Saturday, September 18, 2010

అసలు ఆడవాళ్ళు బండి తోలగలరంటారా??

అమ్మో అసలు ఆడవాళ్ళు బండి తోలగలరంటావా??
ఇదేంది మరి ఇంత బరువు ఉంది ?
అసలు నావల్ల అవుద్ది అంటారా???
    నిన్న తోటరాముడు బ్లాగ్ లో ఒక్కరోజులో ఈత ఎలా నేర్చుకోవాలో చెప్పారు కదా!!!నాకు కూడా ఎవరయినా ఒక్క రోజులో బండి నేర్చుకునే ఉపాయం ఉంటె చెప్పరా??మరి ఎందుకంత తొందరా??ఏమిటా కధ అనుకుంటున్నారా??,వస్తున్నా ,వస్తున్నా... అక్కడికే వస్తున్నా.
             సొంత ఇల్లు కదా కొంచం ప్రశాంతమయిన వాతావరణం లో ఉంటె బాగుంటుంది అనే ఉద్దేశ్యం తో రైల్వే స్టేషన్ కి అయిదు కిలోమీటర్ల దూరం లో తీసుకున్నాం.కొనేటప్పుడు తెలియలే ఇలా డైలీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని.ఆఫీసు నుండి బయలుదేరేటప్పుడు మా ఆయనకు ఫోన్ చేస్తే ..ఇప్పుడే రావద్దు ,నా వర్క్ అవలేదు.ఒక గంట ఆగి బయలుదేరు అంటారు.అందరు వెళ్లిపోతుంటే నాకేమో ఏడుపువస్తుండేది . ఎలా ఎన్ని రోజులు ???లాభం లేదు ఏదోకటి చేయాలి అని..నేను ఒక్కదాన్నే వెళ్ళే ప్రయత్నం చేశాను.ఒకరోజు,దారిలో పోకిరి వెధవ ఒకడు టీజ్  చేసాడు .నాకు బయం,మా అయన మీద కోపం.మళ్లీ కధ మొదటికి వచ్చింది.నాకు ఎనిమిదిన్నరకే రావడానికి కుదుర్తది..అప్పటి వరకు నువ్వు ఎలాగోలా ఆఫీసులో టైం పాస్  చేయి అని ఖరాకండి గా చెప్పేశారు మా ఇంటాయన(బంగారు కొండ!!!???). ఆఫీసు లో ఏమో మా  మానేజర్ దొరికిందే అదునుగా ,అయన పని కూడా నాకే ఇచ్చేసి ,తను మాత్రం టింగురంగ అనుకుంట ఆరింటికే ఇంటికి వెళ్తున్నాడు.పాపం అమ్మాయి కష్టపడుతుంది ,ఒక క్యాబు పెట్టిస్త అనవచ్చు కదా !!!అబ్బే ,అంత మంచి మనసా??  ఇలా అయితే నా ఇమేజ్ డామేజీ అవుతది కదా..అని ఒక రోజంతా అలోచించి ...ఒక కత్తిలాంటి ప్లాన్ వేసా.ఎక్కడి స్విచ్ వేస్తే ,ఎక్కడ బుల్బ్ వేలుగుతుందో మనకు బాగా తెలుసు కదా.అదే అండి..మా అత్తగారి దగ్గరి వెళ్లి ,కొంచం ఏడిచినట్లు నటించా.పాపం మా అత్త గారు కరిగిపోయి ..వెంటనే ఆర్డర్ పాస్ చేసారు."వచ్చి అమ్మాయిని ఇంట్లో దింపి ,కావాలంటే మళ్ళి వెళ్లి నీ వర్క్ పూర్తి చేసుకో "..హే..జజ్జి నక ,జజ్జి నక...
  
