అందరు ప్రాజెక్ట్స్ కి టీం లు వెతుక్కుంటున్నారు ...కానీ మాకు ఆ బాధ లేదు ...మా బాత్చ్ కరెక్ట్ గా ఒక ప్రాజెక్ట్ కి సరిపడే ల ఉంది...ముచ్చటగా ముగ్గురం(నేను,పద్దు,హారిక).ఈలోపు హారిక, వాళ్ళ బాబాయి గారు "సెంట్రల్ యునివెర్సిటీ" లో ప్రోఫెసేర్ గా ఉన్నారు ...అక్కడ ప్రాజెక్ట్ ఇవ్వమని అడుగుదాం అనింది .అక్కడ ఐతే మనకు సహాయం చేయడాని బాబాయి ఉన్నారు ...ఈజీగా ప్రాజెక్ట్ చేసివేయ వచ్చు అని అందరం ఓకే చెప్పి....వెళ్లి వాళ్ళ బాబాయి గారిని కలిసాము .అయన కూడా సరే అనేసారు.కాలేజి లో రిపోర్ట్ చేసి "ప్రాజెక్ట్ రిపోర్ట్ " కోసం భాగ్యనగరం బయలుదేరాము.
అక్కడ తెలిసిన వాళ్ళ సహాయం తో ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకున్నాం.తీసుకున్నాక తెలిసింది అది ఒక 'పరమవీర చక్ర' గారి ఇల్లు అని.సామాను ఇంట్లో పెట్టక ముందే వొనర్ అంటీ వచ్చారు...ఇలా ఉండాలి ,అలా ఉండాలి ,ఇది ఇక్కడ పెట్టండి,అది అక్క పెట్టవద్దు ...ఇలా చెపుతానే ఉంది.లాస్ట్ లో ఆమె చెప్పిన ముఖ్య షరతు ...ఇంటికి ఎవ్వరు(అబ్బాయిలు అనే కదా అనుకుంటాం!!!) రావద్దు ,లాస్ట్ కి తల్లిదండ్రులు కూడా అంట.ఒక వేల వచ్చినా ఒకపూట మాత్రమే ఉండాలి.అసలే మాది కోతి మూక...కోతి మెడకు కళ్ళెం వేసిన అది చేసే కోతిశెకలు మానుతుందా చెప్పండి!!!! .....సరే ఆంటి అని బుద్దిగా చెప్పాము.ఇప్పడు మా ముందు రెండు టార్గెట్లు ఒకటి ప్రాజెక్ట్ ఐతే ,ఇంకోటి ఎలా ఇక్కడినుండి తప్పించుకోవటం ??వెంటనే హారిక ,ముందు మనం సెటిల్ ఐతే నే కదా ప్రాజెక్ట్ బుద్దిగా చేయగలం,మన తక్షణ కర్తవ్యం ఇల్లు మారటమే, అని చెప్పేసింది.ఎవ్వరం సమానులు సద్దుకోవద్దు ..వేరే ఇల్లు వెతికే ప్రయత్నం లో ఉండండి అని ఖచితం గా ,బల్ల గుద్ది మరి చెప్పేసింది.మాకు తోడు హారిక వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు.అంటీ చాలా మంచివాళ్ళు...చిన్న పిల్ల లా మాతోపాటే కలిసి పోయే వారు....మేము వేసే వెధవ,మంచి(అప్పుడప్పుడు) ప్లాన్స్ కి ఫుల్లు సపోర్ట్ ఇచ్చేవారు ....'సరే రా, మనం వేరే ఇల్లు వెతికి... తరువాత ఎలాగో అల యీ ఆంటీ ని నేను కంప్రోమిసే చేస్తలెండి 'అన్నారు....ఇంకేముంది ...అగ్నికి,ఆద్యం తోడయినట్లు ....వెంటనే వేరే ఇల్లు వెతికాం..ఈసారి కాప్షన్ మార్చేసాం ..."కొంచం ఖర్చు అయిన పరువలేదు కాని,వొనర్ లేని ఇల్లు చూడాలి "...అల అలా వెతికి లాస్ట్ కి ఒక మంచి అపార్ట్మెంట్ లో దిగేసాం ....
