Monday, September 6, 2010

NIIT తో నా అనుబంధం ...1

గురు పూజోత్సవ శుభాకాంక్షలతో ...టీచర్స్ డే అనగానే చిన్నప్పుడు బాగా సంతోషం గా ఉండేది...ముందు రోజునుండే పూలు కొని పెట్టడమో,లేక తెలిసిన వాళ్ళ ఇంట్లో కోసుకురావడమో చేసే వాళ్ళం.. ఎక్కువ గా ఎన్ని పులమాలలు వస్తాయో ,ఆ మాస్టారే గొప్ప అని చాలా చాలా గొప్పలు చెప్పేవాళ్ళం.నాకు చాలా ఇష్టమయిన పండగలలో ఇది కూడా ఒకటి,,,ఎందుకంటే ..ఆ రోజు హాఫ్-డే స్కూల్ ఉండదు కాబట్టి.


ఇలా చెప్పుకుంట పోతుంటే, నాకు నేను NIIT లో faculty గా చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి..అందరూ ఇంజనీరింగ్ పిల్లలే వచ్చే వాళ్ళు.నాకు ,వాళ్ళకు పెద్దగా వయస్సులో తేడా లేక పోవడంవళ్ళ ,బాగా చనువు గా ఉండే వాళ్ళు.మాకు క్లాసు నాలుగు గంటలు ఉంటది..కాని పిల్లలు అస్సలు చెప్పనిచ్చే వాళ్ళు కాదు . కాని చెప్పిన కొంచం సేపు అయిన స్ట్రిక్ట్ గా ,అర్థం అయ్యేలా చెప్పేదాన్ని అనుకోండి...అందుకే నేను చాల తరగతులకు ఇష్టమయిన పంతులమ్మని ... తెలుసా ???ఎందుకంటే ..ఎగ్జామ్స్ టైం లో బాగా హెల్ప్ చేసేదాన్ని కూడా!!!నాకు ఇంకా బాగా గుర్తుంది ...ఒకసారి నా పుట్టిన రోజు పండగ ...అన్ని తరగతుల వాళ్ళు కలిసి చాల వయిభవంగా నిర్వహించారు...ఒక చీరని కూడా బహుకరించారు.కానీ నాకు కట్టుకోవడం రాదు అని చెప్పలేక పోయాను ...ఏదో వాళ్ల అభిమానం అనుకున్న..తరువాత తెలిసింది ఆ రోజు జరగవలిసిన అన్ని తరగతులు పోస్ట్పోన్ చేయాలి అని.ఎం చేస్తాం వాళ్ల సంతోషమే నా సంతోషం కదా,పోనిలే అని వదిలేసా.కాని ఆ అభిమానం హద్దులు దాటింది అండి..
ఒక రోజు పొద్దు పొద్దున్నే (8 am )ఒక స్టూడెంట్ కాల్ చేసాడు..నేను నిద్రలో నే ఉండి ఫోన్ లో ....

నేను:"హలో "
స్టూడెంట్: "మేడం ,నేను X (పేరు గుర్తుకు లేదు లెండి) "
సరే నేను ఆఫీసు కి వచ్చి మాట్లాడతా ...అని కట్ చేశాను ..మళ్ళి ఫోన్ రింగ్ అయింది ..
నేను:"హలో "
స్టూడెంట్: "మేడం ,నేను X ని "
నేను:"ఆఫీసు లో మాట్లాడతాను అని చెప్పా కదా !!"
స్టూడెంట్: "మేడం,ఒక్కసారి నేను చెప్పేది వినండి ,ఆఫీసు లో అంటే కష్టం"
నేను:" హ్మ్మం ....చెప్పు బాబు "

స్టూడెంట్:"మాకు రేపు పరీక్షా "

నేను:"అవును "

స్టూడెంట్:"అదే మీకు ఒకసారి గుర్తు చేద్దాం అని"

నేను:"ఏంటి ఎగసెకలా?"(బ్రహ్మానందం డయిలాగు)

స్టూడెంట్:"అల అని కాదు ,నేను ఖచితంగా పాస్ కావాలి మేడం"

నేను:"చదువు మరి,ఏమయినా అర్థం కాకుంటే నేను చేపుతలే ఇవాళ "

స్టూడెంట్:"అదంతా కుదరని పని "

నేను:"అంటే"

స్టూడెంట్:"మీకు ఏం కావలి అంటే ,అది ఇస్తా నాకు పరీక్షలో సహాయం చేయాలి,నేను ఇంత వరకు పుస్తకం కూడా తీయలేదు .ప్లీజ్ మేడం "






నాకు సుక్కలు ,ఆకాశం అన్ని కనపడ్డాయి.


ఏందీ,నాకు ఏం కావలి అంటే అది ఇస్తాడు అంట...నిద్ర మత్తు మొత్తం పోయింది అనుకోండి.


మళ్ళి ఫోన్ లో


నేను:"సరే ఇవాళ నా ఆఫీసు రూం లో కలుద్దాం "

స్టూడెంట్:"థాంక్స్ మేడం ,ఇంకా నిద్ర లేవ లేదు అనుకుంట ..మీరు పడుకోండి "


మా బాబే...ఎంత మంచి మనసో ,పిచ్చిసన్నాసి ....అని అనుకోని ,ఎదావిదిగా మళ్ళి నిద్ర పోయాను లెండి.


ఇంతకు నేను ఏం చేసి ఉంటానో guess చేయండి చూద్దాం!!!....హ్యాపీ డేస్ సినిమా లో శ్రేయ మేడం లా...రూం కి తీసుకెళ్ళి మందలించానో లేక వాళ్ల నాన్న ఆస్తి లో భాగం అడిగానో ???