    అయినా మన పిచ్చి కాని ,మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే..మగ మహానుభావులు వాల్లకేన్ని ఉండాలి చెప్పండి.ఒకానొక మంచి రోజు .."బుజ్జి అందరు చూడు ఎంత బాగా బండి నడుపుతున్నారో ..నాకు కూడా ,నువ్వు అలా,అలా జామ్ అని బండి మీద వెళ్తుంటే చూడాలి అని ఉంది రా " అన్నారు.అసలే మనది వెన్నలాంటి మనసు ...ఇలా స్టవ్ మీద పెట్టి కరగ పెడితే ఏమవును???నేను కూడా వెంటనే ఒక బలూన్లో హెల్మెట్ పెట్టుకొని ,బండి మీద వెళ్తున్న అమ్మాయిని తలుచుకున్న...ఒహ్హ సూపర్ .మరి బండి ఎలా అని అడిగా అమాయకంగా.నువ్వు తోలుతా(నన్ను వదులుతా!!!) అంటే అదెంత పని చిటికలో కొనిపెట్టను..అనేసారు.చెప్పినట్లు గా ఒకరోజు తిరిగే కల్లా బండి నా చేతుల్లో పెట్టారు... అందరు హాప్పీస్..ఆ టైం లో నేనుకూడా అనుకోండి!!!."ఇంఫ్రెంట్ దేర్ ఇస్ క్రోకడయిల్ ఫెస్టివల్ " అని తెలియదు కదా అప్పుడు.
      మరుసటి రోజు పొద్దున్నే సరే రా,నువ్వు ఇవాళ నీ బండి మీద పో..నేను నీ వెనకాల వస్తా ఉంటా అన్నారు..ఒకసారి చెన్నై రోడ్డులు అన్ని నా కల్లా ముందు గురుక్కున తిరిగాయి..అదేంటి?? నాకు బండి నడపటం రాదు కదా అని మెల్లగా చెప్పా.ఒక వారం రోజులు నేర్చుకొని,తరువాత తీసుకెళ్త, అని అమాయకంగా పేస్ పెట్టి అడిగా.ఆ సమయం లో నా పేస్ చూస్తే ఎలాంటి వారయినా జాలి పడాల్సిందే మరి!!!
సరే వారం అంటే వారం రోజుల టైం ఇస్తాను అన్నారు.సరే సరే అని గంగిరెద్దులా తల ఊపాను ..ఇప్పటికి బండి కొని రెండు నెలలు అయింది.ఒక్కటి రెండు సార్లు మాత్రం అసలు నడపగలమా అని బరువు మాత్రం చూసి అక్కడ పెట్టాను.ఇంతకు ముందే నయం,వచ్చి దింపి రావడం ఇబ్బంది అని విసుక్కునే వారు..ఇప్పుడు ఈ బండి పుణ్యమా అని...మూడింతలు తిట్ల లిస్టు పెరిగిపోయింది.ఎం చేస్తాం అంత నా కర్మ.ఇక ఆ తిట్లు పట్టలేక,నిన్న తీసాను బండి..ఎంత నెట్టినా, ఒక్క అడుగు కూడా ముందుకు పోదే??అదేదో క్లచ్చు అంట అది పట్టుకుంటే నే స్టార్ట్ అయితది అని ,స్టార్ట్ చేసి చూపించారు.ఎలాగో అలా మా అయన సహాయం తో స్టార్ట్ చేసాను..
   కుడి చేతిలో ఉన్న హన్డిలు ను రైజ్ చేయి అన్నారు..నేను నా బలమంతా ఉపయోగించి తిప్ప...
  "ధమాల్" -- బండి శబ్దం .
  "ఏమండి" --నేను
  "బుజ్జి" ...మా అయన .
అన్ని రకాల శబ్దాలు ఒకేసారి.
       అంతే మళ్ళి బండి జన్మలో ముట్టుకోకూడదు అనుకున్న.మా వారు ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే అన్ని సద్దుకుంటాయి లే ,"అయినా.. దెబ్బలు తగలకుంట బండి ఎలా వస్తది??ఇదంతా కామన్ "అని తేలిగ్గా చెప్పేశారు.'ఈ బండి నా సావుకొచ్చిందిరో నాయన 'అంటూ..మళ్ళి అరగంట తరువాత మెదలేట్టాం .పక్కనే ఉన్న గ్రౌండ్ స్పాట్ అయింది ఇప్పుడు.అక్కడ కొంత మంది తాతయ్యలు వాకింగ్ చేస్తున్నారు కాబోలు.వద్దండి వాళ్ళకు ఇబ్బంది అని చెప్పి తప్పించుకుందాం అనుకున్న...కాని నా పప్పులేం ఉడకనివ్వలేదు మా అయన... ఇవాళ ఈ స్పాట్ లో ఎవరికో ఒకరికి స్పాట్ ... అనుకోని మళ్ళి బండి పట్టుకున్న.ఒక వంద కేజీ ల బరువుంది అనుకుంట అది.