ఇక ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం .......వెళ్లి ప్రాజెక్ట్ జాయిన్ అయినట్లు రిపోర్ట్ చేదం అని బయలుదేరాం....ప్రోఫెసేర్ గారిని కలిసాక....ఎం ప్రాజెక్ట్ చేయాలి నిర్ణయించుకోండి అని ...ఏవో కొన్ని పేపర్లు ఇచ్చారు ...@౩%$#&* $%&(@#$$%^ .....ఏమయినా అర్థం అయిందా???మాకు కూడా ఆ పేపర్లు చూస్తే ఇలాగే అనిపించింది.ఇంతకు ఇవన్ని ఏంటి అండి?? అని అడిగితే ...ప్రాజెక్ట్ టైటిల్స్ అన్నారు ...ఇందులో ఏది చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి అని మళ్ళి అడిగారు....వెంటనే నాకొక ఆలోచన తట్టింది ....మూడు వేళ్ళలో ఏదో ఒక వేలు పట్టుకోవే అని అడిగా పద్దు ని .అది మొదటి వీలే పట్టుకుంది ...వెంటనే "వే విల్ గో విత్ ఫస్ట్ " అన్నాను.సరే ఐతే వెళ్లి చేయండి అని ఒక పెద్ద బుక్ ఇచ్చారు ... అప్పుడు నేను సునీల్ లాగా అమాయకంగా పేస్ పెట్టి...ఇదేంటి అండి అన్నాను....ఇది శాంపిల్ ప్రాజెక్ట్ బుక్....పోయినసారి ఒక అమ్మాయి చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్...మీరు కూడా ఇలాగే తాయారు చేసి కాలేజీ లో సబ్మిట్ చేయాలి అన్నారు.మాకు ఒకటే సంతోషం ...మన ప్రాజెక్ట్ ఇంత సులువు అవుతుంది అనుకోలేదు కదా అని.ఏదో ఘన కార్యం చేసిన గర్వం తో రూం కి వచ్చేసాం ...
తరువాత రోజు ప్రాజెక్ట్ వర్క్(ఏదో హోమేవోర్క్ లాగా) చేద్దాం అని కూర్చున్నాం అందరం ....సరే కవిత నువ్వు మొదలెట్టు అన్నది పద్దు....సరే ఐతే అన్నాను...అవును ఎం చేయాలి??అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి??? అన్నాను....వెంటనే హారిక ....టైటిల్ సెలెక్ట్ చేసావు కదనే.... అదే చేసి చూపించాలి ప్రాక్టికల్ గా ....అయ్యో అవునా.మేము పింకీ ,పొంకి చెప్పి ఒకటి సెలక్ట్ చేసాం అంతే ...కానీ మాకు ఏ పాపము తెలియదే అన్నాను.చచ్చాం కదే...నిజం గా నీకు తెలుసేమో అని నేను బాబాయి ఎమైన హెల్ప్ కావాలి అంటే చెప్పండి అన్నప్పుడు .... వద్దండి అని చెప్పా ...అంటూ ఉరిమి చూసింది ... సరే ఐతే ఇప్పుడు హెల్ప్ కావాలి అని అడగవే...కొంచం ప్రాజెక్ట్ చేసి పెట్టమని అడుగుదాం అన్నాను...సరే ఐతే....కానీ డైరెక్ట్ గా వెళ్లి అడుగుదాం అని చెప్పింది...సరే అని మళ్ళి బయలుదేరాం కాలేజి కి ...బాబాయి ని కలిసి...కొన్ని డౌట్స్ ఉన్నాయి అండి అన్నాం...అయన చెప్పండి అన్నారు..."సర్ యీ ప్రాజెక్ట్ ఎలా చేయాలో(అసలేం చేయాలో,ఎక్కడ మొదలు పెట్టాలో ??? ) అర్థం కావట్లేదు అండి అన్నాను.ఏ ప్లాట్ఫారం లో చేస్తున్నారు అని అడిగారు....అప్పుడు నా పేస్ చూడాలి....వంద మంది సునీల్లు కూడా సరిపోరు ...