మీకే వదిలేస్తున్న....నేను ఏం చేశాను అన్నది తరువాతి టపా లో ....

18 comments:

  1. ఇవేం ప్రశ్నలండి చిన్నప్పుడు మా మేస్టారు కూడా అడగలేదు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు.
    సర్లే పాపం అని ఆ అబ్బాయి ఎగ్జాం మీరు రాసేసారు కదా!!
    మీకు కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలు కొంచెం లేట్ గా....

    ReplyDelete
  2. మరొక పట్టుచీర కొనిపెట్టమని అడిగారా ?

    ReplyDelete
  3. ఒక పట్టు చీర తీసుకొని, ఆ పిల్లాడి కోసం సెపరేట్ ఎగ్జామ్ పెట్టారా? :-)))

    ReplyDelete
  4. @3g,ధన్యవాదాలు ...సర్లే పాపం అనుకోవాలా వాడు చేసిన పనికి???....హన్నా!!! ..అసలే మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ చేసాడు అనే కోపం లో ఉన్నాను...అందులో మళ్ళి ఇలాంటి ఆఫర్ ఇస్తే....చెప్తా చెప్తా...కొంచం వెయిట్ చేయండి.


    @హరే కృష్ణ ,అదేంటి అండి చీప్ గా పట్టు చీర మాత్రమే అడిగాను అనుకుంటున్నారు...నేను ఇంకా వాళ్ల ఆస్థి మొత్తం రాసి ఇవ్వమని అడుగుదాం అనుకుంటే...

    @నాగ ప్రసాద్ గారు,ఇచ్చిన ఒక చీరనే కట్టరాదు అని చెప్పి ఇంట్లో దాచాను ,మళ్ళి ఇంకోటి కావాలని అడుగుతాన చెప్పండి??మీకు కూడా హరే కృష్ణ గారికి ఇచ్చిన సమాధానమే ...

    ReplyDelete
  5. >>నేను ఇంకా వాళ్ల ఆస్థి మొత్తం రాసి ఇవ్వమని అడుగుదాం అనుకుంటే...

    సైలెంట్ ఐన తన బ్యాంక్ ఎకౌంటులో ఉన్న నూట యాభై అంటాడేమోనండి అతని ఆస్థి...డెబ్బై ఐదు కన్నా, పట్టు చీర బెటరెమో..

    ReplyDelete
  6. అతను అనాధ శరణాలయం లో ఉంటె మీకు బంపర్ ఆఫర్ తగిలేదేమో కదా! :)

    ReplyDelete
  7. సుట్ కేస్ నిండుగా డబ్బు పుచ్చుకొని పేపర్ లీక్ చేసారా ???

    ReplyDelete
  8. Happy Teacher Day

    ---http://mdkictschools.blogspot.com/

    ReplyDelete
  9. మీరు అతన్ని ఆఫీస్ రూం లోకి తీసుకువెళ్ళి...మందలించి...వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడి ఉంటారు..కానీ ఆ అబ్బాయి నాన్న కూడా 'మా అబ్బాయిని ఎలాగయినా గట్టేక్కించండి' అంటూ అడిగేసరికి మీరు ఖంగుతిని ఉంటారు...ఆ తర్వాతా ఓ పెద్ద లెక్చర్ ఇచ్చి ఉంటారు...ఇలా జరిగి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది..

    ReplyDelete
  10. @తార గారు,అంతే అంటారా???

    @హరే కృష్ణ ,తనకి మంచి బాక్గ్రౌండ్ ఉన్న విషయం నాకు బాగా తెలుసు కదా....హి హి హి.
    @శేషేంద్ర సాయి గారు,:) :) :)

    @అలీ గారు ,ధన్యవాదములు ...మీకు కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు ....

    @కిషన్ ,:) :)

    @శివ తమ్ముడు,ఎక్కడి కి పోయావు??అస్సలు సందడేలేదు??

    ReplyDelete
  11. chaala baaga chepparandi....

    ReplyDelete
  12. ఇంతకీ గట్టేక్కించారో, గంగలో కలిపారో చెప్పలేదు..

    ReplyDelete
  13. అయ్య బాబోయ్ ఏంటి ఆన్సర్స్ నెక్ష్ట్ టపా లోనా ? ...హేపీ డేస్ సినిమాలో శ్రేయ మేడం తనకొచ్చిన లవ్ లెటర్స్ అన్ని చూపిస్తుంది ...
    అలా మీరు కూడా నీకు లాంటి వాళ్ళు చాల మంది వున్నారు బాబు ఈ లిస్ట్ లో అని అలా హెల్ప్ చేయమన్న స్టుడెంట్స్ లిస్ట్ చూపించి ఉంటారు

    ReplyDelete
  14. టపానుండి...టపాదాకా సస్పెన్స్ పెడితే ఎలాగండీ. ఒకటి రెండు రోజుల్లో చెప్పెయ్యాలి కానీ! మేమొప్పుకోం.

    ఏముందీ పర్సులో వున్న డబ్బులన్నీ కక్కెయ్యమనుంటారు - అతను చిల్లర అంతా దులిపి వుంటాడు.

    ReplyDelete
  15. @నాగార్జున్,అదే చెప్పబోతున్న..
    @రంజని,మరీ ఇంత టాలెంట్ ఉండకుడదు అమ్మ....
    @శరత్ జి,వెయిట్ చేయించాలి అని కాదు...ఏదో అల అందరి బుర్రలకి పని పెడదాం అని...చిల్లరే ఇస్తాడు అని అంటారా??

    ReplyDelete
  16. ఇక నుండి మీరు రాయబోయే టపాలకి విధిగా ఒక వంద కామెంట్లు పెట్టాలని ఆర్డర్ వేశారా?

    ReplyDelete