నడపాలి అంటే బయంవేసి ...ఏమండి కొంచం సేపు తోస్తే బాలేన్సింగ్ వస్తది ఏమో కదా అని అడిగా..(ఎలాగో అలా రాత్రి పది అవాలి కదా ..టైం పాస్ చేయాలి అనే ఉద్దేశ్యం తో)..ఎం కాదులే అలా తోస్తే బరువు మోయలేవు...చేతులు నొప్పి పెడతాయి అన్నారు.పాపం నా మీద ఎంత ప్రేమో మా ఆయనకి..సరే అని మళ్ళి నెమ్మది గా క్లచ్చు కొట్టి,మెల్లెగా రైజ్ చేసి...స్టార్ట్ చేశా.ఇప్పుడ నా టార్గెట్ అంత ఆ తాతయ్యలకి ఇబ్బంది కాకుంట నడపటమే.మెల్లి గా స్టార్ట్ చేసాక మా అయన బండి పట్టుకోకుంట వదిలేసారు..."అదేంటో నా మనసు ,ద్రుష్టి తాతల మీద ఉంది కదా...బండి నేరు గా వాళ్ళ వాయిపే పోయింది.."


"అమ్మో ,నా సత్తిటానే"--తాతయ్య(తమిళ్ తాతయ్య లెండి )..


"నా మీదనుండి బండి తీయండి ప్లీజ్ "--నేను


"నే చెపుతానే ఉన్న,హేండిల్ తిప్పు అని ..వింటావా??" --మా వారు.


ఇంకా నయం ఆ తాతగారు గట్టి వారు కాబట్టి చేతికి మాత్రం చిన్న గాయం .కాని నా పరిస్థితే..దెబ్బలు తగలకుంట బండి రాదేమో కాని...దెబ్బలు తగిలిన్చుకోవడానికే బండి కొనుక్కున్నాను అని చెప్పుకోవాల్సి వస్తుంది.సరే ఇవాలకి ఇది చాలు లే అని మా అయన అంటుంటే...ఇవాళ కి పడ్డది చాలులే!!! అన్నట్లు వినిపించింది నాకు..ఏంటో .
     మళ్ళి ఇవాళ నైట్ ప్రాక్టీసు ఉంది అంట...ఏమో మరి ఇంకా ఎన్ని సార్లు పడాలో,ఎందరికి స్పాట్ పెట్టాలో ..చూడాలి.


ఏమండోయ్ ,నా బండి బాధలు చూసారు కదా..కొంచం సులభ మార్గం లో బండి ఎలా నేర్చుకోవాలో సెలవిద్దురు..వచ్చే జన్మలో మీ బండినయి పుడతాను ..బాబ్బాబు మీకు పుణ్యం ఉంటది .






17 comments:

  1. నిజమే? ఉత్తినే రాశారా?

    ReplyDelete
  2. అదేంటండి అలా అనేసారు???నిజంగా అండి బాబు...నన్ను చూస్తే పాపం అనిపించట్లే ?

    ReplyDelete
  3. కవిత ప్చ్ ఆ బండి తో అన్ని కష్టాలేమి పడతావు కాని .... ఇటు ఇచ్చేయరాదు

    ReplyDelete
  4. hahahaha

    అమ్మో ,నా సత్తిటానే"--తాతయ్య(తమిళ్ తాతయ్య లెండి )..


    "నా మీదనుండి బండి తీయండి ప్లీజ్ "--నేను


    "నే చెపుతానే ఉన్న,హేండిల్ తిప్పు అని ..వింటావా??" --మా వారు.

    ReplyDelete
  5. enni kastalu miku..frist bike ni balance chesthe ade vasthundi.taravatha jam jam ga vellavachhu bike pi

    ReplyDelete
  6. నాకు సైకిల్ తొక్కడం కూడా రాదు. కానీ నేను ఒక్కరోజులో బండి నేర్చుకున్నాను. ఎలాగో చెప్పమంటారా! ఒకరోజు దాని పార్ట్స్ గురించి బాగా తెలుసుకోండి. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆపాలి నేర్చుకోండి ముందు.బ్రేక్ ఎపుడు ఎలా వేయాలి నేర్చుకోండి. ఎదురుగా ఎవరయినా వస్తే ఎలా ఆపాలి అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. స్కూటీ కాబట్టి ఒక కాలు క్రింద ఉంచి ఇంట్లోనే ప్రాక్టీస్ చేయండి. ఒకసారి స్టార్ట్ చేయడం బ్రేక్ వేయడం వచ్చిందంటే మీకు బండి నడపడం వచ్చినట్లే. అపుడు నెమ్మదిగా స్లోగా ఒక కాలుతో నడుపుకుంటూ ముందుకి వెళ్ళిపోవడమే. నాకు చిన్నప్పటి కోరిక మూడు సంవత్సరాల క్రితం తీర్చుకున్నాను. అబ్బ ఎంత సంతోషం వేసిందో!! విమానం నడిపినంత ఫీలయిపోతాను. ఇప్పటికీ వర్షం వచ్చిందంటే చాలు అలా చల్లగా బండి నడుపుకుంటూ వెళుతూ ఉంటే ఉంటుంది నా సామిరంగా.................చెప్పలేను ఆ అనుభూతి. ఇపుడు నా చూపు కారు మీద పడింది. కానీ నేనే సొంతం గా సంపాదించిన రోజునే కారు కొంటాను. కారు నడుపుతాను. అదీ మలక్ పేట్ లాంటి రద్దీ రోడ్లలో కారు నడపాలన్నది నా లక్ష్యాల్లో ఒకటి.
    ధైర్యే సాహసే కవితే అనుకుని నడిపేయండి.విజయోస్తు!!

