Wednesday, September 22, 2010

అసలు ఆడవాళ్ళు బండి తోలగలరంటారా??-1

చెప్పాను కదా నా బండి బాధలు..నిహారిక,పద్మార్పిత,శివ ఇచ్చిన సలహాలు పాటిస్తూ కొంచం కొంచం నడప సాగాను.కానీ నా బండి మా ఇంట్లో వాళ్ళకు కూడా పనిష్మెంట్ లాగా మారింది.నాతో పాటు మావారు,మా అత్తయ్య కూడా రావాల్సిందే.కింద పడితే నన్ను,బండి ని లేపాలి కదా.సరే ఎలాగల ధైర్యం వచ్చింది కదాని ఒక్కదాన్నే బయలుదేరాను .బాగానే వెళ్ళాను ...వెళ్ళింది చాలు ఇంకా బండి మలుపుదాం అనుకోని ,ప్రయత్నించా...చేసిన తప్పెళ్ళ...రైజ్ లో పెట్టి మలిపాను..అంతే నా చేతిలోంచి బండి అలా ఒక పది అడుగులవరకు వెళ్లి ఒక గుంతలో పడిపోయింది .ఎంత ప్రత్నించిన కొంచం కుడా కదపలేక పోయానే!!!!...అప్పుడు మళ్ళి సెం డయిలాగు "ఇంత బరువుంది ఏందిరో "..ఎం చేస్తా ...దారిన పోయేవాల్లని కొంచం హెల్ప్ అడిగాల్సి వచ్చింది .


మళ్ళి బండి తీయాలి అంటేనే బయం వేస్తుంది...నాకు మొదట వచ్చిన డౌట్ ఈ మళ్ళి మళ్ళి వస్తుంది .."అసలు ఆడవాళ్ళు బండి నడపగలరు అంటారా ??"


నేనేమో ఇలా పిచ్చి అనుమానాలతో కాలం వెళ్లదీస్తున్నా ..మొన్న ఆఫీసు దగ్గర సిగ్నల్ లో ఒక పెద్దావిడ (నలభయి పయిమాటే) టయోట నడుపుతా వెళ్తున్నారు ...


నేనేమో కనీసం స్కూటీ కూడా కడపలేకున్నాను ..

అసలు ఏదయినా సులభ మార్గం ఉంటే చెప్పండి.."ఉంటే బండయిన ఉండాలి,లేకుంటే నేనయిన ఉండాలి "అని శబధం పూనాను.సలహాలు చెప్పిన వారికి బహుమతులు ఇవ్వబడును .....



27 comments:

  1. ఆడవాళ్ళు వంటలే కాదు, బండి కూడా బాగా నడపగలరు అని రుజువు చెయ్యండి....మీకో గొప్ప సలహా ఇవ్వాలి అనుకుంటున్నా కానీ "Free Offer...Offer good in U.S only" అని బొమ్మలో ఉండటం చూసి ఆగిపోయా...

    ReplyDelete
  2. పోని ఓ డయివర్ని పెట్టుకొనే ఇషయం ఆలోచించండి!!! మంచి అవుడియా కదా!!

    ReplyDelete
  3. @కిషన్: నిజమే భలే పాయింట్ పట్టారు. అయినా బహుమతులు వస్తే వాటితో పాటు US కి టికెట్టూ, వీసా కూడా ఇస్తారనుకుంట. అవునుకదా కవిత గారూ!!

