Tuesday, September 14, 2010

NIIT తో నా అనుబంధం ...2

హ్మ్..నేనేం చేశాను అనేదాని మీద అందరు తమ ,తమ అభిప్రాయాలు చెప్పారు కదా...ఇప్పుడు ఎవరు సరిగ్గా ఉహించారు అనేది చూద్దాం(క్లాసు లో మాస్టారు లెవెల్ లో పోసు కొడుతూ..!!!)...


నేనేం చేసానో చెప్పేముందు ..ఒకసారి ఆ స్టూడెంట్ గురించి ,తను చదివే కోర్సు గురించి చెపుతా(అబ్బే..వేరే ఎం లే ...కొంచం క్లారిటీ కోసం అని).తను ఇంజనీరింగ్ చేసే కాలేజి చాల ఫేమస్ మరియు ఖరిధయినది కూడా..అక్కడ చెప్పేది సాలదన్నట్లు ,అయ్యగారి కి ప్రైవేటు పెట్టించారు .మా NIIT లో తను చేరిన కోర్సు అక్షరాల "లక్షన్నర".అంత ఖర్చు పెట్టి ప్రైవేటుకు పంపుతే ,మన హీరో గారు..క్లాసు లో మేడం ని (అంటే నన్నే,నన్నే) కామెంట్ చేయడం,క్లాసు జరుగుతున్న సమయం లో కుక్క,బర్రె సౌండ్స్ వచ్చే రింగ్తోన్స్ మోగించడం,ఇష్టం వచ్చినట్లు ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం ,కబుర్లు -కాకర కాయలు చెప్పడం ..ఇలా ఒకటేమిటి అయ్యగారి పనులు కోకొల్లలు .ఒక సారి తన వెధవ పని వల్ల నేను క్లాసు నుండి బయో-కట్ కూడా చేయాల్సి వచ్చింది .వాడు ఒక రకమయిన సాడిస్ట్ అనుకుంట,ఎప్పుడు ఏదో ఒకటి అని..అమ్మాయిలని కూడా ఏడిపించే వాడు..వెధవ.అలాంటి వాడు నాకు "ఎం కావలి అంటే అది ఇప్పిస్తాను" అంటే ఎలా వదులుతా చెప్పండి??
రమ్మని చెప్పినట్లుగా ఆఫీసు కి వచ్చాడు ,ఒక్కడే కాదు ,వల్ల బాత్చు లో ఇంకా కొంత మంది వెధవలని కూడా తీసుకొచ్చాడు.వాళ్ళు కూడా "ఎం కావలి అంటే అది ఇస్తాం" అనడాని కి రెడీ గా ఉన్నారు అనుకుంట...వెళ్ళంగానే "గుడ్ ఈవెనింగ్ " అంట...అబ్బో..ఇదే ఫస్ట్ టైం అనుకుంట అంత వినయం గా చెప్పడం..ఒకడయితే ,వాడు లేచి మరీ కుర్చీ ఇస్తున్నాడు ....సరే అందరూ క్లాసు రూం నెంబర్ :2 లో కూర్చో మని చెప్పి ..నా పని లో నేను పడ్డాను.ఒక గంట ఆగి ఒకడు వచ్చి గుర్తు చేసాడు..మనోళ్ళు నేను వాళ్ళకు ఏదో గొప్ప హెల్ప్ చేయబోతున్నాను అని తెగ ఫీల్ అవుతున్నారు ...వెళ్లి అందరి కి ఒక సిస్టం ఇచ్చి ...ఎక్షమ్ షెడ్యులు చేసి...రాయమని చెప్పాను..అప్పుడు చూడాలి ఒకొక్కరి మొహాలు...ఏడుపొక్కటే తక్కువ..ఎన్ని సార్లు నన్ను ఈ విధం గా ఏడిపించారో వెధవలు...అని మనసులో తిట్టుకొని..."నా షిఫ్ట్ టైం అయిపోయింది ..నేను బయలు దేరుతున్న ...ఎక్షమ్ బాగా రాయండి ...అల్ ది బెస్ట్ " అని కూల్ గా చెప్పి బయటకు వచ్చేసాను .కుడితి లో పడ్డ ఎలుకల్లా ...గిల గిల కొట్టుకొని ..ఎక్షమ్ హాల్ లో నుండి బయటకి వచ్చి...రిజల్ట్స్ పేపర్ మీద సంతకం పెట్టారు అంట.అందరూ ఫెయిల్ అనుకోండి.
మిగతా స్టూడెంట్స్ కి మరుసటి రోజు ఎక్షమ్ జరిగింది..అంత పాస్..చూసారా??ఒక ఫోన్ కాల్ ఎంత పని చేసిందో...
ఆతరువాత మన హీరో తల్లిదండ్రులని ని తీసుకురావడం,బ్రతిమిలాడి సుప్ప్లి పెట్టించుకోవడం,అది కూడా నాతోనే రాపించటం అన్ని చక చక జరిగి పోయాయి అనుకోండి.ముందు తనని కాదు లెండి,వాణ్ని ప్రోత్సహించే తల్లిదండ్రులని అనాలి..ఇన్ని లక్షలు కట్టాం..ఆ మాత్రం హెల్ప్ చేయకుంటే ఎలా అని మాట్లాడారు వాళ్ళ తల్లిదండ్రులు.డైలీ గంటలు,గంటలు క్లాసు చెప్పి ,చివరికి వాళ్ళ పరీక్షలు కూడా మీమే రాయాలి అంట.ఇదెక్కడి న్యాయం చెప్పండి.ఇప్పటి విద్యావ్యవస్థ అలా మారి పోయింది మరి.ఆ మాత్రం దానికి మేము పాఠాలు చెప్పడం దేనికి ,డైరెక్ట్ గా పరిక్షలు రాసేస్తే సరిపోలే??

అదన్నమాట జరిగింది...దీని వల్ల తెలిసిన నీతి ఏంటి??మీకే వదిలేస్తున్న....

10 comments:

  1. >>అది కూడా నాతోనే రాపించటం అన్ని చక చక జరిగి పోయాయి

    హ్హ...హ్హా నేను చెప్పిందే జరిగిందోచ్.....

    ఇక నీతి ఏంటంటే ఇలాంటి చంటి పిల్లలు అడిగినవెంటనే టీచర్లే వాళ్ళ పరీక్షలు రాసెయ్యాలి, కాదని మారాం చేస్తే వాళ్ళ పేరెంట్స్ తో గొడవలైపోతాయ్.

    ReplyDelete
  2. మీరు చెప్పింది బాగు బాగు

    ReplyDelete
  3. నిజమే కదండీ. అంత ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు ఆ మాత్రం అడగడంలో తప్పు లేదు. నా ఓటు ఆ అబ్బాయి తల్లిదండ్రులకే. :))

    ReplyDelete
  4. హ...హ... హ... కవిత నాకు ఎంత నవ్వొచ్చిందో ...ఎందుకంటే పాపం ఎగ్జాం రాయక తప్పలేదు కదా నీకు .... నాకు బోలెడన్ని డౌట్స్
    1. ఆ స్టుడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి
    2.. ఇంతకీ టీచర్ గారికి ఏమి గిఫ్ట్ ఇచ్చాడు మీ స్టుడెంట్ ఎగ్జాం రాసిపెట్టినందుకు

    ReplyDelete
  5. హూం..వాళ్ళ అమ్మా నాన్నలని చదువుకుని వచ్చి ఎక్జాం రాసేయమనాల్సింది..ఏం పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా?

    ReplyDelete
  6. మీ లాంటి ఉపాధ్యాయునిలు ఉండబట్టే ఈ విద్యా వ్యవస్థ ఇలా దుర్భరంగా తయారయ్యింది
    బ్లాగుల్లో ఇలాంటి విషయాలు రాస్తున్నారా ఓలమ్మో

    ReplyDelete
  7. @3g బాగా చెప్పారు...అలాగే జరిగింది మరి.మా మానేజిమెంట్ కూడా వాళ్ళ కి సపోర్ట్ ఇవ్వడం వలల్నే ఇందంత జరిగింది.

    @శివ ,బ్లాగు బ్లాగు ...థాంక్స్.

    @నాగ ప్రసాద్ గారు,మా మానేజిమెంట్ కూడా మీలాగే వాళ్ళకే వోటు వేసారు...అందుకే వాడు గట్టేక్కడు..
    @రంజని..నాకు మాత్రం వాడికి ఎక్షమ్ రాసేంత సేపు(రాపించబడేంత సేపు) పాములు,జెర్రిలు పాకినట్లు అనిపించింది.నీకు నవ్వోచిండా??ఆయ్య్.వాడికి ఎనభయి చిల్లర వచ్చాయి మార్కులు.నా జీవితం లో ఒక స్టూడెంట్ పాస్ అయితే ఏడిచిన ఒకేఒక్క రోజు అది.ఇక గిఫ్ట్ సంగతి అంటావా?నేను మళ్ళి వాడి మొహం చూడలేదు.
    @నేస్తం గారు,బాగా అడిగారు అండి.అల అడిగేవాళ్ళు లేక...వాళ్ళ ఆటలు సాగుతున్నాయి.మావల్ల కి ఫీసులు వస్తే చాలు..చదివాడ ,లేదా అనేది అనవసరం .
    @బ్లాగు బాబ్జి ,నువ్వోపాలి అడవి వదిలి మనుషులలోకి రావే...అప్పుడు తెలుస్తది .

    ReplyDelete
  8. అది సంగతి భలే రాశరు పాపం మాకు ఒక టిచర్ వుండేదండి మేము అప్పుడు చదువుల్లో అంత అంత మాత్రమే అన్నమాట పాపం తానే ఎగ్జామ్స్ తీసుకునేది ఆ టిచరే అన్నిచెప్పేది మీ టాపా చదివితే మా టిచర్ గుర్తుకస్తూంది.....నాకైతే దీని వల్ల తెలిసిన నీతి ఏంటి అంటే..... టిచర్సు పిల్లలు చల్లనివారే కల్లకపటం ఏరుగని కరుణమయులే:-)

    ReplyDelete
  9. బ్లాగు బాబ్జి పేరుతో రాసింది అతను కాదేమో....బ్లాగర్ సింబల్ కనపడ్తలేదు పేరుపక్కన !!

    ReplyDelete
  10. లేదు లేదు బ్లాగు బాబ్జి తన బ్లాగ్ నుండే వ్రాశాడు..బహుశ ఆ సమయంలో బ్లాగు బాబ్జీ అకౌంట్ లోగిన్ కాలేకపోయడు AIM PROFILE నుండి రాయడం ద్వార తన లోగొ కనిపించడం లేదు అంతే..

    ReplyDelete