    ReplyDelete
  7. అసలు మీరు నా మాట విని ఆ బండి తీసేసి కార్ కొనుక్కొని వాడండి , దానికి ఈ బాలన్సు వగైరా వగైరా చూసుకోనక్కరలేదు :)
    jokes apart మీరు ధైర్యం తెచ్చుకోండి నడపటం అదే వస్తుంది !

    ReplyDelete
  8. నీహరిక గారు చూస్తే నిజంగనే విమనం నడిపెట్టు వున్నారు.కొంచెం అలాగే చెప్పండి కవిత గారికి కూడ....కవిత గారు ఒక్కసారి బయటి దేశం వచ్చి చూడండి బయటి దేశంలో మన దేశం ఆడవాళ్లు పెద్ద పెద్ద కార్లు ఎలనడుపుతున్నారో..అంత ఎందుకు నేను లైసన్స్ తీసుకున్న కొన్ని రోజులకి రోడ్డుపైకి వచ్చ సడన్ గా రెడ్ సిగ్నల్ పడటంతో అంతే అగను మళ్లి వేనుక చూస్తే ఒక అమ్మయి అమ్మొ ఇంకేమైనవుంద బండి ఆగిపోతే అని అనుకున్న ఇంక అంతే గ్రీన్ సిగ్నల్ చటుక్కున వేలిగింది మరి నేను మాత్రం హఫ్ క్లచ్ తో కొంచెం రేసుతో వున్న ఇంక ముందుకు సాగేసరికి ఆఫ్ అయ్యింది ఏంటి నా బండి:-) ఆమ్మయి వేనుక నుండి పిపిప్పిప్పిపిపి అంటు హరన్ ఇస్తుంది. ఇంక ఏముంది సిగ్గుతో తల దించుకోని నాదారి నేను వెళ్లాను.అదిగో అల వుండాలి మీరు కూడ అల నడపలి ఆ స్కూటి సరే నా...ఇంకేం బాధపడక చాల చక్కగా నేర్చుకోని చెన్నై అంత చక్కర్లు కొట్టండి.దిగులుపడక కొంచెం నవ్వుదురు ప్లిజ్ ....

    ***

    ReplyDelete
  9. పోనీ ఒక పని చేస్తే....మీరు బండి పై కూర్చుని,దానికి తాడు కట్టి మీవారిని లాగమనండి:):)
    Just kidding...ధైర్యం చేయండి, తప్పకుండా ముందుకి దూసుకెళతారు.

    ReplyDelete
  10. "ధమాల్" -- బండి శబ్దం .
    "ఏమండి" --నేను
    "బుజ్జి" ...మా అయన .
    "అమ్మో ,నా సత్తిటానే"--తాతయ్య(తమిళ్ తాతయ్య లెండి )..

    Ha ha ha Su........per show.

    ReplyDelete
  11. @రంజని ,అంతే అంటావా?బాగా అలోచించి ఒక నిర్ణయాని కి వస్తనే..

    @మొదటి అనోన్, ధన్యవాదాలు.

    @శివ తమ్ముడు ,థాంక్ యు .నీ సలహా మైండ్ లో పెట్టుకుంట

    @నిహారిక,అమ్మో ,నిజంగానే ఒక్క రోజులో బండి నేర్చుకున్నారా??సూపర్.మీ అనుభవం తో కూడిన అమూల్య సలహాలకు ధన్యవాదాలు.తప్పకుండ మీ అందరి సలహాలు అమలు చేస్తా ....నాకు కూడా వర్షం లో తడుస్తూ తిరగాలంటే చాల,చాల ఇష్టం.,ఇప్పుడు కోతి కి కొబ్బరి చిప్ప దొరికినట్టు,నాకు బండి దొరికింది కదా ..నేను కూడా నీలాగే బండి మీద ఎంజాయ్ చేయాలి.మోతని కి బండి అయిపోయి,కార్ కి వచ్చారా ??చూసారా,చూసారా నేను ఎంత వెనకబడి ఉన్నానో.అయిన మన ఆడవాళ్ళూ అనుకుంటే సాధించాలెండి ఉండదు అనుకో.... Thanks again for your valuable suggestions.

