Saturday, July 17, 2010

ఏమయినది ఆ నా వాలు జడ...







అన్నవరం సినిమా లో పవన్ కళ్యాణ్ దొంగతనాని కి వెళ్లి "జడ "కత్తిరించుకొస్తారు.....ఇంచు మించు  అలాంటి సంగటనే నాకు కూడా ఎదురయింది....ఇవాళ ట్రైన్ లో ఒక అమ్మాయి వాలు జడ చూసి నాకు నా "వాలు జడ " గుర్తుకొచ్చి ,ఏడుపొచ్చి ...వెంటనే ఇలా మొదలు పెట్టాను....


      మొదటినుంచి నాది చాల మంచి హెయిర్....సిల్కి గా, నల్లగా మరుయి  పొడుగ్గా  ఉండేది .గొప్పలు  చెప్పుకుంటున్న  అనుకుంటున్నారా ???నిజ్జం  గా నిజమే  చెపుతున్న  అండి!!!! ...సన్ సిల్క్ మోడల్  హెయిర్ లా ఉండేది .పదవతరగతి  వరకు  బాగానే ఉంది ...ఇంటర్  కి వచ్చేటప్పటికి కొంచం  కొంచం రాలిపోవడం  మొదలయింది .... ఇంటర్ లో మొదటిసారి కత్తిరించా  నా జుట్టుని ....అది కూడా శుక్రవారం  రోజు ....శుక్రవారం  జుట్టు  అస్సలు కత్తిరించకూడదు  అంట ...అప్పుడు  ఆ  విషం  తెలిసి  చావదు!!! ...అలా  చేస్తే  జుట్టు పెరగదు  అంట ....ఇప్పడు  అనిపిస్తుంది,  అది నిజమేనేమో   అని ....ఏం  చేస్తాం  అంత  విధి రాత ....ఇంకా  అప్పటి  నుంచి  కొంచం  కొంచం  గా లావు  తగ్గడం మొదలయింది ...ఇంటర్  పూర్తి  అయ్యేవరకి ....T .B   వచ్చిన  రోగిలగా  సన్నగా  అయిపోయింది ...
ఇంకా ఏమి చేస్తాం ..అది అలా  నాగుపాముల  ఉన్న  కత్తిరిస్తే  మా  అమ్మ  కొడతారు  అనే  భయంతో  ..అలాగే  మైంతైన్  చేస్తూ వచ్చా ....
రోజు మా గ్యాంగ్ ఎంత ఏడిపించిన భరించే దాన్ని కాని....కత్తిరించే ధైర్యం లేదు.ఇలాగే ఒక రెండు సంవత్సరాలు నెట్టుకొచ్చా ....కానీ హారిక కళ్ళు అన్ని నా జుట్టు మీదనే ...
అనగనగ ఒక రోజు ...సెమిస్టరు ఎగ్జామ్స్ అని 'కంబయిండు స్టేడి'  కోసం పద్దు రూం కి వెళ్ళాం ....అప్పటికి వరకు బాగానే చదువుకున్నాం ....టైం పన్నెండు కావస్తుంది...సడన్ గా హారిక....హే నీ జుట్టు బాగానే ఉంది కానీ...కొంచం షేపు చేస్తే ఇంకా బాగుంటది అని అనింది ....ఆహా నా వీక్నేస్స్ మీద కొట్టిందే!!! ...సరే  కానీ, కట్ చేయకూడదు అని చెప్పా అమాయకంగా.నీ మొహం, కట్ చేయకుండా ఎలా షేపు చేస్తారు???కొంచం అయిన కట్ చేయాలి....అంటే సరే అని ఒప్పేసుకున్న...ఒక కొంచమే అని మరీ మరీ చెప్పా.సరే నువ్వు అటు తిరుగు ...అస్సలు కదలొద్దు ...కదిల్తే షేప్ పోతది అని చెప్పారు ...సరే అని ఒప్పుకున్నా ....ఒక అద్దం ఇచ్చి కూర్చో పెట్టారు ...కదుల్తే నీ ఇష్టం ...మొత్తం పాడు అవుతది అని చెప్పేసరికి భయం వేసింది.చేస్తుంది చేస్తుంది ,...చేస్తానే ఉంది .....ఒక పావుగంట అయింది ...ఇంకా షేపు అవదే??? ....ఇంకా ఎంత సేపు.. అని అడిగా ....ఇదిగో అయిపోయింది... అని చేతులో పెట్టింది ...ఒక మూర జడ!!!! .....అప్పుడు చూడాలి నా ఫీలింగ్స్...ఏడవాలో ,నవ్వాలో కూడా తెలిదు ....వెంటనే హారిక...ఇప్పుడు చూడు ఎంత బాగుందో...ఇన్ని రోజులు పల్లెటూరు అమ్మాయి లా ఆ పాముని వెంట వేసుకొని  తిరిగేదానివి..."ఇప్పుడు అంత చిన్న జడ(పోనిటేల్) ఈ పాషన్"... అని ఒత్తాయింపు వేరే... ఏం చేస్తాం???చేసేది ఏమి లేక ఆ జడ నే చూస్తూ,ఫీల్ అవుతూ నవ్వినట్లుగా ఆక్షన్ చేశా ..
       ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ ఏమంటారో.?? అని బయపడుతునే వెళ్ళాను...'కాలు ఇంటి లోపల పెడితే ...కాలు విరుగుద్ది' అని కట్టే పట్టుకొని నిల్చున్నారు గుమ్మం ముందు.తెలియక కట్ అయింది అమ్మ.. అని చెప్పినా.. వినరే ....!!!!అల ఒక నెల వరకు ...నా జుట్టు కనపడినప్పుడల్లా తిట్ల భారతం  కొనసాగుతూనే ఉండేది...మా అమ్మ నన్ను,నేను హరికని తిట్టుకోవడం అలవాటు అయిపొయింది.కానీ...ఇంతకు ముందయినా లావు లేకున్నా, పొడగు అయిన ఉండేది .ఇప్పుడు  చూడండి.. అటు లావు లేదు ,ఇటు పొడవు లేదు(ఈ టీ లో రంగు లేదు ,రుచి లేదు టైపు లో ) ...సరే ఈ పొట్టి జుట్టయిన లావుగా పెంచుదాం లే అని అడ్జుస్ట్ అయ్యాను ...ఎన్ని చేసిన పొడవు పెరగదు,లావూ పెరగదు....ఇంకా విసుగొచ్చి జుట్టు గురించి పట్టించుకోవడం మానేసా...నేను పట్టించుకోకుంటే ,మేమయిన పట్టించుకోవాలి కదా అని మా గ్యాంగ్ రెడీ గా ఉండే వాళ్ళు...
ఇప్పుడిప్పుడే నా పొట్టి జుట్టు అలవాటు అయి ...పొడుగు జుట్టు సంగతి మర్చి పోయారు మా అమ్మ.కానీ మేము ఒకదగ్గర కుదురుగా ఉంటే కదా ...ఒక రోజు హారిక సడన్ గా వచ్చి....మా అంటీ ఒకరు బ్యూటీ పార్లర్ పెట్టారు...చాల బాగా హెయిర్ స్టైల్ చేస్తారు....నీ జుట్టు ఎలాగో పెరగట్లేదు కదా,....దాన్ని రింగులు గా మారుస్తే...కొంచం లావుగా కనపడుతుంది ...చాల తక్కువ రేటులో చేస్తారు ...అలా చేపిద్దాం అని చెప్పింది.సరే అలా చేస్తే అయిన మా అమ్మ కొంచం సంతోషిస్తారు అనుకోని సరేఅనేశా....
           నెక్స్ట్ రోజు హారిక ఇంటికి వచ్చి తిసుకెల్లింది పార్లర్ కి....అంటీ ని పరిచయం చేసాక...లోపలి కి తను మాత్రమే పంపండి అని చెప్పి వెళ్లి పోయారు ఆ పార్లర్ అంటీ ...వెళ్ళే ముందు పేస్ ఫీచర్స్ బాగున్నాయి అనే కంప్లిమేంట్ కూడా ఇచ్చారు లెండి!!!!....ఇంకేముంది రెచ్చిపోయి,సరే నే మీరు వెయిట్ చేయండి...నేను రింగుల జుట్టు చేపించుకొని వస్తాను అని చెప్పి...పోసు కొడుతూ వెళ్ళాను లోపలి.వెళ్ళంగానే కుర్చీ లో కూర్చో పెట్టి,కళ్ళ మీద కీర దోసకాయ ముక్కలు పెట్టి కళ్ళు మూసుకో అని చెప్పారు.సరే అని అలాగే కళ్ళు మూసుకొని...వాళ్ళెం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉన్నా...ఏమో రసాయనాల వాసనా ...ఎలుకలు,పిల్లు,పందులు  చచ్చిన వాసన రావడం మొదలు అయింది
...కొంచం సేపు కళ్ళతో పాటు ,ముక్కు,నోరు కూడా మూసుకున్నాను....బయట మా వాళ్ళు 'భార్య డెలివరీ టైం లో ...హాస్పిటల్ వార్డ్ ముందు టెన్షన్ పడుతూ తిరుగుతున్న మొగుడిలా ' టెన్షన్ పడుతూ అటు,ఇటు తిరుగుతున్నారు...ఎందుకంటే అప్పటికి నన్ను రూం లో కి తీసుకెళ్ళి మూడు గంటల పయిమాటే..ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి??