    ReplyDelete
  4. "అసలు ఆడవాళ్ళు బండి నడపగలరు అంటారా" అని మీరు ఇన్ని సార్లు అంటున్నా స్త్రీ వాదులు , మహిళా సంఘాలు వచ్చి గోల లేదేంటబ్బా... బహుసా అన్నది కూడా ఆడవారే కాబట్టి వదిలేసి ఉంటారు. Just kidding.
    మీరు రాసిన దానిని బట్టి మీకు సైకిల్ తొక్కడం కూడా రాదనుకుంటా. ముందుగా మీరు బండి అంటే భయం తగ్గించుకోవాలి. అప్పుడే మీరు కంగారు పడిపోయి టర్నింగ్ లో రైజ్ చెయ్యడం లాంటివి చెయ్యకుండా బాగా నడపగలుగుతారు. నీహారిక గారన్నట్టు బ్రేక్ వెయ్యడం కొంచెం ప్రాక్టిస్ చెయ్యాలి. బయల్దేరడం, ముందుకి వెళ్ళడం ,మలుపు తిప్పడం మనం జాగ్రత్తగా బాగానే చేసేస్తాం కాని ఎవరైనా అడ్డు వస్తే అప్పటికప్పుడు బ్రేక్ వేసి ఆగడం మాత్రం కొంచెం ప్రాక్టిస్ చెయ్యాలి.
    ఇన్ని సలహాలు చెప్పినందుకు మీరు ఇచ్చే బహుమతి తీసుకోవాలంటే నేను అమెరికా వెళ్లి $150 ఖర్చు పెట్టక తప్పదంటారా? :P

    ReplyDelete
  5. miru twarlo bike ni baga nadipi prizes kuda tisukontaru future lo . ...turn ayitappudu brake ni us chesi speed taggisthe sari, bike mana control lo untundi .brake ni use cheyakapothe bike control lo manam untam just difference . anukunta. miru baga nadipi vachhe prizes anni naku ivvandi ..

    ReplyDelete
  6. 3g gaaru annattu ok driverni pettukondi nijamga..ite nenu meeku driverga unddana mari nelaki enni paisalu ettaru :-)

    ***

    ReplyDelete
  7. హ్మ్ కధ బాగున్నది తరువాత?

    ReplyDelete
  8. "ఉంటే బండయిన ఉండాలి,లేకుంటే నేనయిన ఉండాలి "

    _________________________________________________

    బండి అమ్మేయండి :))

    ReplyDelete
  9. నాకు టూ వీలర్ నడపడం అంటే చచ్చే చావుగా ఉంటుంది. కారు ఒకే!
    నాకసలు టూ వీలర్ కి లైసెన్స్ కుడా లేదనుకోండి. ఈ మధ్య ట్రాఫిక్ లో గంటల తరబడి కూచోడం భరించలేక సిటి బస్సెక్కి తిరిగేస్తున్నాను.అక్కడ నడిపేది మనం కాదు కదాని!

    పైగా టూ వీలర్ నడిపేటపుడు కార్ల వాళ్ళది తప్పుగా, కారు తోలేటపుడు టూ వీలర్ వాళ్ళది పక్కా నిర్లక్ష్యంగా కనపడుతోంది.:-))

    నా సలహా అదే! బండి కాదు కదా, ఏదైనా నడపగలం కాని, చాలా తలనొప్పి! పొరపాటున మనం పడ్డామంటే ఇల్లంతా కుదేలైపోతుంది. ఇది అన్నింటికంటే పెద్ద తలనొప్పి! అందువల్ల హాయిగా నా మాటవిని దాన్ని పక్కన పారేసి సిటి బస్సెక్కండి.

    ReplyDelete
  10. @కిషన్ అయిడియాచెప్పండి మొదటగా .ఆ ఇమేజ్ ఏదో గూగుల్ నుండి తీసింది బాబు.దాన్ని పట్టుకొని ఇలా అంటే నేనేం చేయాలి చెప్మా ???

    @3g,సూపర్ అయిడియా.మీకు గిఫ్ట్ గ్యారెంటీ .నిజంగా ఆలోచించాల్సిన విషయమే.
    గిఫ్ట్ తో పాటు వీసా,టికెట్ మాత్రమే కాదు ,నా బండి మీద స్వయంగా విమానాశ్రయం లో డ్రాపింగ్ కూడాను....అప్పుడు మేరె నిర్ణయించుకోండి...టికెట్ అమెరిక కా లేక ...............????ఇక మీ ఇష్టం బాస్.