ప్లాట్ఫారం ఏంటి ??నిన్న ప్రాజెక్ట్ చేయమన్నారు(అదేదో పూర్తి చేసుకోచిన ఫీలింగ్ తో),ఇవాళ ప్లాట్ఫారం అంటున్నారు ...అని ఒకటే భయం,ఏడుపు.వెంటనే హారిక ని పక్కకి తిస్కేల్లి,,,,ఇదంతా కాదు కానీ...'చిన్న హెల్ప్ బాబాయ్ ...కొంచం యీ ప్రాజెక్ట్ మాత్రం చేసి పెట్టండి' అని అడిగేయవే...లేదంటే రోజుకో కొత్త పదం చెపుతున్నారు ...ఎందుకొచ్చిన రిస్క్ చెప్పు...అన్నాను.అది నీ మొహం అల అడిగితే నా పరువు పోతది..మా బాబాయి వెళ్లి మా డాడి తో చెప్పారు అంటే అంతే....అమ్మో నేను అడగను...డౌట్,డౌట్ అని చెప్పి ఒక్క ఒక్క స్టెప్ ఆయనతోనే చేపిద్దాం పద... అని చెప్పింది...నేను ఎం చేసేది లేక 'సరే' అన్నాను....మరి ఆ ప్లాట్ఫారం సంగతి ఏంటి???అని మళ్ళి అడిగా .....అది నేను కవర్ చేస్తా ఉండు ,,,,అని బాబాయి ఏ ప్లాట్ఫారం ఐతే బెటర్ అని అడిగింది...అయన వెంటనే...."జావా" ఐతే బాగుంటుంది అమ్మ...పయిగా "జావా చేస్తే జాబులు తొందరగా వస్తాయి " అన్నారు....వెంటనే హారిక సరే సరే...ఐతే మేము జావా లో నే చేస్తాం,అనేసింది తొందర పడి.మరి మీకు జావా ఎంత బాగా వచ్చు???కాలేజి లో చవిన జావా సరిపోదు..ఇంకా కొంచం డీప్ గా తెలియాలి అన్నారు.కాలేజి లో జావా చదివామ??ఎప్పుడే ???...అనేసింది పద్దు కంగారు పడుతూ ....వెంటనే హరిక ఎవరినయినా కనుక్కుందాం లేవే ....ఎందుకు కంగారు పడతావ్ అని సద్దిచెప్పింది...మరి ఎక్ష్త్ర జావా ఎక్కడ చదవాలి సర్ అని అడిగా(అసలు జావా కే దిక్కు లేదు,ఏక్ష్త్ర జావా గురించి దిగులు!!!!)..ఏదయినా మంచి ఇన్స్టిట్యూట్ చూసి జావా జాయిన్ అవ్వండి...ఆ నేర్చుకున్న దాని తో యీ ప్రాజెక్ట్ చేయండి అన్ని చెప్పి వెళ్లి పోయారు...వెళ్ళే ముందు....జగ్రత్హగా నేర్చుకోండి..అసలే నాకు జావా రాదు...టైం కి సబ్మిట్ చేయకపోతే కాలేజి లో మార్కులు రావు...మీ ఇష్టం .....అని నవ్వుతూ చెప్పి వెళ్లి పోయారు....అప్పుడు చూడాలి అందరి మైండ్స్ బ్లాక్డ్ ...ఏంటి మన గతి...ఈయన, నాకు జావా రాదు అంటాడు...అల ఐతే మన ప్రాజెక్ట్ ఎలా చేసి పెడతారు??ఇప్పుడు ఎం చేయాలి??వెంటనే పద్దు.....మనం ముగ్గురం జాయిన్ అవ్వడం కంటే మీ బాబాయి నే జావా జాయిన్ అవ్వమని చెపుదాం ...అని అవిడియా ఇచ్చింది...వెంటనే నేను అందుకొని...అసలు ఏది అయితే బెటర్ అని అడగకుంట...మీకు ఏది వచ్చు అండి అని అడిగితే బాగుండు...అని అరిచేస హరికని చూస్తూ....అదంతా ఎం కాదులే అయన మనం అల చెపితే బాగా చదువుతారు అనుకోనిఅలా చెప్పి ఉంటారు...లాస్ట్ మొమెంట్ లో హెల్ప్ చేస్తారు లెండి...వెళ్లి జావా జాయిన్ అవుదాం పదందే అని పురమాయించింది.
