Friday, May 21, 2010

ఇది ప్రేమా?? ఆకర్షణా??




మొన్న ఈ మధ్య పేపర్లో చుసిన ఒక కధనం నన్ను కలిచి వేసింది...అది మీతో పంచుకుందాం అని ఇలా మొదలు పెట్టాను ...

http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram4

పాపం ఆ అబ్బాయి పరిస్థితికి కారణం ఎవరు?? ఆ అమ్మాయేనా??? టెక్నాలజీ మనకు మంచి చేస్తుందా?? కీడు చేస్తుందా??తను పోగొట్టుకున్న కాలం,ధనము తిరిగి తెచ్చుకోగాలడా ??

   అబ్బాయిలైనా ,అమ్మాయిలైనా ప్రేమించే ముందు ఆలోచించరా??? "లవ్ అట్ ఫస్ట్ సైట్" అని మాత్రం చెప్పకండి ప్లీజ్ తట్టుకోలేను...సరే అలాగే కానిద్దాం ..మొదటి చూపులోనే ప్రేమ పుట్టినట్లు .ఆలోచన కూడా పుట్టాలి కదా...అలా పుట్టలేదు అంటే అది ప్రేమనో ,కేవలం ఆకర్షణనో ఆలోచించుకోండి ఒకసారి...

 ఒక అబ్బాయిని అమ్మాయో ,ఒక అమ్మాయిని అబ్బాయో చూడగానే ...ప్రేమ అని చెప్పే ముందు ...నిజంగా మనకు తగిన వాళ్ళేనా?? అమ్మ,నాన్న లకు నచ్చుతారా? ఒప్పించాగలమా?? ఇలాంటివి అన్ని ఎందుకు ఆలోచించ కూడదు???
  గుడ్డిగా ప్రేమించేయడం..పెళ్లి దగ్గర కి వచ్చేటప్పటికి అందరికి కష్టాలే...పాపం అమ్మ,నాన్న మన పెళ్లి మీద ఎన్ని అశలు పెట్టుకున్నారో...ఎన్ని కలలు కన్నారో...మీరు చెప్పే ప్రేమ అనే ఒక్క మాట వాళ్ళ కలలని నిలువునా కాల్చేస్తుందేమో ఒకసారి ఆలోచించండి ....

  ఏంటి ఇంత ఘాటుగా రాస్తుంది అనుకుంటున్నారా??? ఏమోనండి ఇలా ప్రేమ పేరుతో జీవితాన్ని ,అందమైన భావిష్యతుని పాడుచేసుకునే వాళ్ళని చూస్తే నాలో దాగి ఉన్న "విజయశాంతి" బయటకు వచ్చేస్తుంది  ...నాకు పేపర్ లో కానీ,టీవీ లో కానీ చూస్తే నే బాధ అనిపిస్తుంది ....అలాంటిది మా కుటుంబం లో జరిగితే తట్టుకోలేక...మీతో ఇలా గోడు వెల్లబోసుకుంటున్న ...


ఒక రోజు పోదున్నే ఆఫీసు కి వచ్చి సిస్టం ఆన్ చేశా....ఫోన్ మోగింది...అబ్బ పోదున్నే మొదలయిందా ...ఈ క్లైంట్ గాడో..ఎన్ని బుగ్స్ లిస్టు ఇస్తాడో ...దేవుడా దేవుడా అని మొక్కుకుంటూ ఫోన్ చూసా....
చిన్ని కాలింగ్ ......అమ్మయ్య అని ఉపిరి పీల్చుకున్న
చిన్ని:కవిత నీకో  గుడ్ న్యూస్..
నేను:అవునా???ఏంటి నీ పెళ్లి కుదిరిందా??
చిన్ని:కాదు
నేను:మరి??
చిన్ని:మీ(నొక్కి చెపుతూ "మీ" అన్నాడు) అనిత కి పెళ్లి కుదిరింది అంట...
నేను:మా అనితకా???
చిన్ని:ఇప్పుడే అంటీ(అంటే మా అమ్మ)కి ఫోన్ చేస్తే చెప్పారు.
                  .....కట్నం,కానుకలు...వగయిరా చెప్పాడు.
 వినగానే తట్టుకోలే క పడి,పడి ఏడ్చేసా  ....
పెళ్లి అనగానే ఎవరయినా సంతోష పడతారు,లేదా మన్మధుడు సినిమా లో లా "ఎందుకు" అని అడగుతారు..ఎందుకు ఏడుస్తున్న అనుకుంటున్నారా???
ఇక్కడ మీకో ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి అండి...తను మీ అనిత అని ఎందుకు అన్నాడు అంటే...

