల్ని ఒక కోస్చేన్  అడుగుతాను మరి.మా బాచ్ అంత తెగ సంతోషంగా ఉన్నాం...హాస్టల్ లైఫ్ కి బాయ్ బాయ్ చెప్పటం,ఎంసెట్ బాగా రాసేసాం,ఇంకో 5  నెలలు  వరకు చదువు అనే వాళ్ళు ఉండరు,అన్నిటి కంటే ముంది ఈ వార్దేన్స్ గొంతు పొద్దున్నే వినే పనుండదు...ఇలా మా సంతోషాల లిస్టు ,ఇండియన్ ఫ్లాగ్ లాగా రెప రెప లాడుతూ ఉంది.మా ఫ్లాగ్ హోస్టింగ్ కి వార్డెన్స్ ని కూడా పిలవటం తో కాంపస్ అంతా ఒకటే సంతోషం.మా వార్డెన్స్ కూడా..."మీరు చాల మంచి వాళ్ళు...కొంచం అల్లరి ఎక్కువనే కానీ...బాగా చదువుతారు అని మా తల్లిదండ్రులతో ఎక్కడ లేని ప్రేమ వోలకబోస్తున్నారు(మరి పార్టీ ఇస్తే ఆమాత్రం చెప్పరా ఏంటి???)".ఇలా అన్ని రకాలుగా  కష్టపడి..హాస్టల్ నుంచి బయటపడ్డాం అన్న మాట.
           అవును మీకు ఎవ్వరికి అనుమానం రాలేదా మా మీద??? ఇంతలా కష్టపెట్టినా కూడా వాళ్ళకి ట్రీట్ ఇవ్వడం ఏంటి అని???ఇంత మంచి వాళ్ళో అనుకున్నారా???
          ఇలా అడిగాకా అయినా డౌట్ వచ్చిందా??
          వచ్చే ఉంటది(వచ్చేలా  చేశాను కదా!!!!)......
          మీ అనుమానం నిజమే సుమండీ....

పద్మ:    ఎంతగా ఏడిపించారు.... వాళ్ళ కి మనం గుర్తుండాలి కదా...
హారిక:   ఎన్ని సార్లు నన్ను హెడ్ వార్డెన్ కి బుక్ చేసారో తెలుసా??
నేను:   ఒకసారి మా నాన్న  ఫోన్ చేస్తే నాకు చెప్పను కూడా చెప్పలేదు ....
     ఇలా అందరం వాళ్ళవాళ్ళ బాధలు అన్ని చెప్పుకొని ,రేపు ఎంసెట్ ఎగ్జాం అనేది కూడా పక్కన పెట్టి (ఎంసెట్ అంటే సంవత్సరాని ఒకసారి వస్తది ,కానీ ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే మల్లి మేడంస్  దొరకరు కదా!!!).....


ఒక మాస్టర్ ప్లాన్ వేసాం....      
  
ఇప్పుడు మీ ప్రశ్న??
ఇంతకు మేము ఇచ్చే  వార్డెన్స్ ట్రీట్ లిస్టు లో ఒక ఐటెం అండర్ లైన్  చేయమన్నాను...ఏంటి అది???మరీ టీవీ అంకర్ లా కాకున్నా....ఏదో అలా ట్రైనర్ గా వర్క్ చేసిన అనుభవంతో అక్కడక్కడ ఇలా ప్రశ్నలు అడుగుతున్నాను...తిట్టుకోకండే  ...
 గుర్తోచిందా??? ఫాస్ట్ గా పైకి వెళ్లి చెక్ చేసుకోండి ...
కనిపెట్టేసారా??
ఎస్...కూల్ డ్రింక్.
మీరు భలే  షార్ప్ సుమండీ....
హ్మం....ఎం చేసాము అంటే...ఆ కూల్డ్రింక్ లో మోషన్  టాబ్లెట్స్ (2 -3 కలిపాం)........వాళ్ళవాళ్ళ పాపాల లిస్టు ని పట్టి టాబ్లెట్స్ నెంబర్ డిసైడ్ చేసాం...మాగ్జిమం మూడే లెండి. పాపం అనిపించినా ఆ టైంలో అలా కసి తీర్చుకోవాలి అనిపించింది. మీరే చెప్పండి ...అమ్మ,నాన్న లని వదిలి హాస్టల్స్ కి వచ్చే పిల్లలని అమ్మ(కనీసం అక్క లాగా)లా  చూడాల్సిన వాళ్ళు...నరకం చూపిస్తే ఇలానే ఉంటది మరి....మేము అయినా మంచి పిల్లలం(కదా !!!!) కాబట్టి టాబ్లెట్స్ తో సరి పెట్టం..అదే ఈ జనరేషన్  పిల్లలు ఐతే ఇంకా ఎంచేసే వారో?
      వార్డెన్ మేడంస్(చెడ్డ వాళ్ళ కు మాత్రమే)...తస్మాత్ జాగ్రత్త...
  