బాబాయి గారు చెప్పినట్లు జావా జాయిన్ అయ్యాము....అయన డైలీ క్లాసు అంటారు,object అంటారు కానీ....ఒక్క రోజుకూడా ప్రాజెక్ట్ అనరే అని కోపం వచ్చి ఒక రోజు అడిగేసా....అయన నాకు ప్రాజెక్ట్ చేసే తెలివే ఉంటె ....నేను ఇక్కడ ,ఇలా ఎందుకు పని చేస్తాను ???ఏదయినా మంచి MNC లో ఉద్యోగం చేస్తూ ఉండేవాన్ని అన్నారు....ఇంకేముంది ...చచ్చింది గొర్రె ....బాబాయి గారు జావా రాదు అంటారు,వీడు ప్రాజెక్ట్ చేయరాదు అంటారు,,,,ఇప్పుడు ఎం చేయాలి అని ఒకటే కంగారు.యీ లోపు కాలేజి లో మొదటి దఫా ప్రాజెక్ట్ సమర్పించాలి అంట,,,,మా చేతులో జావా క్లాసు,object అంటూ ఏవో రెండు,మూడు ప్రోగ్రాములు తప్ప వేరే ఎం లేదు.అప్పుడు తలుక్కున ఒక ఐడియా తట్టింది హారిక కి...మా బాబాయి అవసరమయి రెఫెర్ చేయమని ఒక పుస్తకం ఇచ్చారు చూడు అది కొంచం,కొంచం మర్చి,పేరు మర్చి...మన కాలేజి లో ఇచేసేద్దాం అని చెప్పింది.ఐడియా ఏదో బాగానే ఉంది...కానీ అది పుస్తక రూపం లో ఉంది....సిస్టం లో కి రావాలి అంటే ఎలా???ఏముంది...అందరం తలా కొన్ని(ఒక యబాయి నుండి నూరు మద్యలో ) పేజీలు టైపు చేయాలి ...అంతే ....సింపుల్ అని సింపుల్ గా చెప్పేసింది అది.చేసేదేముంది కానీయ్ ...అని మొదలు పెట్టాం.నేను ఒక ముప్పయి పయినే పేజిలి టైపు చేశా....ఇంకా చేస్తానే ఉన్న సడన్ గా కరెంటు పోయింది....ఏముంది....టైపు చేసినది మొత్తం పోయింది .....హి బాగావాన్...ఏమని చెప్పను నా బాధలు.?????ఇలా కింద,మీద పడి టైపు చేసిందే ఒకటికి పడి సార్లు చేసి...ఎలాగో అల చెప్పిన టైం కి కాలేజి లో ఇచ్చేసాం.అందరు సగం ,సగమే తెచ్చారు ...మేము మాత్రమే చేసినది,చేస్తున్నది,చేయ బోతున్నది మొత్తంసమర్పించాం ....ఎంత గొప్ప వాళ్ళమో కదండీ.....హి హి హి.పాపం మా కాలేజి లో ఎవ్వరు యీ (కాపీ కొట్టిన సంగతి ) విషయాన్నీ గమనించలేక పోయారు.ఎలాగో అలా బయటం పడ్డాం....

కొస మెరుపు:కానీ ఒక మాట అండి...బాబాయి గారు నిజమే చెప్పారు అండి....మేము అందరం ఇప్పుడు జావా లోనే ఉన్నాం......థాంక్స్ టు అశోక్ బాబాయి గారు....
chala bagundhi. Naku kuda maa college rojulu gurthuku vachai.. Annatlu nenu kuda Java lo project chesi andulone job chesthunnanu.....
ReplyDeleteబాగున్నాయి అండి మీ ప్రాజెక్ట్ కష్టాలు....కానీ మీరు బాబాయి దగ్గర ప్రదర్శించిన తెలివితేటలు ప్రాజెక్ట్ చేయడం లో ప్రదర్శించి ఉంటే ఖచితంగా ప్రాజెక్ట్ మీరే కంప్లేతే చేసేవాళ్ళు...