అనిత మా మేనమామ కూతురు ..పుట్టగానే మా తమ్ముడికి అని పేరు పెట్టేసారు...అందరికి తెలిసిన విషయమే...మా నాన్న చివరి కోరిక కూడా అదే అండి...మామకి ఒక్కగానొక్క కూతురు...బాగా గారాలపట్టి..మా మామ వాళ్ళ ఇంట్లో కంటే మా ఇంట్లో నే ఎక్కువ పెరిగింది అనుకుంట...అంత ఇష్టం అమ్మ అంటే...కనీసం రబ్బెర్ బ్యాండ్ కొనాలి అన్న ..కవితక్క(వదిన అనే అలవాటు లేదు లెండి) ఏ కలర్ కొనను అని ...ఫోన్ చేసేది...తీర జీవితం విషయం లో మా ఇష్టాలతో పని లేకుండా ...నిర్ణయం తిసేసుకుంది.
ఏంటి విషయం అని ఆరాతిస్తే...

ఎవరో కాలేజి లో సీనియర్ అంట..డిగ్రీ పూర్తి చేసి జాబు వెతుకుతున్నాడు  అంట..తండ్రి చిన్నప్పుడే చనిపోతే ...వేరే ఒకరు తండ్రి స్థానం లో ఉన్నారు అంట...వాళ్ళ అమ్మ ఒక లేడీస్ ఎంపోరియం పెట్టుకొని గడుపుతున్నారు అంట...
 మరి వెనక,ముందు ఏమయినా ఉన్నాయా??అని అడిగా ఆత్రుతగా....
 కేవలం ఆ ఎంపోరియం తప్పించి వేరే ఆధారం కూడా లేదు...తండ్రి కానీ తండ్రి కొంచం సపోర్ట్ ఇస్తాడు అంట...


మా తమ్ముడిని చేసుకోలేదు అని కాదు నా బాధ....అ అబ్బాయి ఏం పెట్టి పోషిస్తాడు ???ఇంకా ఎన్ని రోజులకు జాబు వస్తుంది?? అలాంటి కుటంబం లోకి మన పిల్లని పంపిస్తే మన  పిల్లకి ఎమైన గౌరవం ఉంటదా??

మా మామ వద్దు అని బుజ్జగించి,కొట్టి,తిట్టినా ప్రయోజనం లేక....బలవంతంగా ఒప్పుకున్నారు(ఒప్పించింది...పెళ్లి చేస్తారా...లేదా అని ఏదో అఘాయిత్యం కూడా చేసుకుంది అంట.) మాకు తెలిస్తే ఎక్కడ మాట పోతుందో అని ఇవేమీ మాకు చెప్పలేదు మా మామ.కనీసం నాకు చెపితే అయినా కొంచం క్లాసు పీకి బుద్ది చెప్పేదాన్నేమో(ట్రైనర్గా పని చేసిన అనుభవంతో )...ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోయింది. ఈ నెల 30  కి తన పెళ్లి.పాపం మా మామ అటు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని...ఎంత క్రుంగిపోతున్నారో అర్థం చేసుకోగలం....ఒక్కసారి ఆలోచించు కొని ఉంటె, తన జీవితం వేరే మలుపుతిరిగేదేమో...తమ్ముడు ఇప్పుడు సింగపూర్ లో ఉన్నాడు...మంచి పోసిషన్,శాలరీ ....ఇలా అన్ని వదిలేసుకొని అక్కడికి వెళ్లి ఎన్ని కష్టాలుపడుబోతుందో ..అని బాధ...

 తన ఒక్క లవ్ వల్ల...అటు తన తల్లిదండ్రులు,ఇటు మా కుటుంబం(మా అమ్మ ఐతే ఇంకా ఏడుస్తనే ఉంది)...ఎంత కుమిలి పోతున్నామో....


అమ్మాయిలు,అబ్బాయిలు ...ప్రేమించండి...కానీ పెళ్లి మాత్రం అందరికి ఇష్టం అయ్యేలాగా బాగా స్థిరపడి ...అందరిని ఒప్పించి చేసుకోండి...తల్లిదండ్రుల సంతోషం కంటే ...ఎక్కువ ఏం ఉండదు జీవితం లో....వాళ్ళ విలువ(నాన్న ని మిస్ అవుతున్న నాకు తెలుసు...వాళ్ళ ఎంత ముక్యమో ...) తెలుసుకొని ముందడుగు వేయండి ..


Anyhow ....I wish you a Happy married life Anitha.....

ఈ మధ్య వచ్చిన "కొత్త బంగారు లోకం " సినిమా లో ఇదే మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ ...ప్రేమించే ముందు..అది ప్రేమ?? ఆకర్షణ అని ...ఒకటి కి 100 సార్లు అలోచించి అడిగేయండి అని చక్క గ చెప్పారు...మూవీ చూడని వాళ్ళు ఉంటె...ఒక లుక్ వేయండి సుమా....

19 comments:

  1. I can understand your feelings regarding love and your the relationship with her.
    But menarikam chesukokapovadame manchidani naa abhipraayam. Naa varaku 3 chedu anubhavaalu chusanu maa family lo. So I strictly oppose them.

    -- Badri.

    ReplyDelete
  2. @badri Garu...Adhi correct ee lendi...antha mana manchi ke jarigindemo....

    ReplyDelete
  3. ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు.ప్రస్తుతం ప్రేమ అనే రెండు అక్షరాలు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి చోట ప్రేమికుల జంట కనపడుతుంటుంది. పార్క్ బీచ్‌లవద్దనైతే మరీనూ వీరిలో ఎంతమంది తమ ప్రేమను సార్థకం చేసుకుంటారో తెలీదు.అంటే ప్రేమించేవారు పెళ్ళి చేసుకోవాలనుకుంటుంటారు.కాని పరిస్థితుల ప్రభావంతో విడిపోయిన జంటలు చాలానే తారసపడుతుంటాయి.

    ప్రేమ చరిత్రపై దృష్టి సారిస్తే లైలా-మజ్నూ,సలీమ్-అనార్కలిలాంటి వారు చాలామంది తమ ప్రేమకు ఉదాహరణగా నిలిచారు.కాని ప్రేమకు సరియైన పరిభాష ఎవ్వరుకూడా చెప్పలేకపోయారు.వీరంతా ప్రేమలో తన్మయులైనవారే. కాబట్టి వీరిని కేవలం ప్రేమ అనే రెండక్షరాలతో ముడివేయలేం. వీరిది అమర ప్రేమ వీరి ప్రేమ అనంతమైనది అనిర్వచనీయమైనది...వలచినవాడికోసం అయినవారినందరినీ కాదనుకున్నా తనది చాల తప్పే కవిత గారు ఇంక కన్నావారిని అందరిని కదనుకుంది.తను జీవితంలో సుఖంగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు ఎమి చేయలేము.

    ReplyDelete
  4. meeru cheppina last line simply super ga undi .. anduke aa cinemani 100 times chusanu . endukante aa film vachhina kotthalo maa room lo unna 4 computers lo daily edo oka system lo play chesevaru apptlo.. e post chusthe oka dialogue gurthu vasthundi santhosham film lo nagarjuna sriya tho ila antadu preminchadaniki iddari manasulu chalu kani pelli chesujovidiniki two familys kavali... teja(film director)films valla mari 10th lo ne love start chestunnaru.

    ReplyDelete
  5. కవిత గారు, ఈ మధ్య అమ్మాయిలూ అబ్బాయిలు ఇలా ప్రేమ దోమా అని తిరగడం...తర్వాతా లైటో..ఫానో తీసుకోడం మామూలే..మీ అనితా తన మిస్టేక్ తర్వాతా తెల్సుకుంటుంది తప్పకుండా...బాగా రసారు..అన్నట్లు మేనరికాలు సరైనవి కాదు.

    ReplyDelete
  6. Kavitha garu, Chala baga rasaru andi. Meeru jeevithanni konchem baga chadivaru kabatti baga rasaru. kani oka chinna prasna?

    Prema ki nirvachanam cheppagalara ??????? Premichetappudu meeru edutivaaru nijamga manaki taginavaara astipastulu entha vunnayi ani choodamani annaru? Nijamga ala cheste ade premani mee nammakama? Appudu nijamga vaallu happy ga vuntarani mee nammakama?

    Mee Anitha ki entha nammakam lekapothe athanini chesukuntundi? Naaku telisi tanu chala happy ga vuntundi.

    - Oka Shreyobhilashi

    ReplyDelete
  7. @అశోక్ గారు,మీ మాటలలో నిజం లేక పోలేదు...స్వచ్చమయిన ప్రేమ అనేది కరువు అయి పోయింది అనే చెప్పాలి ..

    @శివప్రసాద్ గారు,ధన్యవాదాలు అండి.సంతోషం సినిమా డైలాగు అక్షరాల నిజం అండి.

    @కిషన్ గారు,నిజమే అండి ..ఈ మేనరికాలు మంచివి కావు అని చాల మంది అంటున్నారు...కానీ మనసులో ఎందుకో తెలియని బాధ...

    @శ్రేయోభిలాషి గారు,నీను జీవితాన్ని చదివాను అని అన్నారు...మరి అంత లేదండి నాకు...ఇప్పుడిప్పుడే చూస్తున్న జీవితం అంటే ఏంటి అనేది..
    ఇక ప్రేమ గురించి మీ ప్రశ్నలకు సమాధానాలు...."ప్రేమ అనేది అనిర్వచనీయం "...స్వచ్చమయిన ప్రేమని ఎవ్వరం వేల కట్టలేము...మీరన్నట్లుగానే ఆస్థి పస్తులు చూస్తే ప్రేమ అవుతుందని కాదు...అక్కడ తల్లిదండ్రులు ఎం ఎదురు చూస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా...తనకు అతని మీద నమ్మకం ఉండవచ్చు...ఉంది కాబట్టే...తన ప్రేమనే నెగ్గింది చివరి కి..
    ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి...ఒకటి 22yrs తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ...రెండో డి అదే 22yrs బావ మీద ఉన్న ఇష్టం....ఒక్క 10 నెలల ప్రేమముంది నెగ్గలేక పోయాయి...
    ఇంకో విషయం అండి ....నేను ప్రేమ కి విరోధిని కానీ...కానీ తల్లిదండ్రుల ఆలోచనలకూ ,ఆశలకు ముందు విలువ ఇవ్వమని చెపుతున్న.మా మామ పడే బాధ కళ్ళతో చూసి తట్టుకోలేక ఇలా చెపుతున్న.

    మా అనిత అతనితో సంతోషం గా ఉంటది అని చెప్పినందు కు నాకు చాల ధైర్యం గా,సంతోషం గా ఉంది ...మేము కోరుకునేది అదే కదా....

    ReplyDelete
  8. Nijamga Prema anedi vela kattalenidi.
    22 Samvatsarala prema oka 10 nelala premani neggalekapoyindi ante premakunna sakthi amoghamane cheppali.

    Oka chinna udaharana. 10 samvatsaralu kalisi vunna bartha kante, 10 nelalu mosi kanna biddane talli ekkuva premistundi. Ade premakunna sakthi. Ala ani nenu annitini compare chestunnanani anukokandi Kavitha garu.

    - Oka Shreyobhilashi

    ReplyDelete
  9. @శ్రేయోభిలాషి గారు,నా టపా చదివి మీ అముల్యమయిన కామెంట్స్ ఇస్తున్నదుకు మీకు ముందుగ ధన్యవాదాలు.....మీరన్నట్లు ,ప్రేమ చాల శక్తి వంతమయినది. ....మరి అలా అన్నప్పుడు అమ్మ,నాన్న ల మీద ఉన్న ప్రేమ కూడా అంతే శక్తివంతం గ ఉండాలి కదా...మరి ఎందుకు ఇలా teenage ప్రేమ ముందు వాళ్ళ ప్రేమ ఓడిపోతుంది అనేదే అంతు చిక్కని ప్రశ్న గ మిగిలి పోయింది .ఈ ప్రేమ పేరు చెప్పి ఎన్ని ఘోరాలు,మోసాలు,అఘాయిత్యాలు ......ఎటు దారితీస్తుందో ఈ పరిణామాలు??
    మీరు చెప్పిన ఉదాహరణ నుంచే మీకు సమాధానం(నేను ఎం చెప్పదలచుకున్నానో ) దొరుకుతుంది...భర్త మీద కంటే కూడా...పిల్లల మీద పిచ్చి ప్రేమని పెంచుకునే అమ్మ ని ఇలా ఇష్టం లేని పనులు చేసి నొప్పించటం ఎంత వరకు సమంజసం చెప్పండి???
    "ఒక శ్రేయోభిలాషి గారు",మిమ్మల్ని విమర్శించటం నా ఉదేశ్యం కాదు అండి .....ఇవి నా అభిప్రాయాలు మాత్రమే...మీరు ఎన్నయినా చెప్పండి నా వోటు మాత్రం అమ్మ,నాన్న ల ప్రేమ కే....

    Once again,Thanks for your Valuable Comments....

    ReplyDelete
  10. Shiva .....2 votes enti???okaru oka vote ee veyali...

    ReplyDelete
  11. naku 2 votes unnayi anduke 2 votes vesthanu. okati hyd lo undi ,inkoti maa vuri lo kuda undi andukani

    ReplyDelete
  12. ayina parents ki enni votes ayina veyivachhu ,inka cheppali ante rigging kuda undadu

    ReplyDelete
  13. Ikkada vimarsalaku tavu ledu lendi!!!!. Sivaprasad garu naaku kooda rendu votlu vunnayilendi. Hahhahahahahah:-)

    Kavitha garu, meeru cheppalanukundi naaku mee tapa chadivina ventane ardham ayindi andi. Nenu cheppalanukundiemiti ante, "Love ... It grows inside you but you don't know that". There is no limit for love. probably if some one is leaving the other for something else that doesn't mean that he loves the later one more.

    Baboy,శ్రేయోభిలాషి konchem emotional ayipotunatlunnadu... :-)

    friends I am not trying to hurt any ones feelings here. Its just feelings from heart :-)

    .@శ్రేయోభిలాషి

    ReplyDelete
  14. @శ్రేయోభిలాషి గారు,మీరు ఎమోషనల్ అవ్వడం లో తప్పేమీ లేదు లెండి...అక్కడ టాపిక్ అలాంటిది మరి....నీను అలా ఫీల్ అయ్యే టపా రాసాను....

    Thanks again for your comments....

    ReplyDelete
  15. @శివ ...రాస్తాను,రాస్తాను ...కొంచం ఆఫీసు లో వర్క్ ఎక్కువయింది...అందుకే గ్యాప్ వచ్చింది..

    ReplyDelete