    ReplyDelete
  11. >>ఈ మధ్య ట్రాఫిక్ లో గంటల తరబడి కూచోడం భరించలేక సిటి బస్సెక్కి తిరిగేస్తున్నాను.అక్కడ నడిపేది మనం కాదు కదాని!

    ఏంటి హైద్రాబాదులోనే? నేను ఐతే దాని బదులు నడిచివెళ్ళేవాడ్ని..
    మీరు హైదరాబాదు సిటీ బస్సులో వెళ్తున్నారు అంటే, ఇదెదో పెద్ద ఘనకార్యమే, మేమందరం మీ దగ్గిర నేర్చుకోవాలి.

    చెన్న టి.నగర్‌లో తిరగడం, హైదరాబాద్ సిటీ బస్సు ఎక్కడం, ఐదింటికి డిల్లీలో చాందినీ చౌక్‌లో బస్సు ఎక్కడం, ముంబాయి లోక రైళ్ళల్లో సాయంకాలం ప్రయాణం ఇవి అన్నీ చాలా గొప్పవి.

    ReplyDelete
  12. @సాయి ప్రవీణ్ గారు ,ఎవరు ఎందుకు గోల చెయ్యట్లేదు అంటే ...ఇక్కడ ఒక అమ్మాయి కష్టాలు పడుతూ,సహాయం కోరుతుంది కాబట్టి.అదే ఎవరయినా అబ్బాయి ఇలా అని ఉంటె ఇప్పటికల్ల ....నా బ్లాగ్ గొడవకి అడ్డగా మారి ఉండేది.నాకు సైకిల్ తొక్కడం బాగానే వచ్చండి.కన్ని దానికి ఈ క్లచ్చు,రేస్ ఉండవుకదా.నాకు బాలన్సింగ్ ఇబ్బంది అనిపిస్తుంది.మీరు చెప్పినవన్నీ నెమ్మది నెమ్మది గా ప్రయత్నించాలి.నేను డ్రైవ్ చేసేటప్పుడు బలం అంత హన్డ్లేస్ మీద(రైజ్ హేండిల్ మీద) పెడుతున్న...అదే ఇన్ని దెబ్బలకి కారణం కాబోలు.
    ఇక గిఫ్ట్ సంగతి ...మరీ అమెరికా వెళ్ళాల్సిన పనేం లేదులెండి.మీకు గిఫ్ట్ గ్యారెంటీ...ఇవలలో రేపో మీ ఇంతకి వచేస్తున్దిలెండి.

    ReplyDelete
  13. "ఉంటే బండయిన ఉండాలి,లేకుంటే నేనయిన ఉండాలి " ------------------------------------------------కవిత నువ్వు ఉండాలి...... బాగుండాలి కూడా......
    కాబట్టి నువ్వు ఏమి అనుకోకపోతే ఆ బండి నాకిచ్చేయి.....

    ఆడవాళ్ళు వంటలే కాదు, బండి కూడా బాగా నడపగలరు అని నేను రుజువు చేస్తాను... నీ కల నేను నెరవేరుస్తాను కవిత నేను నెరవేరుస్తాను

    ReplyDelete
  14. @శివ,నాకు బైక్ వస్తే చాలు,ఖచ్చితంగా నా ప్రైజులు అన్ని నీకే .బ్రేకు విషయం లో నువ్వు చెప్పినట్లోగానే కరెక్టుగా తప్పు చేసాను.

    @అనోన్ గారు,చూసారా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.!!!!!అయిడియాతో పాటు డ్రయివరు కూడా దొరికారు.మీ పేరు గట్రా ఇవ్వండి...ఆఫర్ లెటర్ పంపుతాను.ఏమంటారు??
    @ తార సర్ ,నాది కధ లాగ అనిపిస్తుందా??కావాలి అంటే మా హస్బెండ్ గారి నెంబర్ ఇస్తాను ...నిజమో , కాదో కొనుక్కున్డురు.