ReplyDeleteఎప్పుడు సినిమా కష్టాలు గురించి మాత్రమే వినేదాన్ని . ఈ మద్యన బ్లాగుల్లో జావా కష్టాలు ఎక్కువైపోయాయి ... మీది కోతి మూక అండీ ... అయితే మీకు నాన్న గారం ఎక్కువై ఉండి ఉండాలి నాలా
ReplyDelete@KP గారు,ధన్యవాదాలు..ఐతే మీరు ,మాకోవకు చెందినవారె....జావా నా మజాకా !!!!
ReplyDelete@అజ్ఞాతగారు ,ధన్యవాదాలు....నిజం చెప్పారండి....కాని అ టైం లో ఈ గండం గట్టెక్కితే చాలు అనే ఫీలింగ్ ఈ ఉండేది కానీ,నేర్చుకోవాలి అని తెలియలేదు...మల్లి ఇంటర్వ్యూ టైం లో ఇంకోసారి జావా నేర్చుకోవాల్సి వచ్చింది .......
@శివ రంజని గారు ,భలే కనిపెట్టేసరే .......మా బత్చ్ మొత్తం నాన్న గారాల పట్టీలమే...మనిషికి తోక పెడితే అదే మేమే అని చెప్పవచు...(ఆ టైం లో...)
.వంద మంది సునీల్లు కూడా సరిపోరు ...ప్లాట్ఫారం ఏంటి ??నిన్న ప్రాజెక్ట్ చేయమన్నారు
ReplyDeleteజావాలో ప్రాజెక్టు అనగానే నా ఇంజనీరింగ్ ప్రాజెక్టు గుర్తొచ్చింది.. మేము కూడా జావాలోనే చేసామంట :-))..."చేసామంట" ఏమిటా అనుకుంటున్నారా - మరి కోడింగ్ నేను చెయ్యలేదు.. కేవలం Documentation మాత్రం చేసాను.. మా ప్రాజెక్ట్ మాత్రం మంచి experience, అలా గోదావరి గ్రామాలు తిరుగుతూ చాలా సరదాగా చేసాం.. మీ ప్రాజెక్ట్ చిక్కులు బాగున్నాయి.. :-))
ReplyDeleteJack u forgot abt our guddi practising signature of HCU HOD on bus ticket and she kept that ticket in the Project Record book itself :) :) nd we had fun time with HOD.
ReplyDeleteమీరు రెండొసారి దిగిన మాంచి అపర్త్మెంట్ కి ఓనర్ లేడా ? అపార్ట్మెంట్ అంటేనే ఒనర్స్ వుండరా ?
ReplyDeleteఇంతకీ మార్కులు ఎన్ని ?
మీ జాబ్ ఇంటర్వ్యూ లొ జావా మీద ప్రశ్నలు అడిగినప్పుడు మీ ఫీలింగ్స్ ఎమిటి.. ఎంతమంది సునీల్లు , ఎం ఎస్ నారాయణలు వర్క్ చేసారు ?
ఇప్పుడు జాబ్ లొ ప్రాజెక్ట్ మాములు జావా లొనా... ఎక్‌స్ట్రా జావాలోనా ??
ఇవన్నిటికీ తెలిసీ సమాధనం చెప్పకపొయారొ మీకు అతిభయంకరమయిన కొత్త ప్లాట్ఫాంలొ ప్రాజక్ట్ వస్తుంది జాగ్రత్త :-)
:-):-)
ReplyDeleteఅయినా మీకు ప్రాజెక్ట్ కిటుకులు తెలీనట్టున్నాయండీ...ఓ నాలుగైదేళ్ళు క్రిందట సీనియర్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లు తీసుకుని, దానికి కొద్దిగా మార్చి..(ప్రాజెక్ట్ టైటిల్..మెంబర్స్ వంటివి) మిగిలిన టైం అంతా జాలీగా గడిపేయటమే..:-)
@శివ ధన్యవాదాలు .....ఆ ఫీలింగ్స్ అన్ని నిజంగానే ఫీల్ అయ్యా ఆ టైములో.....
ReplyDelete@హారిక....అయ్యో నిజమేనే మర్చిపోయా...అంటే గుడ్డి మన సీన్ లో లేదు కదా ....అందుకే ఐడియా రాలేదు అనుకుంట....ఎక్కడయినా ఇరికించ వచేమో ట్రైచేస్తా....