    ReplyDelete
  12. @శ్రావ్య,ఇప్పుడు కార్ అడిగితే మావారు విడాకులు ఇస్తానంటారు...కొంచం నెమ్మదిగా అడుగుతానే...!!!:)
    Just joking. అయిన నావెనుక ఇంతమంది ఉన్నాక నేను అధైర్య పడనేల??

    @సెకండ్ అనోన్ ,నిహారిక ఇచ్చిన ధైర్యం తోనే ఇప్పుడిప్పుడే రోడ్ కి వెళ్లి ,నడపటం వచ్చింది. అవునండి ,ఆడవాళ్లు చాల రంగాలలో ముందున్నారు.అంతెండుకండి..మొన్న నేను ఆఫీసు నుండి వస్తుంటే ,ఒక పెద్దావిడ ,నలభయి దాటే ఉంటది వయసు...టోయోతో నడుపుతూ దుసుకెల్తుంది.మొత్తాని కి అమ్మయిదగ్గర ..సిగ్గుపడాల్సి వచ్చింది అంటారు...మరే పరవాలేదు లెండి...మనకు మంచి రోజులు వస్తాయి అని అద్జుస్త్ అవ్వాలి.తప్పకుండ ,ధైర్యంగా నేర్చుకొని ....మళ్లో టపా తో మీకు తెలియ చేస్తా,,,ఇప్పుడు కొంచం ధైర్యంతో ఉన్నకదా ,అందుకే అంతగా ఎదవట్లేడులెండి...థాంక్ యు.

    @పద్మార్పిత,ఈ అవిడియా కూడా బాగుందే.కాని సాయంత్రం మా వారు వచేవారు రోడ్డు మీద వెయిట్ చేయాలి కదా.అదే పెద్ద బాద.తప్పకుండ మీ అందరు ఇచ్చిన ధైర్యంతో తో అలా,అలా ముందుకు దుసుకెల్తాను .

    @3g,థాంక్ యు ..అయ్యానా నా కష్టాలు చూసి...షో అంటారా?ఆయ్!!!

    ReplyDelete
  13. kavitha garu miru bike naduputharu eppatikaina(dialogue from nuv naku nachhav film )

    ReplyDelete
  14. Shiva,Thank you soo much...malli ninna kuda kinda paddanu.inka asalu enni saarlu padithe vachiddo..ee edava bandi.

    ReplyDelete
  15. మీరేమీ అనుకోనంటే మీ బ్లాగు లో కొన్ని పదాలు అసలు బాగాలేవు ఉదాహరణకి "వస్తది","అవుద్ది" "కుదర్తది". తెలుగు టైపింగ్ కి కొత్త కూడా కాదే మీరు? తెలుగు యాంకరమ్మల భాష లా ఉన్నాయి ఈ పదాలు. అవసరమా ఈ దిష్టి చుక్కలు ఇంత చక్కటి రాతలకి?

    ఇంతకముందు ఇలాంటి పదాలే ఒక బ్లాగులో చూసాను కానీ ఆవిడ గారు తెగ ఫీల్ అయిపోతూ రాస్తూ తన బ్లాగులో ఎవరినీ కామెంటనివ్వదు. పోనీ రాతలేమయినా ఇంట్రస్టింగా ఉంటాయా అంటే అదీ కాదు.

    మీ రాతలు బాగున్నాయి కానీ కొన్ని పదాలు మీ బ్లాగు అందం చెడగొడుతున్నాయని చెప్పాను. తప్పుగా అనుకోరు కదూ..

    ReplyDelete
  16. Still ur trying to learn bike ayte chinna slaha(only for chennaites).....

    Sholilinganallur ICICI bank dagara lo oka bike driving school vundi u can try that one.....

    ReplyDelete
  17. @First Anon@...thappakunta try chestha..mee salaki chala thanks.

    @Second Ann@ -- nenu ippudu bike driving lo king ni ayipoyanu kada..office kuda bike(20km) lone vasthunna gaaaaa....Mee salaha ki chala thanks

    ReplyDelete