    @శ్రీనివాస్ గారు,ఎంత మాట...ఆ పని చేసానంటే జీవితాంతం నడకకే అంకితం అయిపోవాలి.అది వర్కౌట్ అవదు కాని ...ఇంకో కత్తి లాంటి అవిడియా ఏమయినా ఉంటె సెలవిద్దురు ....

    ReplyDelete
  15. @సుజాత గారు,చెన్నై లో మాకు ఈ సిటీ బస్సుల ఇబ్బంది అంతగా ఏమి ఉండదు లెండి...లోకల్ ట్రైన్స్ బాగా వసతిగా ఉంటాయి.ఇంకో విషయం...అబ్బాయిలు కుళ్ళు కొని ,ఏడిచే విషయం ...లేడీస్ స్పెషల్ ట్రైన్ కూడా ఉంది .నా బాధ అంత రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళడానికే...నాలులు కిలో మీటర్లు ఉంటది అనుకుంట .ఒక్కదాన్ని వెళ్ళడానికి కుదరట్లే,మా వారు తిట్టుకుంట డైలీ వచ్చి డ్రాప్ చేసి వెళ్తుంటే ఏడుపొస్తుంది .అందుకనే ఇలా బండి బాధలు పడుతున్నా.ఎన్ని కష్టాలయిన పది బండి నడిపి మన సత్తా చాటుతా అండి.

    @తార సారూ ,బలే చెప్పారండి.ముంబాయి గురించయితే తెలియదు కాని,చెన్నై టి .నగర్ లో తిరగడం మాత్రం చాల గొప్ప విద్యే .మన చేతులో ఉన్న డబ్బు వదిలించుకోవాలి అంటే మాత్రమే వెళ్ళాలి బాబు.అది ఇప్పుడు చూడాలి దసరా,దీపావళి ఆఫెర్స్ తో కిటకిటలాడుతా ఉంటది .

    ReplyDelete
  16. హాట్ వీల్స్ చూడండి :) tv9 లో యాడ్ చూడలేదా మీరు :) :)

    ReplyDelete
  17. మీరేమీ అనుకోనంటే మీ బ్లాగు లో కొన్ని పదాలు అసలు బాగాలేవు ఉదాహరణకి "వస్తది","అవుద్ది" "కుదర్తది". తెలుగు టైపింగ్ కి కొత్త కూడా కాదే మీరు? తెలుగు యాంకరమ్మల భాష లా ఉన్నాయి ఈ పదాలు. అవసరమా ఈ దిష్టి చుక్కలు ఇంత చక్కటి రాతలకి?

    ఇంతకముందు ఇలాంటి పదాలే ఒక బ్లాగులో చూసాను కానీ ఆవిడ గారు తెగ ఫీల్ అయిపోతూ రాస్తూ తన బ్లాగులో ఎవరినీ కామెంటనివ్వదు. పోనీ రాతలేమయినా ఇంట్రస్టింగా ఉంటాయా అంటే అదీ కాదు.

    మీ రాతలు బాగున్నాయి కానీ కొన్ని పదాలు మీ బ్లాగు అందం చెడగొడుతున్నాయని చెప్పాను. తప్పుగా అనుకోరు కదూ..

    ReplyDelete
  18. @పరిమళం గారు...ఒకటి ,రెండు సార్లు చూసాను కాని,అంతగా పరీక్షగా చూడలేదు .ఈ సారి తప్పకుంట చూస్తాను..

    @లాస్ట్ అజ్ఞాత గారు ,మీ సలహాకు మొదటగా ధన్యవాదాలు .ఇక భాష గురించి అంటారా ???నీను పుట్టి పెరిగినది తెలంగాణా నడిబొడ్డు (నల్గొండ).బహుసా అదే ముఖ్య కారణం అయి ఉండ వచ్చు .మేము మాములుగా వాడే భాషనే బ్లాగ్ లో ఉపయోగిస్తాను.అందుకని మీకు కొంచం నచ్చక పోవచ్చు .ఇబ్బంది గా ఉంది అని చెప్పారు కాబట్టి...మార్చుకోవడాని కి సమయం పట్టవచ్చు .కాని తప్పకుంట ట్రై చేస్తాను.