ఇక్కడ నా పరిస్తి ఏమో ....నన్ను చంపడానికే   ఇలా ప్లాన్ వేసారు అనుకుంట అని...ఏడుపు వచ్చిన ఆపుకొని ....ఇక ఆ ఆ వాసన తట్టుకోలే అంటీ ఏంటా వాసన అని అడిగా....కొంచం పక్కన పెట్టారా, తట్టుకోలేక పోతున్న...అని అడిగా.అంటీ వెంటనే...అది నీ తలలోంచే వస్తుంది అమ్మ ..అన్నారు...అంతే...నాకు సుక్కలు కనపడ్డాయి అనుకోండి...నా తలలోంచి ఎలుకలు చచ్చిన వాసనా???అప్పుడు కళ్ళు తెరిచా ...అసలు ఏం జరుగుతుంది ఇక్కడ...నాకు తెలియాలి ,తెలియాలి అని యమస్ నారాయణ స్టైల్ లో అడిగా...అప్పుడు ఆ అంటీ నీ జుట్టు రింగులు గా మార్చాలి అంటే ఈ రసాయనం వాడాలి అమ్మ...లేకుంటే ఆ రింగులు వారం కూడా ఉండవు అని చెప్పారు...జుట్టు మీద నాకున్న మక్కువతో భరించాలి అనుకున్న...ఒక్క సారి మా వాళ్ళని చూడాలి అని అడిగా...ఆంటీ సరే అని వాళ్ళని లోపలి కి పిలిచారు,,,,పద్దు,హారిక...లేపలికి వస్తూనే ముక్కులు ఒకరకం గా పెట్టారు...అప్పుడే నాకు సీన్ అర్థం అయింది...కాసేపు తోడు కుర్చోండే ...మూడు గంటలు కళ్ళు ,నోరు(ముక్కు కూడా) మూసుకో ని బోర్ కొడుతుంది అన్నాను..హారిక నెమ్మది గా ఈ వాసనేంటే  బాబు?? ...వాంతి కొస్తుంది అని అడిగింది...నేను పోసుకొడుతూ నాకేం లేదే అన్నాను...అవునా...అని నా పక్క ప్లేస్ లో వాసన రావట్లేదు కాబోలు అని,..నా పక్కకు వచ్చింది...అంతే...వాక్ వాక్ అని బయటకు పరుగు పెట్టారు,...ఎలాగో అలా ఆ వాసనా భరించి...మొత్తానికి రింగులు తిరిగింది అని అద్దం ఇచ్చారు ఆంటీ...అద్దం లో చుస్కున్నాక నా పేస్ చూడాలి....కరెంటు షాక్ తగిలిన కాకిలా....ఏంటి ఇది నా పేస్ఏనా??అసలు ఇంకా నన్ను ఎవరయినా గుర్తు పడతార???
వెంటనే...ఆంటీ ఈ రింగులు తిసేయ్యాలి అంటే ఎంత తీసుకుంటారు అని అడిగా....ఇంకా ఏం చేయలేము అమ్మ....ఒక ఆరు నెలలు ఐతే వాటంతట అవే పోతాయి,,,అల్ ది బెస్ట్!!! అని చెప్పి...ఒక వారం రోజులు జుట్టు దువ్వకూడదు,తలంట కూడదు...అలా చేస్తే రింగులు తొందరగా పోతాయి అని జాగ్రత్తలు కూడా చెప్పారు.అప్పుడు చూడాలి....ఒక
చిన్న సైజు పిచ్చుక గూడు నా తలమీద పెట్టి నట్లు ఉంది...బయట కొంచం సేపు కదల కుంట ఉంటె ఖచితంగా పిట్టలు గుడ్లు పెట్టి,కాపురాలు కూడా పెడతాయి....వెంటనే హరికని పట్టుకొని ఏడవాలి అని పించింది...అదేమో పక్కకు రాకే వాసన తట్టుకోలెం అంటుంది..."అత్త తిట్టినందుకు కాదు ..తోటి కోడలు నవ్వినందుకు" అన్నట్లు....బంగారం లాంటి జుట్టు ఇలా పిచుక గూడు లా మారినందుకు కాదు నా బాద ...నా జుట్టునుంచి వాసన వస్తుంది అని....వెంటనే...ఆ వాసన పోవాలి అని తల స్నానం చేశా,,,వాసన ఐతే పోయింది కానీ...గూడు మాత్రం చెదర లేదు...ఇంటి కి వెళ్తే మా అమ్మ చేతులో ఖాయం అని నిర్నయిన్చికున్న....ఏమి చేయలేక....గమ్మున వెళ్లి నిల్చున్న...అంతే కనక దుర్గ అమ్మవారి ని చూసినంత పని అయింది...నాకు ఇంకా గుర్తుంది మా అమ్మ నాతో వారం రోజులు మాట్లాడ లేదు...ఆ గూడు చెదర్చాడని కి చేయని ప్రయత్నాలు లేవు అనుకోండి,,,ఏం చేసిన ఫలితం మాత్రం అంతంత మాత్రమే...