9 comments:

  1. baga edipinchara anna(unna) mata...memu kuda inter hostel lo unnappati sangathulu gurthu vachhayi.. mng 4am night 11pm daka okate chaduvu chaduvu ani anta untaru....they r most painful days in my life.

    ReplyDelete
  2. మొత్తానికి ఇంటర్ లో బాగా అల్లరి చేసారన్నమాట....మీ వార్డెన్ లు రాక్షసులయితే, మా వార్డెన్ లు పాపం మంచోళ్ళు...ఓ సరి మేము సినిమాకి చెప్పకుండా వెళ్లివచ్చినా పాపం ఆ విషయం డైరెక్టర్ కి తెలియకుండా దాచి మమ్మల్ని రక్షించారు...సో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేది వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది..అంతేనా??

    ReplyDelete
  3. @శివ గారు ,మా వాళ్ళ కుదిరినంత వరకు కృషి చేసాం ఏడిపించడానికి ...నా పోస్ట్ వల్ల మీ కాలేజి లైఫ్ గుర్తురావటం నాకు సంతోషం గ ఉంది అండి.నిజం గ హాస్టల్ లైఫ్ చాల కష్టం అనుకోండి.కానీ మేము వాటిని కూడా బాగా ఎంజాయ్ చేసాం అనుకోండి.

    @కిషన్ గారు,మీ వార్దేన్స్ కి ఎన్ని లంచాలు ఇచ్హారో మరి ,అందుకే మిమ్ముల్ని అలా కాపాడారు..మాకు ఇలాంటి చిట్కాలు తెలిసి ఉంటె అన్ని కష్టాలు పడి ఉండే వాళ్ళం కాదు.

    ReplyDelete
  4. హన్నా..మీరు అల్లరి అమ్మాయేనండోయ్ :-)....ఏమోనండీ ఈ వార్డెన్ల గురించి ఫ్రెండ్స్ చెబితే వినటమే గానీ సొంత అనుభవం నాకు లేదు...బావున్నాయి మీ కాలేజీ కబుర్లు...

    ReplyDelete
  5. కవిత అక్క గారికి ధన్యవాధములు నేను రాసిన దుబాయ్ లో కవితకి మీరు కామెంట్ ఇచ్చారు నేను ఎన్నో కామెంట్ వస్తాయి అనుకున్న ఈ కవితకి కాని ఎవరు కామెంట్ ఇవ్వలేదు చాల భాదపడ్డాను కాని మీరు కామెంట్ ఇచ్చి నా కవితకి నిండు సంతోషన్ని ఇచ్చారు..

    కవిత అక్కకి మరోసారి చేప్పాలెనన్ని ధన్యవాధములు.....

    ReplyDelete
  6. thanq for ur wishes.don't worry meeru ekkada unte akkada party chesukondi. bill kuda meeru pay cheyandi. next time mi bday ki nenu ilane bill pay chesthanu..

    ReplyDelete
  7. @శేకర్ జీ,కరెక్ట్ గ కనిపెట్టేసరే నా గురించి.మీరు అదృష్టవంతులు అండి బాబు,ఆ వార్దేన్స్ తో బాధలు పడనందుకు.ఐన లేడీస్ హాస్టల్ వార్దేన్స్ కొంచం రాక్షసులుగా నే ఉంటారు అండి..ఇంకా చాల ఉన్నాయి కాలేజి కబుర్లు .....కొన్ని కొన్ని గ చెపుతా లెండి...

    మీ ఏటి-గట్టు చాల బాగుంది...మాకు చెన్నై లో ఏటి-గట్టు లేదు కానీ...సముద్రతీరం ఉంది లెండి...సరదాగా కబుర్లు చెప్పుకోవడాని కి ....

    @అశోక్ గారు, నిజం గా ఆ పోస్ట్ చాల బాగుంది అండి...చూడగానే కామెంట్ ఇవ్వాలని పించింది....మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి...దూరపు కొండలు నునుపు అంటారు ....దగ్గరికి వెళ్తే కానీ వాటి నిజ రూపం తెలిదు మరి...
    మొత్తానికి అక్క ని చేసారు...థాంక్స్ అండి తమ్ముడు గారు.....

    @శివ ,మీరు భలే తెలివనవాళ్లు సుమండీ....కానివ్వండి కానివ్వండి....మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ....మీ కలలన్ని నిజం కావాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  8. once again thanq for ur wishes.. chinnappati nundi anthe andi. chinnappudu naku evaru ayina greeting card ishte nenu vallaki isthanu lekapothe ichhevadini kada. appuduappudu nuv naku isthe nenu isthanu lekapothe anivadini.appatlo asthi hakku(money sampadincha lemu kada andukani)..kalalu ani oka dani taravatha okati finish chesthunnanu.last year bday ki bike ledu ippudu undi (parents and naa salary sowjanyam tho konnanu)...

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete