Tuesday, May 18, 2010

ఐ లవ్ యు నాన్నా.....

మాములుగా ఆడపిల్లలకి నాన్నమీద ఎక్కువ ప్రేమ ఉంటుంది,అమ్మతో ఎంత చనువు ఉన్న నాన్న మీద అభిమానం,గౌరవం,ప్రేమ అన్ని ఎక్కువే ఉంటాయి.నేను కూడా ఆ కోవకు చెందిన దాన్నే...

మా ఇంట్లో ఒక్కతే ఆడపిల్లని కావటం వల్ల నేను అందరికి గారాలపట్టిని.నాన్నవాళ్ళ వంశంలో పుట్టిన ఒక్కగానొక్క అమ్మాయిని కావటం,నేను చేసుకున్న మొదటి అదృష్టం.దానికి తోడు నేను పుట్టాక బాగా కలిసి వచ్చింది అంట(ఇంకా నయం నాకు అదృష్టలక్ష్మి అనో లేక మహాలక్ష్మి అనో పేరు పెట్ట లేదు).అసలు ఎంత అంటే..నేను పుట్టగానే మా అమ్మ గారికి పాలు పడలేదు అంట...అలాంటి situations లో అందరు ఏం చేస్తారు???పాలు కొని పడతారు కదా..కానీ మా నాన్నమ్మ ఏకంగా గేదనే కొనేసింది అంట...ఇప్పటి కి గుర్తు చేస్తూ ఉంటుంది.

ఇక మాతాత గారి గురించి చెప్పక్కర్లేదు....బుజ్జమ్మ ,బుజ్జమ్మ అని కలవరించే వారు.స్కూల్ కి వెళ్ళే అప్పుడు,రాగానే కనపడకుండా పోతే అంతే,ఎడ్చేసే వారు. మా నాన్న ఏది తెచ్చిన నాకు ఫస్ట్ ఇచ్చాకే మా తమ్ముళ్ళకి ఇచ్చేవారు .అమ్మ ఎప్పుడయినా పొరపాటున పని చెప్పారు అంటే అంతే,చివాట్లు పడేవి నాన్నతో..."తను చదువుకుంటుంటే ఎందుకల డిస్టర్బ్ చేస్తావ్ అని.." విసుక్కునే వారు(పాపం అమ్మ...)..అప్పట్లో మనం కొంచం బాగానే చదివే వాళ్ళం లెండి.స్టేట్ ర్యాంక్ కోసం ట్రై చేశాను అనుకోండి.మా టెన్త్ ఎగ్జామ్స్ టైంలో ఎవరో బెండకాయ తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అని చెప్పారు అంట నాన్న కి ఇంకా అంతే ...రెండు నెలలు (అంటే ప్రేఫినల్స్ నుండి మెయిన్ ఎగ్జామ్స్ వరకు అన్న మాట) మా ఇంట్లో బెండకాయ కూరే ...మా తమ్ముల్లేమో నన్ను తిట్టు కునే వాళ్ళు..నిన్ను ఎవరు స్టేట్ ర్యాంక్ ట్రై చేయ మన్నారు అని..ఎలాగో అల టెన్త్ ముగించా...ఇంటర్ రెసిడెన్షియల్ లో జాయిన్ అవుతా అంటే..మా నాన్న ససేమిరా అన్నారు...ఎలాగోలా ఏడ్చి గుంటూరు లో జాయిన్ అయ్యాను.జాయిన్ అయ్యాక కానీ తెలిసింది, నాన్న ఎందుకు వద్దు అన్నారో అని...డైలీ ఫోన్ చేసి ఏడ్చే దాన్ని ...అది చూసి నాన్న ప్రతి వీకెండ్(మాకు వీకెండ్ అంటే ఫ్రైడే లెండి) ..ఆఫీసు లో లీవ్ పెట్టుకొని వచ్చేసేవారు.నా ఇంటర్ పూర్తి అయ్యే వరకు మా నాన్న 2yrs లీవ్స్ అడ్వాన్సు తిస్కోవాల్సి వచ్చింది.కష్టపడి(నేను+నాన్న) ఎలాగో అల ఇంటర్ మంచి స్కోరు తో పాస్ అయ్యాను.ఎంసెట్ లో ర్యాంక్ రావడం,ఇంజనీరింగ్ సీట్ రావడం అన్ని జరిగి పోయాయి.

5 సంవత్సరాల తరువాత .....
పెళ్లి అప్పుడు కూడా మా నాన్నని కంప్రోమైస్ చేయాల్సి వచ్చింది..అబ్బాయి బాగున్నారు అంటారు కానీ,చెన్నై లో జాబ్ అంట.అంత దూరం,వేరే రాష్ట్రం అస్సలు పంపను,పెళ్లి కాన్సిల్ అన్నారు.ఎలాగో అలా ఒప్పించాను నేనే...అప్పగింతలు అప్పుడు అమ్మ కంటే కూడా,నాన్న నే ఎక్కువ ఏడ్చారు...చెప్పాలంటే నాకు మా అమ్మ మీద కన్నా నాన్న మీద ఎక్కువ ప్రేమ. ఇప్పటి కి గుర్తొస్తే నాకు తెలియకుండ నేనే ఏడ్చేస్తాను ....

ఇలా చెప్పుకుంట పోతే మా ఇద్దరి అనుబంధం "ఆకాశమంత " మూవీ లో ప్రకాష్ రాజ్ అండ్ త్రిష కంటే ఎక్కువే ఉంటది...

మా అనుబంధం చూసి దేవుడు కి కన్ను కుట్టింది అనుకుంటా ,అనుకోకుండా సంవత్సరం క్రితం లివర్ ప్రాబ్లం తో నాన్న చనిపోయారు(కేవలం యాభై సంవత్సరాలకే.. )..డాడీ ఐ లవ్ యు అండ్ ఐ మిస్ యు సో ముచ్.నా మొదటి పోస్ట్ మీకే అంకితం చేస్తున్నాను నాన్న....మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉంటాయి అనుకోండి ......

7 comments:

  1. చాలా బాగా రాసావు కవితా, సాధారణంగా అమ్మాయిలకు నాన్న మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది, అలాగే నాన్నలకు కూడా కూతుళ్ళ మీదే ఎక్కువ ప్రేమ. ఎక్కడున్నా మీ నాన్న నిన్ను చల్లగా చూస్తుంటాడు.

    ReplyDelete
  2. hmm...some facts are hard to digest..but have to accept kadaa.Mee naannagaaru mimmalni sadaa aaseervadistoone untaaru.
    Take care.kalla vembadi neellu teppinchaaru mee tapaa tho,nijam gaa..

    ReplyDelete
  3. entha sada seedaga chepparu vishayalu anni ...i hats off to u.....mee modati taapathone anddarini akattukunnaru....u r great

    ReplyDelete
  4. chaala baaga rasalu..i felt it what u felt at that time..keep writing more..

    ReplyDelete
  5. @మానస గారు ,నిజమే అండి...కొన్ని చేదు నిజాలు నమ్మక తప్పదు.నా ఫీలింగ్స్ ని చక్కగ అర్థం చేసుకున్నారు అనుకుంట,అందుకే అలా కళ్ళ నుండి నీళ్ళు వచేసాయి...మీకో విషయం చెప్పాన???నేను టపా రాసేంత సీపు...నా కళ్ళ లో నీళ్ళు దోర్లుతనే ఉన్నాయి...అంతల ఫీల్ అయ్యి రాసాను ....

    @అశోక్ గారు ధన్యవాదాలు అండి...అంత మా నాన్న ఆశిర్వాద బలం అండి...ఆయనకు నా మీది ఉన్న ప్రేమ అలాంటిది మరి ....

    @శ్రిషిత గారు ధన్యవాదాలు అండి..ఒక అమ్మాయి మనసు ఇంకో అమ్మాయి కే అర్థం అవుతుంది అని ఊరికే అన్నారా పెద్దలు...

    @శివ ప్రసాద్ గారు ...థాంక్స్ అండి...

    ReplyDelete