అసలే నా తల పయిన కట్టుకున్న గూడు ని చూస్తూ నేను ఏడుస్తుంటే...నా చిన్న నాటి స్నేహిస్తుడు "సెరీనా విల్లింస్" లాగా ఆ జుట్టేంటి అని అనేసాడు...అప్పుడు చూడాలి..కళ్ళనిండా నీళ్ళు తిరుగాయి.కానీ ఆ ఎలుకల మందు రసాయనం ఏంటో గాని ఎన్ని చేసిన నా గూడు మాత్రం అలాగే ఉంటుంది...ఇది జరిగి నాలుసంవత్సరాల  పయిమాటే....గూడు చెదిరిన నా పాత జుట్టు మాత్రం నాకు రాలేదు అండి..

14 comments:

  1. :) బాగుందండి. అచ్చుతప్పులు చాలా ఉన్నాయి. కూడబలుక్కుని చదవడం కష్టమయింది.

    ReplyDelete
  2. ???నిజ్జం గా నిజమే చెపుతున్న--????????????????????latent TB/Harmonal imbalance effcts the hair madam......

    ReplyDelete
  3. Nice and hilarious narration hampered bt too many spelling mistakes

    Faustin Donnegal

    ReplyDelete
  4. వింటుంటే బాగా నవ్వొస్తుంది గానీ, అప్పుడు మీరెంత బాధ పడుంటారో ఊహించగలను :( పైన అందరూ చెప్పినట్టు మీ narration బాగుంది కానే, అక్షర దోషాలు ఎక్కువగా ఉండటం మీ రాతల అందాన్ని చెడగోట్టేస్తోంది. ఓసారి spellcheck చూసుకోండి పూర్తిగా రాశాక. మీ గూడు మాత్రం చాలా నవ్వించింది :)
    జుట్టు పోయేదే గానీ వచ్చేది కాదండీ.. ఏది శాశ్వతం ఈ పాడు జీవితంలో అనుకుంటూ ఉంటాను నేను జుట్టు గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా! ;-)

    ReplyDelete
  5. మిత్రులారా ...ఏదో హడావిడి గా పోస్ట్ చేశా ...మిస్తకెస్ ఉన్నాయా అనికూడా చెక్ చేసుకోలేదు...ఇప్పుడు సరి చేశాను ...ఈ వొక్కసారి మన్నించ గలరని ప్రార్దన...మీ అమూల్య మయిన సలహాకి ధన్యవాదములు...
    అననిమౌస్ గారు...అచ్చులు అన్ని కూడబలుకుకొని మరీ చదివి కామెంట్ ఇచ్చినందుకు చాల చాలా ధన్యవాదములు.

    అస్త్రోయ్ గారు...ధన్యవాదములు...నిజమే నండి హోర్మోనియల్ ఇమ్మ్బలేన్సు ...ఆ విషయం లేట్ గా తెలిసింది...

    మిర్చి గారు,ధన్యవాదములు..తప్పులు అన్ని సరి చేశాను అండి,మీరు చెప్పినట్లే.