    ReplyDelete
  19. కవితా,కవితా నువ్వు బాగా నేర్చుకున్నాకా నాకు నేర్పవా ... సైకిల్ తొక్కాలని తెగ ఆశ నాకు ... దాని గురించిన పాట్లు ఒక పోస్ట్ అంత అవుతుందేమో... సైకిల్ వస్తే బండి నడపడం వీజి అంటగా అందుకే ముందు సైకిల్ ఎలా అయినా నేర్చుకోవాలి అని డిసైడ్ అయినా ..తప్పులు సరిచేసుకో గాని నీ భాష బాగుంది ..ఎంచక్కా నీ భాషలోనే రాయి. .

    ReplyDelete
  20. sittam yajamani gaaru...naa job evvalo repo annttu undi edi ayipogane memmaldni contact chestalendi..paisala esayam kooda sepite??

    ***

    ReplyDelete
  21. *ఇంత బరువుంది ఏందిరో*..*వస్తది*"అవుద్ది* *కుదర్తది*..ఈ బాస నాకు ఇట్టం అంత ఇంత కాదు సాన సాన ఇట్టం..ఎవరు ఎన్ని సెప్పిన ఈనక అలనే రాసేయండి.

    ***

    ReplyDelete
  22. నేస్తం జి,
    అయితే మీరు నా కోవకే వస్తారు అన్నమాట.తప్పకుంట నేను సైకిల్ నేర్పుతాను ..నాకు సైకిల్ తొక్కడం బాగానే వచ్చులెండి.అవును అందరు అలానే సైకిల్ వస్తే బండి ఈజీ అని.నాకేమో అల ఎం అనిపిస్తలేదు.అయిన మీ ఆశ ఎందుకు కాదనాలి.అలాగే నేర్పిస్తాను.అవునండి తప్పులు ఎం చేసిన అక్కడ అక్కడ మిగిలిపోతున్నాయి.కొంచం దృష్టి సారించాలి,భాష అంత తొందరగా మార్చుకోలేనులెండి...మీరు చెప్పారు కదా...ఇలాగె రాసేస్తాను.

    మీదటి అజ్ఞాత ,పయిసలదేముంది చెప్పుండ్రి ...

    రెండో అజ్ఞాత...తప్పకుంటా మీ మాటే వింటాను....

    ReplyDelete
  23. హ్హహ్హ..మీ టపా చదువుతుంటే నా కష్టాలు గుర్తొచ్చాయి http://vareesh.blogspot.com/2008/03/blog-post.html

    పడ్డారు కదా ఇక భయం లేదు బాగా నడిపేయగలరులేండి..భయపడకుండా మళ్ళీ బండి ఎక్కండి.

    ReplyDelete
  24. కవిత గారు, బండి నడపడం గురించి అయితే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ చాల
    సలహాలిచ్చారు గాని, కొంచెం బ్లాగ్ నడపడం మీద కూడా దృష్టి పెట్టండి నేస్తం.
    ఎందుకంటే చదువుతుంటే పంటికింద రాయిలా అక్షర దోషాలు, కొంచెం యాస,
    ఇలా రీడర్స్ ని ఇబ్బంది పెడతాయి. ఈ సలహా ఇచ్చానని ఏమీ అనుకోరు కదా?

    ReplyDelete
  25. అక్షరదోశాలు పక్కన పెడితే నాకైతే మీ యాస సాన సాన నచ్చింది..మీరు అలాగె రాస్తే చాల బాగుంటుంది.

    ReplyDelete
  26. kavitha గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    ReplyDelete