కిషన్ .....మొత్తాని కి మీరు కూడా జావాలో నే చేసారన్న మాట....బ్లాగు బ్లాగు....గోదావరి జిల్లాలు తిరగాడానికే ప్రాజెక్ట్ పేరు వాడుకున్నారు అనుకుంట కదా....ఏమిటో???ఈ కాలం పిల్లలు....హి హి హి....
ReplyDeleteproject ante ento teliyadu kani pro complete chesam.project viva lo ayithe project enduku chesav ,evariki useful lanti chetta questions adigivallu.appudu naa feelings chusthe brahmanamdam feelings kuda saripov.maa proj viva antha maku teliyakunda clg vallu video tisaru(andarivi kadu,konthamandi proffessionals vi ).
ReplyDeleteమంచు గారు,అదేంటి అండి...ఇన్ని డౌట్స్ వచాయి...బ్రహ్మానందం గారి లాగా....???
ReplyDeleteరోన్దోసారి దిగిన అప్పర్మేంట్ కి ఒనేర్ లేడులెండి ...లేడు అంటే...అక్కడ లేడు అని..ఎక్కడో ఏలూరు లో ఉండేవాడు...సాదారణంగా అపర్ట్మెంట్స్ లో ఒనేర్ గొడవ ఉండదు అండి...కావాలి అంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి....ఏమంటారు??
మార్కుల సంగతి మాత్రం అడగవద్దు అని అన్నాను కదండీ..ఎందుకంటే ఏవి చూసి అందరు ఏడుస్తారు....సరేలెండి అడిగారు కాబట్టి మీకు మాత్రమే చెపుతున్న...ఎవ్వరి చెప్పకండి....188 /200 .నిజం గా నిజం అండి....
ఇక ఇంటర్వ్యూ సంగతి ఏం అడుగుతారు??ఒక్క సునీల్ ఏంటి,వడివేలు ,వివేక్,గౌండ మణి(తమిళ హాస్యనటులు ) కూడా వీకెండ్స్ కాంట్రాక్టు జాబ్స్ చేసే వాళ్ళు...ఎందుకంటే...interviews చెన్నై లో నే అటెండ్ అయ్యాను కాబట్టి....మల్లి ఇంకో సరి జావా నేర్చుకొని ,ఏదో అలా ...అలా...నెట్టు కొచ్చ ....
ఇప్పుడు జాబ్ లొ ప్రాజెక్ట్ మాములు జావా లొనా... ఎక్‌స్ట్రా జావాలోనా ??ఏం చెప్పా మంటారు లెండి...ఒక్క ఎక్‌స్ట్రా ఏంటి?త్రిబులే ఎక్‌స్ట్రా జావా నే....
:-))
ReplyDeleteజావ నేర్చుకుంటే ఇన్ని కష్టాలు వుంటాయ?? అయితే మీరు చాల కష్టపడ్డారన్నమాట.
ReplyDeleteenni java kashtalyna.....gukkedu java kosame kadandi java kavita garu
ReplyDeleteUthappa garu,Nijame chepparu andi.Kani nenu matram Java kavitha ni kadu...Utthi kavithani matrame.
ReplyDeletenaku common ga okati kanapadutundi.. mee life lo Harika matram manchi twists istundi.. good.. final ga Java lo vunnanduku...
ReplyDeleteBUt ramayanam lo villan laga.. akkadakka spelling mistakes vunayi...
Anon Garu,
ReplyDeleteThanks.Bommarillu lo Oka diolague undi...
"na life lo venakki chuskunte ...na life motham mere kanapadatharu nanna"...alage na college life lo kuda max part Harika darling ee untadi...
Actual ga nenu posts anni office lo rasi post chesinave...anduke koncham time saripovatledu..madyalo malli ma boss chudakunda rayali ane tension kuda karanam ayi unda vachu...ee sari tapa maximum thappulu lekunta rasthanu andi...Thanks again for your valuable comments.
Kavitha garu.. good.. basical ga nenu tester ni.. so anudkenemo naku tappulu baga kanapadatayi.. but tappulu cheppagane ma developer laga serious avvakunda, +ve ga teesukunanduku thanks...
ReplyDeletekeep posting.