    మధుర వాణి గారు...మొదటగా మీకు అభినందనలు ..మరియు ధన్యవాదములు.తప్పులు సరి చేశాను అండి....నిజం చెప్పారు అండి...జుట్టు పోయేదే కాని ,వచ్చేది మాత్రం కాదు..శాస్త్రవేతలు ఈ జుట్టు పెరగడాని కి మాత్రం ఏమి కనిపెట్టలేరు అనే చాలా బాధ పడతా ఉంటా....

    ReplyDelete
  6. కవితా నవ్వ కూడదు కాని చాలా నవ్వొచ్చింది.. ఈ విషయం లో కొంతవరకూ మనిద్దరమూ ఒక గూటి పక్షులమే..నాది మరీ వాలు జడకాదుగాని నడుం వరకూ వత్తుగా ఉండేది .. నీలాగే.. పెళ్ళయ్యాకా మావారి మేనత్త సన్నబడుతుంది షేప్ చేస్తా అని బలవంతంగా చేయించి అర మూర జుట్టు చేతిలో పెట్టే సరికి ఏడుపు ఒకటి తక్కువ .. ఆ తరువాత మళ్ళీ జుత్తు పెరగలా . ఈ లోపల మొక్కులు గట్రా మొత్తానికి పోనియే నాది కూడా .. పొటోలలో చూసుకుని నా జుట్టు ఎంత బాగుండేదో ఎలా అయిపోయిందో అని రొజూ ఫీల్ అవుతునే ఉంటా :(

    ReplyDelete
  7. నాలాగా ఎందరో అన్నమాట....
    పోయింది పొల్లు....మిగిలిందే చాలు....పోనీరా....పోతే పోనీరా... (స్నేహం సినిమాలో పాట)
    అందరికీ ఇదే నా సలహా...

    ReplyDelete
  8. నేస్తం గారు...ధన్యవాదాలు ..సరదాగా న జీవితం లో జరిగిన సంఘటన ...మీకు ఓపిక ఉన్నంత వరకు నవ్వుకోండి...అల అయిన మీ జుట్టు గురించి కొంత సేపు మర్చి పోతారు.... అడ వాళ్ళకి జుట్టు ఎంత ఇష్టం అనేది అందరికి తెలిసిన విషయమే లేండి...కానీ దాన్ని మన చేతులారా పడు చేసుకుంటున్నాం చుడండి...అదే బాధాకరం.ఎం చేస్తాం లేండి...మదుర వాణి గారు చెప్పినట్లు..ఏది శాశ్వతం కాదు లైఫ్ లో....నేను అంతే అంది మీలాగే న చిన్నప్పటి ఫోటోలతో తృప్తిపడతా వుంటా....

    సునీత ...ధన్యవాదాలు.

    సుధా...ఒక్క జుట్టు విషయం లో మాత్రం మా ఆడవాళ్లందరికి ఒకటే అభిప్రాయం ఉంటది అనుకుంట.....Thanks alot..

    ReplyDelete
  9. నవ్వ కూడదు కాని చాలా నవ్వొచ్చింది...అయ్యో కవిత గారు ... మీది నాలాంటి సమస్యే... బారుగా ఉండే జుట్టుని తిరుపతి లో మూడు కత్తెరలు తీసుకోమంటే ... సగానికి సగం కట్ చేసి పడేసాడు ...అప్పటినుండి ఇప్పటివరకు జుట్టు పెరగలేదు సరి కదా ...వూడిపోవడం మొదలయ్యింది

    ReplyDelete
  10. Kavita garu.. nizamga navva koodadu.. but navvu agadam ledu.. nizamga aa gudu matram chala bavundi.. heee.... kani meeru 2nd time kooda mee freind ni nammi malli vellaru antee adi mee tappe ga.. meeku manasuloo ekkadoo ishtame vundi.. leka pote vellaru kada..

    any how mee narration bavundi.. kani stil enka spelling mistakes vunayi.. koni words aithe ekanga miss ayayi..

    ReplyDelete
  11. @Ranjani thanks.Mana ladies ki unde common problems lo idi okati and main kuda.Ayyayyo mudu katherlaki sagan juttu cut chesara??antha pedha kathe ra na adi???Papam edavaku ...

    @Dear Anon,

    mee peru kuda chepithe bagundedhi.Thanks for u r comments.
    Mistakes thappa kunda saricheyadani ki try chetsha....

    ReplyDelete
  12. kavitha garu.. na name srinivas.. doing job in hyd.. HSBC ki pakkane..adee me paddu off ki pakkana..

    ReplyDelete